కావలెను – Part 2 66

అనిరుద్ర ఆ అమ్మాయి మొహంలోకి చూస్తూ, “పార్ట్ టైమా? ఫుల్ టైమా?” అని అడిగాడు. ఆ అమ్మాయి కంగుతిని, “అదేంటి?” అంది.

“పార్ట్ టైమ్కో రేటు. ఫుల్టైమ్ కో రేటు. నైట్ కూడా చేస్తే ఒ.టి ఇవ్వాల్సి ఉంటుంది. అన్నట్టు మీ ఫోన్ నెంబరెంత?” అన్నాడు జేబులో నుండి పెన్ తీస్తూ.

“ఎందుకు?” అనిరుద్రను సరదాగా ఏడిపించాలనుకున్న ఆ అమ్మాయి కంగారుపడిపోయి అడిగింది.

“మీ పేరెంట్స్తో శాలరీ అగ్రిమెంట్ రాయించుకోవడానికి. అన్నట్టు ఏ కాలేజీ?” మళ్లీ అడిగాడు అనిరుద్ర.

“కాలేజీ పేరెందుకు?”

“మీ ప్రిన్సిపాల్ తో ఈ డిటైల్స్ చర్చించడానికి. మీ కాలేజీలో కూడా అందరికీ తెలిస్తే బాగుంటుంది కదా…” అనరుద్ర కామ్గా చెప్పాడు.

అమ్మాయిల గుంపులో కలకలం. జీన్స్ వేసుకున్న అమ్మాయిలో భయం. ఏదో సరదాగా టీజ్ చేద్దామనుకుంటే అతనే తమకు పాఠం చెప్పేలా వున్నాడన్న భయం పట్టుకుంది. మెల్లిగా అక్కడ్నుంచి జారుకున్నారు.

“అనవసరంగా మంచి బేరం చెడగొట్టావు” కార్తీక్ అన్నాడు.

“వాళ్లేదో సరదాగా మనల్ని ఆటపట్టిస్తున్నారు. మనం ఏం చేసినా సీరియస్గానే పద…” అన్నాడు అనిరుద్ర.

“ఎక్కడికి?”

“ఎక్కడికి?”

“పత్రికలో యాడ్ ఇవ్వడానికి

“యాడా! ఏమని?”

“కావలెను. అందమైన పోస్ట్ గ్రాడ్యుయేట్ యువకుడికి ‘భర్తగా ఉద్యోగం ఇచ్చే అమ్మాయి కావలెను”

“ఏంటీ ఇలానే ఇస్తావేంటి? సీరియస్సే?” కార్తీక్లో అనుమానం.

“ఇంకా డౌటెందుకు? బామ్మ సమస్యకు, మన సమస్యకు పరిష్కారం ఇదే! అయినా నాక్కూడా లైఫ్ లో సెటిలవ్వాలని ఉంది. హాయిగా మొగుడి ఉద్యోగం చేసుకుంటూ, నెలనెలా జీతం తీసుకొంటూ వుంటే ఆ సెక్యూరిటీనే వేరు. ఎవరి కిందా పని చేయవలసిన అవసరం ఉండదు”

“భార్య కింద పని చేయాలిగా” కార్తీక్ అడిగాడు.

“పని చేయడమేమిటి? నా డ్యూటీ నేను చేస్తాను. కండీషన్స్ వెరీ క్లియర్… ట్రాన్స్పరెంట్…”

“అరే అనూ… మనం కలికాలంలోకి ప్రవేశించాం” అన్నాడు కార్తీక్ “ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్… నేనే కల్కిని. పద” అన్నాడు అనిరుద్ర.

***

స్టాఫ్ అంతా అసెంబ్లీ హాలులో బుద్ధిగా కూర్చున్నారు. పది నిమిషాల క్రితమే అందర్నీ అసెంబ్లీ హాలులోకి రమ్మని అనౌన్స్ మెంట్ చేశాడు శోభరాజ్.

‘అసెంబ్లీ హాలులో సమావేశం ఏర్పాటుచేశాడంటే ఏదో విశేషం వుండే ఉంటుంది అన్న థాట్ అక్కడున్న వాళ్లందరికీ కలిగింది. శోభరాజ్ డయాస్ మీద వున్న కుర్చీలో కూర్చున్నాడు. అర్ముగం అందరికీ కాఫీ సర్వ్ చేశాడు.

“మై డియర్ స్టాఫ్… ఈ రోజు నేనో నిర్ణయం తీసుకున్నాను” అని ఆగాడు. ఆ నిర్ణయం ఏమిటో’నని అందరూ ఆసక్తిగా శోభరాజ్వైపు చూడసాగారు.

Updated: August 12, 2021 — 2:33 pm

1 Comment

  1. Puku lagundi band cey anna

Comments are closed.