కావలెను – Part 2 66

“మరేం లేదు… నేను పనిచేసే ఆఫీసు పేరు… అదే బాస్ పేరు తెలుసుకోవాలిగా” నవ్వి అన్నాడు అనిరుద్ర..

“గుడ్ నైట్” అంది అట్నుంచి అనిమిష

“గుడ్ నైట్” చెప్పాడు అనిరుద్ర.

****

ఫోన్ మాట్లాడ్డం అయిపోయాక ఓసారి ద్విముఖ వైపు చూసింది. వెంటనే తన దగ్గరకు వెళ్లి భుజాలు కుదిపిలేపింది.

బద్దకంగా కళ్లు తెరిచింది ద్విముఖ. “సారీ… మంచి నిద్ర చెడగొట్టాను” అంది అనిమిష

“ఆ విషయం నిద్ర చెడగొట్టి మరీ చెప్పాలా?” కళ్లు సగం మూసి అంది ద్విముఖ.

“వన్స్ ఎగైన్ సారీ… చిన్న పని ఉంది” అనిమిష అంది. “ఇప్పుడా? ఏమిటి?” అనడిగింది ఆశ్చర్యంగా ద్విముఖ.

. “రేపు మార్నింగ్ నువ్వు నాతో రావాలి…”

“ఎక్కడికి?” అడిగింది ద్విముఖ..

అప్పుడు గుర్తొచ్చింది అనిమిషకు. తను అనిరుద్రను ఎక్కడ కలవాలో చెప్పలేదన్న విషయం. వెంటనే మొబైల్ తీసుకొని అనిరుద్ర నెంబర్ కు డయల్ చేయసాగింది. ద్విముఖకు విషయం అర్ధంకాక తెల్లమొహం వేసింది. సరిగ్గా అప్పుడే అనిరుద్రకు కూడా అదే డౌట్ వచ్చింది. తను ఎక్కడ కలవాలి? ఆ ఆలోచన రాగానే రిసీవ్డ్ కాల్స్లో వున్న నెంబర్ చూసి డయల్ చేశాడు. ఇద్దరూ ఒకేసారి ట్రయ్ చేయడం వల్ల ఎంగేజ్ వస్తోంది. అనిరుధ్రకు విసుగొచ్చి ఆగాడు. అనిమిష ప్రయత్నిస్తూనే ఉంది. అనిరుద్ర నెంబర్ చూసి ఓకే బటన్ నొక్కాడు.

“సారీ… ఇందాక మనం ఎక్కడ కలుసుకోవాలో చెప్పలేదు”

“అవునవును… నాకూ అదే డౌట్ వచ్చి మీ నెంబర్ కు ట్రై చేస్తున్నాను. చెప్పండి ఎక్కడ కలుద్దాం”

“బీచ్ దగ్గర కలుద్దాం…”

“గుడ్ ఐడియా… ఆ పక్కనే అయ్యర్ హోటల్ ఉంది. ఎర్లీ మార్నింగ్ పొగలు కక్కే ఇడ్లీ, కారప్పొడి, నెయ్యి కాంబినేషన్ తింటే చాలా బావుంటుంది. మీకేం అభ్యంతరం లేదంటే, నేను మా ఫ్రెండ్ ని తీసుకువస్తాను. ఎటూ మీరు మీ ఫ్రెండ్ తోనే కదా వస్తుంది”

“అలాగే” అంది అనిమిష

“మరో విషయం… హోటల్లో టిఫిన్ బిల్లు మీరు పేచేస్తారా? నేను చేయాలా? క్లారిఫికేషన్ బెటర్ కదా”

అనిమిషకు ఒళ్లు మండింది. అయినా తమాయించుకొని “నేనే పే చేసాను”

“థాంక్యూ… గుడ్ నైట్” అని ఫోన్ కట్ చేశాడు అనిరుద్ర.

***

అనిమిష మాట్లాడేది వింటూనే వుంది ద్విముఖ. అయినా ఆమెకు ఏమీ అరం.

అనిమిష ద్విముఖ వంక చూసి, “రేపు మార్నింగ్ మనం బీచ్ దగ్గరకి వెళుతున్నాం రాగలవా?” అడిగింది అనిమిష

“ఎందుకు… నీ వాలకం చూస్తుంటే నాకో డౌట్”

“డౌటా… ఏమిటది?”

“ఏమీలేదుగానీ, రేపు మార్నింగ్ మనం ఎక్కడికి వెళ్లాలి? ఎందుకు వెళ్లాలి?”

“రేపు మనం అనిరుద్రను కలుస్తున్నాం” చెప్పింది అనిమిష.

“అనిరుద్రనా? ఎందుకు… కొంపదీసి…” అని అనిమిష మొహంవైపు చూసింది.

Updated: August 12, 2021 — 2:33 pm

1 Comment

  1. Puku lagundi band cey anna

Comments are closed.