గౌతమి కొడుకు 1578

అప్పుడు శబరిమల శిఖరం పైకి ఎక్కి మూడు వెలుగులను చూశాడు. ప్రమిదలో నీరు పోసి, సోమవజ్రాన్ని వెలిగించాడు తన ఆత్మశక్తితో దీపం వెలిగింది. ఒక్కసారిగా పెద్ద వెలుతురు వచ్చి మూడు వెలుగుల నుండి దీపానికి వెలుతురు వచ్చింది. ఆ వెలుతురు కొండ క్రింది ఒక చోట పడింది. అక్కడ ఒక గుర్రం కనబడింది. సోమవజ్రాన్ని తీసుకుని ఆ గుర్రం మీద ఎక్కి వెళ్ళాడు.
క్రిందకు వచ్చి చూస్తే అక్కడ పెద్ద కొలను ఉన్నది.
కొలను చుట్టుప్రక్కల చూశాడు ఏమీ కనబడలేదు.
కొలను లోపలికి దూకాడు శాతకర్ణి లోపల ఒక గుహలాగా ఉంది. దానికి ద్వారం ఉంది వెలుగు ఆ ద్వారం మీద ఉంది. లోపలి తలుపు తీయగా బయట తలుపు మూసుకుపోయింది, లోపల నీళ్ళన్ని బయటకు వెళ్లిపోయాయి. లోపల ఇంకో ద్వారం ఉన్నది. ద్వారం తీయగానే, ఆ వెలుగు లోపల ఉన్న ఒక వ్యక్తిపై పడింది.
ఆ వ్యక్తి సింహాసనంపై కూర్చుని ఉన్నాడు.
అద్బుతమైన ఆ ముఖవర్చస్సు చూసి ఆశ్చర్యపోయిన శాతకర్ణి నమస్కారం చేసి మహానుభావ మీరెవరూ అని అడిగాడు.
అప్పుడు శ్వేతాంబరధారి అయిన ఆయన మేని బంగారు ఛాయతో వన్నెలీనుతోంది. ఆయన వెండిరంగు గెడ్డం,వస్త్రాల అందాన్ని రెట్టింపు చేస్తున్నది.
అప్పుడు ఆయన నవ్వుతూ,”నాయనా నీ సాహసాలు,అంకుఠిత దీక్ష నాకు నచ్చాయి. నిన్ను ఈ (దేశానికి) జంబూ ద్వీపానికి చక్రవర్తిగా చేయడానికి ఘడియలు దగ్గరకు వచ్చాయి అన్నాడు.అప్పుడు ఆయన నీవు అశ్వమేధయాగం,రెండు రాజసూయ యాగాలు చేస్తావు.నీ కంటే ముందు రఘువంశ నందనుడు ఆ మహాత్కార్యం చేసాడు. ఆయన కంటే ముందు నీను ఆ పని చేసాను.నా పేరు మహాబలి చక్రవర్తి అని చెప్పాడు.నేను మహావిష్ణువు ఆజ్ఞానుసారం పాతాళలోకంలో ఉండి సంవత్సరానికి ఒక సారి ఈ భూమి మీదకు వస్తాను.
నేను, నా స్నేహితుడు ఈ జంబూద్వీపానికి పరిరక్షకులము.పూర్వo దక్షిణ జంబూద్వీపం నిత్యం సముద్రుడు ఆధీనంలో ఉంది, ఎప్పుడూ జీవజాతులు సముద్రుని కోపానికి బలి అవుతూ ఉండేవి. దైవ సంపన్నుడు, దివ్యాంశ శంభూతుడు అయిన పరశురాముడు, దుష్ట క్షత్రియ వధ చేసి, రాజ్యాన్ని స్దాపిoచాలనుకున్నారు. కానీ సముద్రుడు వల్ల ఉన్న ముప్పును ముందే పసిగట్టిన భార్గవరాముడు అతనితో యుద్దం చేసి కట్టడి చేసాడు.
సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన భాధ్యతోను తన నెత్తిన వేసుకున్న పరశురాములవారు అగస్త్యమునితో కలసి కొడంగల్లూరులోని భగవతి అమ్మవారిని ప్రతిష్టించారు.ఆదిశక్తి మహిమ వల్ల అక్కడ గురుకులం స్థాపించి అన్ని శాస్త్రాలను అభివృద్ది చేసారు.”అని అన్నారు.
అప్పుడు మహాబలి శాతకర్ణిని తీసుకుని ఆలయం క్రింద ఉన్న సొరంగ మార్గంలో ఇంకొక భూగర్గ ఆలయంలోకి తీసుకెళ్లారు. అందులో అందరూ ఒక మర్మకళను అభ్యసిస్తున్నారు. అందులో శిక్షణ చాలా కఠినంగా ఉంది.
అది చూసిన శాతకర్ణి, “రాజోత్తమా,మిమ్ముల్లి కలవడం నా జన్మ అదృష్టం, నేనెంతో పుణ్యం చేసుకున్నాను. మీరు మహా గ్రేసరులు, అంతకు మించి మానవోత్తములు.ఈ యుద్దవిధ్య ఏమిటో సెలవివ్వగలరు” అన్నారు.
దీన్ని పరశురాములు వారు అభివృద్ది చేసారు. అగస్త్యముని, ఎంత ప్రయాసలకొర్చి దీన్ని శిష్యులకు నేర్పించారు.
మేమందరం దీనిని కలరి అని పిలుస్తాము. ఇది మానసిక, శారీరక పరిపూర్ణత పొందిన వారే చేయగలరు. మేము చిన్నవయసు నుండి ఈ యుధ్ధకళను నేర్పిస్తాయి. దాంతో వారు పరిపూర్ణ సైనికులవుతారు. వారిని ఈ మహాభారత సామ్రాజ్యానికి పరిరక్షకులుగా నియమిస్తాము.
ఇందులో కొందరు సంఖ్యాశాస్త్రం, ఆర్ధికశాస్త్రం, శల్యశాస్త్రం, వైద్యశాస్త్రంలో కూడా నిష్ణాతులు మన సామ్రాజ్యానికి పునాది రాళ్ళుగా ఉన్న ఈ విజ్ఞులను ఈ భగవతి ఆలయమే తయారు చేసింది.కాలాలు మారినా ఈ దేశాన్ని రక్షించడానికి కొందరు చిరంజీవులను ఈ ఆలయం ఆదేశించింది.అందులో నేను, నా స్నేహితుడు ముఖ్య భూమిక పోషిస్తాము “అన్నారు.
అప్పుడు శాతకర్ణిని చూసి మహాబలి నాయనా నీ తేజస్సు నిన్ను చూస్తుంటే నీ తాత గారు శ్రీముఖుశాలివాహనుని చూస్తున్నట్లుంది. ఆయన మహా తేజోమంతుడు.
అప్పుడు శాతకర్ణి మహాబలితో,” విప్రవర్య, దయచేసి మా తాతగారి గురించి నాకు చెప్పండి “అన్నారు

అప్పుడు శాతకర్ణి మహాబలితో,” విప్రవర్య, దయచేసి మా తాతగారి గురించి నాకు చెప్పండి “అన్నారు.
మహాబలి అప్పుడు ఇలా అన్నారు … “ఈ దేశాన్ని విక్రమాధిత్యుడు వేల సంవత్సరాలు పాలించారు. తన తమ్ముడు భట్టితో కలసి
కొంతకాలానికి సైన్యాధ్యక్షులు అధికారదాహం వల్ల సామంత రాజులు రాజ్యాలను కొల్లగొట్ట సాగారు. అలాగే శ్రీముఖుని తండ్రి రాజ్యాన్ని తగుల బెట్టారు.కోపంతో రగిలిపోయిన 10 ఏళ్ళ శ్రీముఖుడు, విక్రమాధిత్యుని ఓడించడానికి లక్షమంది సైన్యాన్ని తయారు చేసాడు.”
అప్పుడు శాతకర్ణి ఆశ్చర్యపడి ఇది ఎలా సాధ్యం అన్నారు.