గౌతమి కొడుకు 1578

అప్పుడు యోగి ఇలా చెప్పారు,నాయనా నేను హనుమంతుడిని,పరశురాముడు స్ధాపించిన భగవతీ ఆలయ పరిరక్షకుడిని. మన జంబూద్వీపంలో సనాతన ధర్మ పరిరక్షకుడిని అరుణాచలంలో నీకు గాయాలు అయ్యినప్పుడు,నీటిలో మునిగిపోయినప్పుడు నిన్ను కాపాడింది నేనే,దక్షణామూర్తి అనే పండితుడిని నేనే,కిష్కిందలో నువ్వు కాపాడిన వృద్ధుడిని కూడా నేనే,నిన్ను అడుగడుగునా కంటికి రెప్పలా చూసుకున్నాను.
అప్పుడు శాతకర్ణి హనుమంతునికి నమస్కరించి,మీ చేతిలో మలచబడ్డ శిల్పాన్ని నేను అని కన్నీరు పెట్టుకొని ఆ యోగ కాంతికి సాష్టాంగ నమస్కారం చేసారు.
ఈ రహస్యాన్ని చాలా గోప్యంగా ఉంచాలి, మన జంబూద్వీప మనుగడకి పరశురాముని భగవతీ విశ్వవిధ్యాలయం పునాధి. నేను మహాబలి చక్రవర్తి ,జాంబవంతులవారు సరైన నాయకత్వం, పాలన, రాజ్యాభివృద్ధి కలిగేలా చూస్తున్నాము.
ఇది ఎవ్వరికీ తెలియకుండా తరతరాలుగా చేస్తున్నాము.నీవు ఎవ్వరికీ ఈ విధానం చెప్పకూడదు అని చెప్పి.
ఈ భూభాగాన్ని జంబుద్వీపాన్ని పరిరక్షించడానికి ఒక ఆయుధం నీకు ఇస్తాను అని చెప్పి అడవిలోకి తీసుకువెళ్ళారు.
అక్కడ ఒక జలపాతం క్రింద ఒక గుడి ఉంది.అది రావణాసురుని గుడి, శివాలయం కూడా ఉంది. రావణసురుని గొప్పతనానికి మెచ్చి రాముడు ఆయనకు గుడి కట్టించారు.
ఆ గుడి చాలా దట్టమైన అరణ్యంలో ఉంది అక్కడకు వెళ్ళి శాతకర్ణి, హనుమంతులవారు గుడిలో రహస్య మార్గంలోనికి వెళ్ళారు.
ఆ రహస్య మార్గంలో ఇంకొక గుడి ఉంది.ఆ గుడిలోకి వెళ్ళి చూస్తే వజ్ర వైఢూర్యాలతో కూడిన రధం ఉన్నది.ఆ రధం ఎక్కి హనుమంతుల వారు ఆకాశంలోకి ఎగిరారు.పాదరసంలో పనిచేసే ఆ రాధాన్ని హనుమంతుల వారు శాతకర్ణికి ఇచ్చి అది ఎలా ఉపయోగించాలో చెప్పి అంతర్ధానమయ్యారు.
ఆ రధం ఎక్కి శాతకర్ణి సింహళ రాజు వద్దకు వెళ్ళి తెగను ఒక యోగి కాపాడుతున్నారని చెప్పి ఆ రధాన్ని చూపించారు.
ఇంతటి యోగ్యుడికి తన కుమార్తెను పెళ్ళి చేస్తానని చెప్పి, శాతకర్ణికి తన కుమార్తెను చూపించారు.అప్పుడు రాజు గారి పేరు దంతేశ్వరుడు అని తెలిసింది. గతం స్ఫురించి యువరాణిని చూసాడు శాతకర్ణి . అప్పుడు ఆమెను చూడగానే అరుణాచలం ముందు ఎదురైన అమ్మాయి అని గుర్తుకువచ్చింది. శాతకర్ణి, ఎంతో సంతోషించి, మన కర్మ కొలది అన్నీ జరుగుతాయని తలంచి,హనుమంతుడికి నమస్కరించారు. రాజ్యం స్దిరపరిచిన తర్వాత వస్తానని చెప్పి ఆయన నావికాదళాన్ని తనతో పంపాలని కోరాడు. అల్లుడి కోరికను వెంటనే తీర్చాడు సింహళ రాజు.

ఇంతలో శివస్వతి నుండి కబురు వచ్చింది ,”మ్లేత్యులు యవనులు పశ్చిమ తీరం పై ఆవరించి ఉన్నారని”
అప్పుడు మహాబలి ఇచ్చిన పుస్తకాన్ని శాతకర్ణి తెరచి చూశాడు
శత్రువుల బలం మనకంటే పెద్దది ,వారివి మూడంతస్తుల యుద్ధ నౌకలు ,మన నౌకా దళం చిన్నది అని తీవ్రంగా ఆలోచించసాగాడు
సింహళ దేశం నుండి నౌకలు రావడానికి రెండు రోజుల సమయం పడుతుంది ఇంతలో వేళ్ళని ఎలా నిలువరించాలి అని సభ ఏర్పాటు చేసాడు
వేగుల ద్వారా వారి సైన్యం పదివేలు నౌకలు అని తెలిసింది ,శాతవాహన బలం వెయ్యి మాత్రమే
తన రహస్య మందిరం లో ఒక వ్యూహం రచించాడు
యుద్ధ నౌకలు తీరాన్ని సమీపిస్తున్నాయి
వెంటనే శాతకర్ణి పాములా పొడవుగా వున్న వంద చిన్న పడవలను రప్పించాడు,అవి మెరుపు వేగం తో కదులుతాయి.