కావలెను – Part 2 66

‘అగ్రిమెంట్లో క్లియర్ గా ఉంది. మళ్లీ ఇలా మాట్లాడితే నేనూర్కోను… ఇక దయచేయండి” అంది అనిమిషం

“ఎక్కడికి?”

“ఎక్కడికేంటి? బయటకు”

“ఎందుకు… నాకు ఇక్కడ కంఫర్ట్ గానే ఉంది”

“నాకే కంపరంగా ఉంది. నేను స్నానం చేయాలి”

“ఏంటి? ఇక్కడా… బావోదేమో… బెడ్ రూమ్లో స్నానం చేస్తే ఏం బావుంటుంది?”

“ఇదిగో ఇలాంటి జోక్స్ వేస్తే నాకు ఒళ్లు మండుతుంది. నేను బాత్రూమ్లోకి వెళ్లి స్నానం చెయ్యాలి”

“చేయ్… బాత్రూంకు బోల్ట్ లేదా.. ఫర్లేదు. ఎవ్వరూ రాకుండా నేను చూసుకుంటాను”

“నువ్వు రాకుండా చూసుకోవడానికే బయటకు వెళ్లమనేది”

“ఛఛ… నేనా టైప్ కాదు. పిలవని పేరంటానికి, ఇన్వయిట్ చేయని షవర్ బాత్ స్నానానికి వెళ్లే అలవాటు లేదు నాకు”

“అరె… మీకెలా చెప్పాలి… నేను స్నానం చేస్తుంటే పీప్ హోల్ నుంచి చూడరని గ్యారంటీ ఏమిటి??

“ఎంత మంచి ఐడియా ఇచ్చావ్… నిజానికి నాకా ఐడియానే తట్టలేదు. బాత్రూంలో ఈ ఫెసిలిటీ కూడా వుంటుంది కదూ” టక్కున అన్నాడు అనిరుద్ర..

“అంటే చూసేద్దామనే…” కోపంగా అంది అనిమిష

“నేనేం చూసేయను.. ఇంతోటి అందాలు కనిపించక ఇక్కడెవరూ మొహం వాచిలేరు” అన్నాడు అనిరుద్ర. .

“అంటే మీరు అందాలను కూడా చూసేశారా?” అంది ఉక్రోషంగా.

“మరి మాకేం పని? పొద్దస్తమానం అందాలు బాబోయ్… అంటూ విశాఖపట్నం అంతా రౌండేస్తాం.. చాల్చాల్లే.. వెళ్లవమ్మా… వెళ్లు” అంటూ చెయ్యి చూపించాడు.

“నువ్వు బయటకు వెళ్తేనే నేను బాత్రూంలోకి వెళ్తాను” మొండిగా అంది అనిమిష.

“నీ ఖర్మ…” అంటూ అనిరుద్ర లేచి బయటకు నడిచి గోడకు కొట్టిన బంతిలా వెనక్కొచ్చి పడ్డాడు.

“ఏంటీ… మళ్లీ వచ్చారు?”

“నేను రాలేదు. మీ యాంకర్ ఫ్రెండ్ తోసేసింది. డిటైల్స్ మొబైల్లో చెప్తుందిట” అన్నాడు. అప్పుడే అనిమిష మొబైల్ మోగింది.

Updated: August 12, 2021 — 2:33 pm

1 Comment

  1. Puku lagundi band cey anna

Comments are closed.