కావలెను – Part 2 66

“అందుకే…” అన్నట్టు తలూపింది అనిమిష.

“వావ్… వాటే గ్రేట్ డెసిషన్…. అదేంటి సడన్గా… వెరీ ఇంట్రెస్టింగ్… దీని మీద పెద్ద స్టోరీనే తయారుచేయాలని వుంది” అంది ద్విముఖ.

“అలాంటివేమీ చేయకు… రేపు మనం అతణ్ణి కలుస్తున్నాం”

“అంటే అతణ్ణి పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమే అన్నమాట”

“ఇష్టం కాదు… అవసరం”

“అంటే అతనితో…”

“భర్తగా అతను నా దగ్గర ఉద్యోగం చేస్తాడు. అంతే… “అదేంటి?”

“నాకు డబ్బు కావాలి”

“అతణ్ణి పెళ్లి చేసుకుంటే డబ్బు వస్తుందా? పోతుంది కానీ… నెల నెలా శాలరీ ఇవ్వాలిగా”

“అతణ్ణి పెళ్లి చేసుకోవడం వల్ల నాకు మూడు లాభాలున్నాయి చెప్పింది అనిమిషం .

“ఏమిటో ఆ మూడు లాభాలు?” అడిగింది ద్విముఖ.

“నా పనులు అతను కూడా షేర్ చేసుకుంటాడు కాబట్టి నాకు పనిభారం తగ్గుతుంది

“నెంబర్ టూ… మా బాస్ తనను పెళ్లి చేసుకొమ్మని నా వెంటపడ్తున్నాడు. నేనిప్పుడు అనిరుద్రను పెళ్లి చేసుకుంటే ఇక ఆ ప్రస్తావన తీసుకురాడు”

“అదేం…”

“అంతే… మా బాస్’ విలన్ కాదు… అదో టైప్ మనిషి… మనిద్దరం ప్రేమించుకుంటే తప్పేంటి… పెళ్లి చేసుకుంటే తప్పేంటి? అని అడుగుతున్నాడు. ఒకవేళ మీకు బాయ్ ఫ్రెండ్, వుంటే అది వేరే విషయం అంటాడు. ఎవరో ఒకరి చేసుకునే బదులు తననే పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? అంటాడు”అంది.

“మంచి లాజిక్కే.. నిజమే కదా… మరి నువ్వు మీ బాస్నే పెళ్లి చేసుకోవచ్చుగా… ఏకంగా చైర్ పర్సన్ వే కావచ్చు… నీ డబ్బు సమస్యా తీరుతుంది”

“అలా పెళ్లి చేసుకోవడం నాకిష్టంలేదు”

“మరి అనిరుద్రను ఎలా పెళ్లి చేసుకుంటావు?”

“అతనితో పెళ్లి అగ్రిమెంట్… టెంపరరీ… అతనితో తాత్కాలిక ఒప్పందం మాత్రమే ఉంటుంది. ఇందులో అతణ్ణి మోసం చేయడం ఏమీ ఉండదు” “మరి మూడవ లాభం”

“నాకు పెళ్లయితే… మా కంపెనీలో మా బాస్ పెట్టిన కొత్త రూల్ ప్రకారం నా జీతం రెట్టింపవుతుంది. రెట్టింపైన నా జీతంలోంచి నేను సిక్స్టీ పర్సెంట్ అనిరుద్రకు జీతంగా ఇస్తాను. మిగతా ఫార్టీ పర్సెంట్ నాకు మిగులుతుంది. పైగా పెళ్లై విడిగా వుంటే హౌస్ అలవెన్స్, ఫెస్టివల్ అలవెన్స్… మ్యారేజీ అడ్వాన్స్ ఇలా బోల్డు ఇస్తాడు మా బాస్”

Updated: August 12, 2021 — 2:33 pm

1 Comment

  1. Puku lagundi band cey anna

Comments are closed.