గౌతమి కొడుకు 1578

తుఫాను తగ్గకపోవడంతో ఆ వృద్ధ దంపతులకు, ఆహారం నీరు సమకూర్చే వాడు.
ఒక రోజు గుహలోకి మొత్తం నీరు వచ్చేసింది ముదుసలి దంపతులు మునిగిపోతున్నారు. అప్పుడు వాయు స్తంభన విద్యతో, తాను మునిగి వారిద్దరినీ పైకి లేపి ఉంచాడు.
తుఫాను తగ్గిన తర్వాత తాత ” నాయనా మాకు చాలా సేవ చేశారు. నీ రుణం తీర్చుకోవడానికి ఈ హారం తీసుకో, దారిలో ఉపయోగపడుతుంది అన్నారు.
కానీ ఈహారo ఎవరికీ చూపించకూడదు అన్నారు.
ఈ హారం వాలికి ఆయన తండ్రి ఇంద్రుడు ఇచ్చింది. ఇది ఎవరు పడితే వారు ధరించలేదు. దీని శక్తిని తట్టుకుని నిలబడలేదు. కాబట్టి నీవు కారణజన్ముడిలా ఉన్నావు. నీవు బలశాలిలా ఉన్నావు,తీసుకో “అన్నారు.
శాతకర్ణి హారం వేసుకున్నాడు. కానీ దాని శక్తిని తాళలేక తాతకి ఇచ్చేశాడు. తాత శాతకర్ణితో “అంజనాద్రి చిట్టచివర కొన్ని మూలికలు ఉంటాయి అవి నీకు చూపిస్తాను కానీ నేను అంత ఎత్తు ఎక్కలేను అన్నాడు. ”
తాతని భుజం పై వేసుకుని శాతకర్ణి చిట్టచివర పర్వతంపైకి వెళ్ళాడు. అక్కడి చెట్టుకి యక్షులు కాపలా కాస్తున్నారు. అప్పుడు యక్షులతో శాతకర్ణి యుద్ధం చేశాడు. యుద్ధంలో యక్షులు భయంకరంగా పోరాడుతున్నాడు. ఆఖరికి మొలలో ఉన్న సంచిలో ఉన్న సోమవజ్రాన్ని బయటకు తీశాడు. కానీ ఆ కాంతిని తట్టుకుని యక్షులు మళ్ళీ పోరాడసాగారు. వారి యుద్ధ నైపుణ్యం ముందు శాతకర్ణి నిలువలేక పోయాడు. అప్పుడు శాతకర్ణి తాత వద్ద దాచిన హారాన్ని వేసుకున్నాడు. వెంటనే శాతకర్ణి శక్తి పెరిగింది. యక్షులను ఓడించి బంధించాడు.
అప్పుడు ఆ మూలికలను తీసుకుని గుహలోకి వచ్చాడు శాతకర్ణి తాతతో అన్నాడు శాతకర్ణి, ముందు నేను హారాన్ని వేసుకున్నప్పుడు తాళలేక పోయాను, ఇప్పుడు ఎలా భరించగలిగాను అన్నాడు.
అప్పుడు తాత “ముందు నువ్వు సందేహంతో వేసుకున్నావు, నాలో ఆ శక్తి ఉందా అని, “ముందు వానరుల చేతిలో ఓటమి గుర్తుకు వచ్చి”
ఇప్పుడు నువ్వు నేను యక్షులను ఓడిoచాలి అని సన్నద్ధమై ఈ హారాన్ని ధరించావు.
మొదట నీలో అంధకారం పాళ్ళు ఎక్కువ, ఇప్పుడు నీలోని వెలుగు అంధకారాన్ని జయించింది.
ఈ హారం యొక్క శక్తి అదే విజయీభవ అని మూలికతో మీ ప్రాంతానికి వెళ్ళు అన్నారు” తాత.
ఉత్సాహంతో శాతకర్ణి జాంబవంతుని వద్దకు వచ్చాడు.
నాయనా నీకు కావలసిన దేహదారుఢ్యాన్ని, యుద్ధ నైపుణ్యాన్ని కూడగట్టుకున్నావు.
ఈ ములికా రసంతో నా సైన్యాన్ని ఇంకా బలంగా తీర్చిదిద్దుతాను అని అన్నారు.
అప్పుడు మహారాజు అనిరుద్ధుడు వద్దకు జాంబవంతుడు తీసుకెళ్ళాడు.
శాతకర్ణికి నమస్కరించి అనిరుద్ధుడు, మీ తాతగారు మా రాజ్యం కష్టకాలంలో ఉన్నప్పుడూ మాకు చాలా సాయం చేశారు. ఇప్పుడు మీకు ఏమైనా సాయం కావలిస్తే మమ్ములను అడగండి అన్నాడు. అప్పుడు శాతకర్ణి సమయం వచ్చినప్పుడు నేను అడుగుతాను. ఇక్కడ నుండి ఋష్యముఖి పర్వతానికి వెళ్ళాలి అనుమతించండి అని అడిగాడు.
మా సంతతి వారు ఆ పర్వతం పైకి వెళ్ళడం నిషిద్ధం. మహా వాలికి మాతoగ ముని శాపం అది ,కావున మీరు ఒంటరిగా వెళ్ళండి అని చెప్పాడు.
అప్పుడు ఋష్యముఖి పర్వతం పైకి వెళ్ళాడు శాతకర్ణి.

అప్పుడు ఋష్యముఖి పర్వతం పైకి వెళ్ళాడు శాతకర్ణి.
అక్కడ మాతంగ మహర్షి ఆశ్రమం ఉంది. ఆయన వారసులు ఉన్నారు.
అప్పుడు శాతకర్ణి మునులతో చెప్పారు. “నేను శాలివాహన రాకుమారుడిని దీపంతో నూనె కాకుండా జలంతో వెలగాలి.దీపాన్ని వెలిగించే జలాన్ని అన్వేషించ వచ్చాను, కాబట్టి మీరు మార్గం చూపించాలి” అని అన్నారు. ఇక్కడి కొలనులోని జలాన్ని శివుని ఆత్మలింగంపై అభిషేకించాలి అప్పుడు ఆనీటికి దీపాన్ని వెలిగించే శక్తి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఒక కొలను చూపించి ఈ జలం తీసుకోండి అన్నారు. కొలనులో నీళ్ళు లేవు. ప్రతీ సంవత్సరం మార్గశిర ఏకాదశి నాడు ఆకాశగంగ ఇక్కడకు వస్తుంది, ఆ ఆకాశగంగని తీసుకోవడానికి పాత్ర మాత్రం తెల్ల ఆవునుండి తయారుచేసినదై ఉండాలి, కానీ ఆ జంతువు రక్తం మాత్రం చిందకూడదు. ఆ రక్తం ఈ ఆశ్రమ భూమిపై చిందితే ఈ ఆశ్రమం శాపం నీకు తగులుతుంది అన్నాడు.