కావలెను – Part 3 102

. “వద్దు… వడ్డీ భరించడం మన వల్ల కాదు” అంది . “పోనీ మీ ఆయన్ని అడక్కూడదా?”

“ఆయనా… మొన్నోసారి రెండోసారి కాఫీ అడిగానని దానికి నాలుగు రూపాయలు వసూలు చేశాడు. మనీ మైండెడ్ మొగుడు” అంది కచ్చగా.

“ఏమో… నాకు అలా అనిపించడంలేదు”

“ఎందుకనిపిస్తుంది… రెండు రోజులు ఆయనతో వుండి చూడు.. నీకే తెలుస్తుంది” అంది అనిమిష.

“నీకభ్యంతరం లేదా?” అడిగింది ద్విముఖ.

“ఏయ్… యూ… నాటీ” అంది అనిమిష .

“చూశావా… ‘నా మొగుడు నాకే సొంతం’ సినిమా అందుకే వచ్చింది” అనిమిష హాయిగా నవ్వింది. ఇద్దరూ కాఫీ తాగి డిస్పర్స్ అయ్యారు.

***

“హలో… ఎక్స్ క్యూజ్ మీ” అనిమిష ఆఫీసుకు బయల్దేరుతుంటే పిలిచాడు అనిరుద్ర.

“ఏంటీ…” ఆగి వెనక్కి తిరగకుండానే అడిగింది. “మన శాలరీ ఎప్పుడిస్తారు?”

“శాలరీనా? దానికింకా రోండ్రోజుల టైం వుందిగా… ఎప్పుడూ మనీ మనీ అని చంపుతావేంటి?”

“అది కాదు నాకర్జంటుగా కొంత అమౌంట్ కావాలి. ఓ ఫైవ్ హండ్రెడ్ సర్టగలవా?”

“ఏం… ఫైవ్ హండ్రెడ్ లేదా?”

“నా స్వార్జితం లేదు” చెప్పాడు ఒళ్లుమండి అనిరుద్ర.

“అయితే ఓ పని చేయండి. బీచ్ రోడ్డులో ఏదైనా పని వెతుక్కోండి” చెప్పి విసురుగా బయటకు నడిచింది.

“పోవే… రాక్షసి” కసిగా బయటకే అనేశాడు అనిరుద్ర. “ఏంటీ… ఏమన్నారు?” అనడిగింది వెనక్కొచ్చి.

“బైబై.. సీ.. యూ… అన్నాను” చెప్పాడు అనిరుద్ర.

* * *

ఆఫీసు వదిలిపెట్టగానే ఆటోలో బయల్దేరింది బస్సు కోసం వెయిట్ చేసే ఓపిక లేక అనిమిష, ఆటో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగింది.

ఓ వ్యక్తి ఆటో లోపలికి తల పెట్టి, “ఎక్స్ క్యూజ్ మి మేడమ్… అందమైన టెడ్డీబేర్… జత అరవై రూపాయలు. చాలా బావుంటాయి. టెడ్డీబేర్లను అందమైన అమ్మాయిలతో పోలుస్తారు. టెడ్డీబేర్ మీ ఇంట్లో వుంటే…” అతను చెప్తుండగానే తల తిప్పి చూసి షాకైంది అనిమిష.

ఎదురుగా అనిరుద్ర. టెడ్డీబేర్ బొమ్మలు చేతిలో పట్టుకుని తనకు చెప్తున్నాడు.

“మీరా..” షాకింగ్ గా అడిగింది.

3 Comments

  1. I have read this type of novel after a long time. Really very good. Continue writing such novels. I wish you all the success.

Comments are closed.