గౌతమి కొడుకు 1576

అప్పుడు దక్షిణామూర్తి చూసి భళా “ చేతిలో కత్తి ఉన్న వాటిని చంపకుండా జీవకారుణ్యం చూపించావు” అని అన్నారు.
అప్పుడు దక్షిణామూర్తి ఆఖరి తలుపు తీసి స్పటిక లింగాన్ని చూపించి .అప్పుడు అడిగాడు, దక్షణామూర్తి, శివలింగం అంటే ఏమిటి అని .
వెలుగులు జిమ్ముతున్నఆ శివలింగం అంతా ప్రకాశంగా ఉంది.అప్పుడు శివలింగాన్ని చూసి ధ్యానం చేసి శాతకర్ణి ఆ శివలింగం మానవుని శుఘమ్న నాడి కి చిహ్నం అని చెప్పాడు.
అప్పుడు శాతకర్ణి తీక్షణంగా శివలింగాన్ని గమనించాడు. రెండు కెంపులతో శివలింగానికి రెండు కళ్ళు ఉన్నాయి.శివునికి మూడో కన్ను కూడా ఉంటుంది. అని ఆలోచించుకొని రెండు రెండు కన్నుల మధ్య గంధం రాసి ఉంది,అది తొలగించాడు శాతకర్ణి. శాతకర్ణి అప్పుడు మూడో కన్ను బంగారు రేకుతో చేయబడిన ఆ కన్నును ప్రక్కకు జరిపాడు రేకు తీయగానే ఎంతో ప్రకాశంతో వెలుగుతున్న సోమ వజ్రాన్ని చూసాడు.
ఆ వజ్రాన్ని తీసుకుని ఇదే అరుణాచలంలో వెలుగు అనుకోని ముందుకు వెళ్ళాడు . దక్షిణామూర్తి దగ్గరకు అంతలో ఒక సంఘటన జరిగింది. ఒక త్రిశూలం వచ్చి దక్షిణామూర్తికి తగిలింది .రక్తం ధారగా కారిపోతుంది .అప్పుడు శాతకర్ణి ఆలోచించి నాకు గొంతుకు ,చేతికి ఉన్న గాయాన్ని ఈ కాంతి నయం చేసింది.
కానీ దక్షిణామూర్తి చెప్పాడు ,నీవు కారణజన్ముడివి ,కాబోయే చక్రవర్తివి,ఈ వజ్రాన్ని తీసుకు వెళ్ళు ఇంకొన్ని క్షణాల్లో కార్తీకమాసం 22వరోజు వస్తుంది .అప్పుడు ఈ కాంతి వెళ్లిపోతుంది .
అప్పుడు శాతకర్ణి ఒక మనిషి ప్రాణం కన్నా ఇదేమి ముఖ్యం కాదని తలచి ఆ కాంతిని దక్షిణామూర్తి గాయంపై ప్రసరింపచేశాడు .సోమ వజ్రం వెలుగు పోయింది వెంటనే దక్షిణామూర్తి గాయం నయం అయ్యింది . దక్షిణామూర్తి మామూలు మనిషి అయ్యాడు .
అప్పుడు దక్షిణామూర్తి చెప్పాడు .శివుని యొక్క ఆత్మశక్తి ఈ అరుణాచలాన్ని తేజోమయం చేస్తుంది ,కానీ ఈ స్థలం నిన్ను నువ్వు తెలుసుకొనేలా చేస్తుంది .ఆత్మ సాక్షాత్కారం కలుగ చేసే పుణ్యభూమి .నీవు ఈ స్థితిని సాదించావు. నీకు కావలిసిన వెలుగు నీలోనే ఉండి .నీవే చూడు నీకే కనిపిస్తుంది.అన్నాడు.
వెంటనే శాతకర్ణి శరీరంలోనుంచి వెలుగు(ఆత్మశక్తి ) వజ్రం లోకి వచ్చింది అప్పుడు దక్షిణామూర్తి ని, ధైర్యసాహసాలు అన్నీ నిరూపించుకున్నావు. బుద్ది బలం ,యోగ బలం నిరూపితమైనది.నీవు తక్షణం రిష్య ముఖ పర్వతం వద్దకు వెళ్ళు .అక్కడ మీ ముత్తాత శాలివాహనుడు గురించి నీకు తెలుస్తుంది.

