కావలెను – Part 3 102

“ఆ డబ్బుతో నాకు కాస్త పర్సనల్ పని ఉంది. నేను లోన్ ఇన్స్టాల్ మెంట్స్ పే చేస్తాను”

“అంటే లోన్ పేరుతో తీసుకుంటున్నావన్నమాట… అవునూ నాకో డౌట్… నన్నేమి ఇరికించవు కదా… నిన్ను చూస్తుంటే కృషీ బ్యాంక్ గుర్తిస్తోంది. నాకేం టెండర్ పెట్టవు కదా..

‘ఒక్క క్షణం ఆమె కళ్లలో నుండి నీళ్లు ఉబికివచ్చాయి.

“అంత నమ్మకం లేకపోతే అప్పు వున్నట్టు ప్రామిసరీ నోటు రాసిస్తాను. ఆఫ్రాల్ అరవై వేలు నమ్మరా?” అంది ఏడుపును అదిమిపెట్టుకుంటూ..

“వద్దు… నవరసాల్లో నాకు నచ్చని రసం ఒకే ఒకటి… అది శోక రసం” చెప్పాడు అనిరుద్ర.

“అయితే మా బాస్ మీకు ఫోన్ చేసి లోన్ కావాలా? అని అడుగుతాడు. కావాలని చెప్పండి. చెక్ ఇస్తానంటాడు. తీసుకోండి. ఆ తర్వాత ఆ చెక్ క్యాష్ చేసి నాకివ్వండి”

“మనలో మాట ఈ డబ్బుతో షేర్లు కొంటున్నావా? బిజినెస్ చేస్తున్నావా?”

“ఏదో ఒకటి… ప్లీజ్” అని అనిమిష వెళ్లబోతుంటే…

“మీ బాసాసురుడు పొద్దున్నే ఫోన్ చేసి డిటైల్స్ అడిగాడు. చెక్ కూడా పంపించాడు. చెక్ ని క్యాష్ చేశాను. ఆ డబ్బు నీ గదిలో వుంది” అని చెప్పాడు అనిరుద్ర.

ఒక్క క్షణం ఆగి తన గదిలోకి వెళ్లి టేబుల్ మీద అరవై వేలు చూసింది అనిమిష. వెనక్కి పరుగెత్తుకొచ్చి అనిరుద్రను గట్టిగా వాటేసుకుంది చాలా గట్టిగా.

“థాంక్యూ.. థాంక్యూ…” అంది అతణ్ణి అలా పట్టుకొని. అప్రయత్నంగానే అతని చెయ్యి ఆమె తల నిమిరింది.

****

బ్యాంక్ నుంచి బయటికొచ్చింది అనిమిష బైక్ కోసం బాస్ ఇచ్చిన డబ్బును కూడా బ్యాంక్లో డిపాజిట్ చేసింది. రోడ్డు క్రాస్ చేస్తుండగా ద్విముఖ కనిపించింది.

“హాయ్… ఇదేంటి… రోడ్లన్నీ సర్వే చేస్తున్నావా?” అడిగింది అనిమిష.

“ఏ ప్రోగ్రామ్ చేయాలో అర్ధంకావడం లేదు. మా క్రియేటివ్ హెడ్ సంగతి తెలుసుగా… ఆలోచించండి…. వెరైటీగా… నాలా… అంటాడు. అతడాలోచించింది ఏమీ ఉండదు. మేము చించలేక చావాలి” అంది ద్విముఖ. ఆ అంది. “మేము టీవీ ఛానెల్స్ తిప్పుతూ క్షణాల్లో నిర్దాక్షిణ్యంగా మారుస్తూ ఉంటాం. మీకేమో “ఏ ప్రోగ్రాం చేయాలా? ఎలా డిఫరెంట్ గా ఉండాలా? అన్న తాపత్రయం” అంది అనిమిష.

“ఏం చేస్తాం? పీత కష్టాలు పీతవి… జార్జి బుష్ కష్టాలు సద్దాం హుస్సేన్ వి” అంది ద్విముఖ.

“పాలిటిక్స్ లోకి వెళ్లవా…. అద్సరేగానీ కాఫీ తాగుతావా?” అడిగింది అనిమిష.

“కాఫీనా…? అని ఆగి, “సరే పద… కాఫీలో కెఫిన్ మన మెదడును ఉత్తేజ పరుస్తుంది అంటూ కాఫీ షాప్ వైపు నడిచింది.

***

“ఇంతకీ ఏం పని మీద ఇటొచ్చావ్?”

“బ్యాంక్లో మనీ డిపాజిట్ చేద్దామని”

“ఎంత వరకొచ్చింది?” అడిగింది ద్విముఖ.

“వనెండాఫ్ వరకూ అడ్జస్టయ్యింది. ఇంకా మూడున్నర లక్షలు కావాలి. ఎంతగా సేవ్ చేసినా కుదరటం లేదు”

“పోనీ ఫైనాన్స్లో ట్రై చేద్దామా?” అడిగింది ద్విముఖ.

3 Comments

  1. I have read this type of novel after a long time. Really very good. Continue writing such novels. I wish you all the success.

Comments are closed.