కావలెను – Part 2 66

ఒక్క క్షణం షాక్ అయ్యాడు శోభరాజ్. “వ్వా…ట్… మీరు చెప్తోంది నిజమా? మీ పెళ్లా? రేపేనా?” అడిగాడు

“ఇంత సడన్గా పెళ్లేమిటి? దానిక్కూడా నేను కారణం కాదు కదా” అడిగాడు శోభరాజ్.

“ఛఛ… అదేం కాదు సర్… ఎప్పట్నుంచో ప్రేమించుకుంటున్నాం. చిన్న చిన్న ప్రాబ్లమ్స్. ఎవ్వరికీ చెప్పుకోలేని ప్రాబ్లమ్స్… ఇప్పుడు అవన్నీ సాల్వ్ అయ్యాయి… అందుకే రేపే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. సారీ సర్ మిమ్మల్ని డిజప్పాయింట్ చేస్తే”

శోభరాజ్ అనిమిష వంక చూశాడు. అతని మొహంలో చిన్న బాధావీచిక క్షణంలో మెరుపులా మెరిసి మాయమైంది.

“అదేం లేదు మిస్ అనిమిషా… ప్రేమ ఒక గేమ్.. అందులో ఎవరో ఒకరే గెలుస్తారు. అవతలి వ్యక్తి ఓటమిని స్పోర్టివ్గా తీసుకోవాలి. గెలిచిన వాళ్లను మనస్ఫూర్తిగా అభినందించాలి. అడ్వాన్స్ గా కంగ్రాట్స్… ఈ అకేషన్ ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకోవాలి” అంటూ క్యాబిన్లో నుండి బయటకు వచ్చాడు.

అప్పటివరకూ క్యాబిన్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న యాంగ్జయిటీలో వున్న స్టాఫ్ ఎక్కడి వాళ్లక్కడే సర్దుకున్నారు.

“మైడియర్ సాఫ్… మీకు స్వీట్ న్యూస్… ముందు స్వీట్స్ తినండి” అంటూ ఆర్ముగం వైపు చూశాడు. ఆర్ముగం స్వీట్ ప్యాకెట్ పట్టుకొచ్చాడు.

“అందరూ స్వీట్స్ తినండి… వేడి వేడి సమోసా తినండి… కాఫీ తాగండి… నేను చెప్పే న్యూస్ వినండి”

స్వీట్స్, సమోసా అందరికీ సర్వ్ చేయబడ్డాయి. శోభరాజ్ ఓసారి గొంతు సవరించు, “ఈ రోజు అనిమిష మనకో స్వీట్ న్యూస్ వినిపించబోతున్నారు…” అంటూ అనిమిషవైపు తిరిగి “మీరు చెప్తారా? నన్నే చెప్పమంటారా?” అని అడిగాడు.

అనిమిష సిగ్గుపడిపోయింది. శోభరాజ్ కొనసాగించాడు. “రేపు మన అనిమిష… మిసెస్ కాబోతున్నారు”

అందరూ ఆశ్చర్యంగా చూశారు. బాసే అనిమిషను పెళ్లి చేసుకోబోతున్నారా? వెంటనే స్టాఫ్లో నుంచి నిఖిత, “కంగ్రాట్స్ సర్” అంది.

శోభరాజ్ ఒక్కక్షణం ఇబ్బందిగా కదిలి, “కంగ్రాట్స్ చెప్పాల్సింది నాక్కాదు… అనిమిషకు కాబోయే శ్రీవారికి… అన్నట్టు మీక్కాబోయే శ్రీవారి పేరేమిటి అనిమిషా…” అని అడిగాడు.

“అనిరుద్ర” సిగ్గుపడ్తూ చెప్పింది అనిమిష, స్టాఫ్ అంతా షాకయ్యారు. నిఖిత ఇబ్బందిగా బాస్వైపు చూసింది. భావనలో చిన్న ఫీలింగ్. బాస్ మొహంలోని బాధ ఆమెకు అర్ధమవుతూనే ఉంది.

“లెటజ్ కంగ్రాట్స్ హర్…” అనగానే స్టాఫ్ ఒక్కొక్కరూ అనిమిషను అభినందించసాగారు.

“డియర్ స్టాఫ్… నిన్ననే నేనో ప్రామిస్ చేశాను. నా దగ్గర పనిచేసే స్టాఫ్లో ఎవరి పార్ట్నర్ కి ఉద్యోగం లేకపోయినా రెట్టింపు జీతం ఇస్తానని. అలా పెళ్లయిన వెంటనే డబుల్ జీతం అందుకునే అదృష్టవంతురాలు మన అనిమిషే. అంతేకాదు… మన సంస్థలో పనిచేసే అనిమిష కొత్త కాపురానికి కావాల్సిన ఫర్నిచర్ సమకూర్చుకోవడానికి కావాల్సిన లోన్ ఇంట్రెస్ట్ లేకుండా… సంవత్సరంపాటు కటింగ్ లేకుండా అందిస్తున్నాను” అన్నాడు శోభరాజ్.

Updated: August 12, 2021 — 2:33 pm

1 Comment

  1. Puku lagundi band cey anna

Comments are closed.