శాతకర్ణి తన గుర్రం మీద ఎక్కి సోమవజ్రాన్ని సంచిలో పెట్టుకుని కిష్కింద రాజ్యానికి బయలుదేరాడు.
ఋష్యముఖి పర్వతం కిష్కింధ రాజ్యం వద్ద ఉన్నది.
కిష్కింద రాజ్యాన్ని అనిరుద్ధుడు అనే మహారాజు పాలిస్తున్నాడు. వాలి సంతతికి చెందినవాడు.
రాజ్యం పర్వతాల నడుమ ఉన్నది. చుట్టూ పర్వతాలు గోడల్లా ఉన్నాయి. రెండు కొండల మధ్య మార్గం ఉన్నది. అది ముఖద్వారం. ఒక్కో కొండపై ఒక వానర వీరుని శిల్పం ఉన్నది. వాళ్ళిద్దరూ మల్లయుద్ధం చేస్తున్నట్టు ఉన్నది. చేతుల రెండూ బాహాబాహీ చేస్తున్నట్టు ఉన్నది, అది ఆ ముఖద్వారానికి తోరణంలా ఉన్నది. ముఖద్వారం వద్ద వానర వీరులు శాతకర్ణిని ఆగి ఆది విచారించారు. తాను శాలివాహన యువరాజు అని శాతకర్ణి చెప్పాడు.
అరుణాచలంలోని తీవ్ర ఒత్తిడి వల్ల బక్కపలుచగా తయారయ్యాడు శాతకర్ణి.
వానరవీరుడు నువ్వు యువరాజా? అని గేలి చేసి కయ్యానికి కాలుదువ్వారు.
వెంటనే శాతకర్ణి గర్వం అణచాలని చెప్పి వారితో యుద్ధం చేశాడు.
కానీ వానర వీరుల బలం ముందు శాతకర్ణి నిలువలేకపోయాడు. వాళ్ళు ముగ్గురూ కలిసి శాతకర్ణిని మట్టికరిపించారు.
శాతకర్ణిని బంధించాలని చూశారు, అప్పుడు శాతకర్ణి శివుడిని తలచుకుని సోమవజ్రాన్ని బయటకు తీశాడు.
ఆ శక్తికి తాళలేక వానర వీరులు పారిపోయి తమ రాజ్యంలోని సాధువుని తీసుకువచ్చారు.
ఇదేదో మంత్రజాలమని తలచి ఆ సాధువు వచ్చి శాతకర్ణిని చూసి, “నాయనా ఇది సోమవజ్రం, శివుని తేజస్సు గలది. ఇది సామాన్యులకు దొరికేది కాదు. నీవు కారణజన్ముడివి నిన్ను మా గురువుగారి వద్దకు తీసుకువెళతాను” అని తీసుకెళ్ళాడు.
సొరంగ మార్గంలో నుంచి భూగర్భగుడిలోకి ప్రవేశించారు ఇద్దరూ.
ఒళ్ళంతా తెల్లని జుట్టుతో సింహాసనం మీద ఉన్న ఒక యోగిని చూశారు శాతకర్ణి.
ఆ గదిలో వానరులు మల్లయుద్ధం, గదాయుద్ధ శిక్షణ పొందుతున్నారు.
అప్పుడు శాతకర్ణి నమస్కరించి, “యోగిపుంగవా, ఎవరు మీరు? “అని అడిగాడు.
ధ్యానంలో ఉన్న ఆ యోగి, శాతకర్ణి చేతిని చూసి, నాయనా నీవు అచ్చం మీ ముత్తాతలా ఉన్నావు, మీ ముత్తాత కుండలిని కూడా అదే అని అన్నారు.
ఆశ్చర్యంగా చూశాడు శాతకర్ణి
“నా పేరు జాంబవంతుడు. నేను ఈ కిష్కింధ రాజ్యానికి రక్షకుడిని “అని అన్నారు ఆ యోగి.
అప్పుడు జాంబవంతునికి నమస్కరించి శాతకర్ణి, మిమ్ములను కలుసుకోవడంతో నా జన్మ ధన్యమయినది.
“నా ముత్తాత మీకు తెలుసా “అన్నాడు.