కావలెను – Part 3 102

. “ఈ గదిలోనే” అంది అనిమిష.

“నేల మీద పడుకునే క్యారెక్టర్ కాదు నాది..”

“షిట్” అంది నుదురు మీద చేత్తో కొట్టుకుంటూ అనిమిష. “షిట్ అంటే బురద అని అర్ధముంది” అన్నాడు అనిరుధ్ర.

“నా బ్రతుకు బురదలో ఇరుక్కుపోయిన…” అని ఎలా పోల్చాలో అర్ధంకాలేదు అనిమిషకు. .

“సామెతలు రానప్పుడు సైలెంటైపోవాలి. ఎగేసుకొని మాట్లాడ్డం కాదు” అన్నాడు అనిరుద్ర.

“సామెతలు తమరికొచ్చేమిటి… అయినా అందంగా పోల్చడం ఓ కళ…” అంది అనిమిష.

“అవునవును… బురదను అందంగా పోల్చు చూద్దాం”

“అంటే…” .

“బురదతో కలిపి… అందంగా నిన్ను నువ్వు పోల్చుకో” అనిమిషకు ఏం మాట్లాడాలో తోచలేదు.

“వెళ్లు… వెళ్లి పడుకో” అన్నాడు అనిరుద్ర.

అనిమిష వెళ్తుంటే మనసులో అనుకున్నాడు, “బురదలో కమలానివి నువ్వు” అని.

***

సడన్గా మెలకువ వచ్చి కళ్లు తెరిచింది. నిద్రలో ఓ కల. అనిరుద్ర గళ్ల లుంగీతో, పెట్టుడు మీసాలతో తన గదిలోకి వచ్చి తన మీద పడ్డట్టు… వికటాట్టహాసం చేసినట్టు… వెంటనే అది… తలుపు వేసి, అనిరుద్ర గదివైపు వెళ్లింది. ఒకవేళ అర్ధరాత్రి తన గదిలోకి వస్తే… బోల్టు దొంగతనంగా తీస్తే…

ఆ ఆలోచన రావడంతోనే భయమేసింది. ఏం చేస్తే బావుంటుందో… ఆలోచించగా ఓ ఐడియా వచ్చింది. వెంటనే గదికి బయట్నుంచి తాళం వేసింది. తాళం చెవిని హ్యాండ్ బాగ్ లో వేసి, రేపొద్దున్నే అతను నిద్రలేవక ముందే తీస్తే సరి” అనుకుంది. హాయిగా కళ్లు మూసుకుంది.

***

3 Comments

  1. I have read this type of novel after a long time. Really very good. Continue writing such novels. I wish you all the success.

Comments are closed.