కావలెను – Part 3 102

“సరే… అప్పుడే మీకు పెళ్లయి ఇరవై రోజులు దాటిందంటే నమ్మబుద్దేయడం లేదు” అంది ద్విముఖ.

“అవునవును” నవ్వుతూ అంది అనిమిష.

****

అనిమిష ఇంటికొచ్చేసరికి అనిరుద్ర పేపర్ చదువుతున్నాడు. అనిమిష ఫ్రెషప్ అయి వచ్చి, అనిరుద్ర పక్కనే కూర్చుంది.

“హలో… నేను అనిరుద్రని”

“తెలుసు… నా మొగుడు…” అంది అతనికి మరి కాస్త దగ్గరగా జరుగుతూ.

“ఏమో.. మళ్లీ గతంలోకి వెళ్లి… మన పెళ్లయిన విషయం మరిచి, నీ ఫ్రెండ్ ద్విముఖ అని కూర్చున్నావేమోనని”

“ఛఛ… అలాంటిదేం లేదు… అన్నట్టు మీకిష్టమైన స్వీట్ తెచ్చాను” అంటూ హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసింది.

“నాకిష్టమైన స్వీటా… నా దృష్టిలో ముద్దు తప్ప… ఇంకేమీ స్వీట్గా వుండదే” అనిమిష పెదవుల వంక చూస్తూ అన్నాడు.

మరోసారి అయితే ఉక్రోషంగా ఏదో ఓ సమాధానం చెప్పేదే… కానీ ఇప్పుడలా కాదు.

“అది కాదు… మీకు తిరుపతి లడ్డు ఇష్టం కదా. మా కొలీగ్ తిరుపతి వెళ్తుంటే మీ కోసం ఓ లడ్డూ తీసుకురమ్మని చెప్పాను. తీసుకొచ్చింది” అంటూ లడ్డూ ప్యాకెట్ తీసి ఇచ్చింది.

ఓసారి అనిమిష వంక చూసి, “ఏంటీ.. ఈ రాత్రి లడ్డూలో మత్తు కలిపి ఇచ్చి పడుకోబెడదామనే…”

“ఛఛ… నిజంగా మీ కోసమే… మీకు నమ్మకం లేకపోతే నేను తింటాను…” అంటూ కొద్దిగా చిదిమి లడ్డూ కళ్లకు అద్దుకొని నోట్లో వేసుకుంది.

“కొద్దిగా తింటే నమ్మేస్తానా… సగమైనా తినాలి” అనిమిష సగం లడ్డు తను తీసుకొని మిగతా సగం అనిరుద్రకు ఇచ్చింది. అనిరుద్ర లడ్డూను కొద్దికొద్దిగా తింటూ, “ఇక రాసెయ్” అన్నాడు.
“ఏంటి?” అడిగింది అర్ధంకాక.

“ఐస్ రాసే పని ఏమైనా ఉందా?” అనిమిష వంక చూసి అడిగాడు.

“మీరలా అంటే నేనేమీ రాయను” అంది అలిగిన ఎక్స్ప్రెషనిస్తూ.

“సరే… ఏమీ అననుగానీ ఏంటీ విషయం?”

“పాప ఏడ్చిందా?”

“అలా కాదు సీరియస్… నేను మీ కోసం బైక్ కావాలని లోన్ కు అప్లయ్ చేశాను”

“బైకా… ఆల్రెడీ నాకోటి ఉంది. టివియస్ విక్టర్… మళ్లీ ఎందుకు? అయినా నేనంటే మీకు ఎంత ప్రేమ అనిమిషా? ఇంతకీ ఆ బైక్ ఫ్రీనా? ఇన్స్టాల్మెంట్లు నేను కట్టుకోవాలా? లేదా ఆ బైక్ మీద రోజూ నిన్ను దింపాలా?”

“అసలు బైకే కొనడం లేదు”

“కొనడం లేదా… మరి లోనెందుకు?”

3 Comments

  1. I have read this type of novel after a long time. Really very good. Continue writing such novels. I wish you all the success.

Comments are closed.