గౌతమి కొడుకు 1575

ఇంతలో ఇందాక ఉయ్యాల ఊగుతున్న కోతిపిల్ల శాతకర్ణి కట్లు విప్పేసి కేరింతలు కొడుతూ వెళ్ళిపోయింది. అప్పుడు శాతకర్ణి అనుకున్నాడు “ఆమె గంధర్వురాలై ఉంటుందా,లేక మత్స్యకన్యా ? లేక నాగకన్యా ?. ఏమి సౌందర్యo ! ….పూర్ణచంద్రుడు లాగా పరిపూర్ణంగా ,జాలువారుతున్న కురులు తేనెటీగల సమూహంలా,నెలవంకను పోలిన వికసించిన పెదవుల సమాహారం, సివంగిని గుర్తుకు తెచ్చే ఆ నడుము, ఆ వయ్యారాల హంస నడక, శ్వేతాంబరాల వంటి మేనిఛాయ ,కస్తూరి సువాసనలతో ,మల్లెపువ్వు లాగా ,కోకిల కంఠం తో ,మన్మధుడే దిమ్మతిరిగేలా వెల్లువిరిసిన వసంతం లాగా ఉంది ఆ దివ్యంగన.”

ఆమె మైకంలో పడి శాతకర్ణి ఆమె గురించే తలచుకుని మురిసిపోయి, కొన్ని రోజులకి ఎలాగైనా ఆమెను పొందాలని చాలా ప్రాంతాలు వెదికాడు.
ఆమె దొరకలేదు వైరాగ్యంతో కృంగిపోయాడు.
అప్పుడు యువరాజు ఒక కొండ వద్దకు వచ్చి అక్కడ శివాలయంలో తలదాచుకున్నాడు.

అక్కడ శివమహాపురాణం చెబుతున్నారు పండితులవారు.
“ఈ అనంతవిశ్వం ఒక నల్లరాయిలా ఏర్పడింది. విశ్వశక్తి అంతా శివుని రూపంలో వచ్చింది. శివుని నుంచి ఆదిశక్తి, బ్రహ్మ వచ్చారు. బ్రహ్మ సప్త ఋషులను సృష్టించారు. బ్రహ్మ సృష్టికర్త అయ్యి సంధ్యను సృష్టించారు. బ్రహ్మ మానసపుత్రుడు మన్మధుడు. మన్మధుని కారణాన కామం పెరిగిపోయింది. ఆ కామం పరమశివుని మీద అస్త్రం ఎక్కుపెట్టినప్పుడు మన్మధుడు బూడిద అయిపోయాడు.
అప్పుడు మన్మధుడి ప్రభావం వల్ల బ్రహ్మ కామం తో ఆమెను చూడటం వల్ల తట్టుకోలేక సంధ్య కూడా అగ్నిప్రవేశం చేసి ప్రాతః సంధ్య శ్యామ సంధ్యగా మారిపోయింది.
అలా తన తేజస్సుని మార్గశిర మాసంలో అగ్నిగా మార్చి ఈ అరుణాచలం పై వెలిశారు మహాశివుడు “అని చెప్పాడు.
అప్పుడు ఆలోచన వచ్చింది, శాతకర్ణికి.
గ్రంథం లో మొదటి వాక్యం, సృష్టిమూలం అగ్గిరవ్వ అయితే అంటే ఈ అరుణాచలంలో ఆ అగ్ని నాకు దొరుకుతుంది.,అని ఈ అరుణాచలానికి ఎలా వెళ్ళాలి అని ఆలోచించాడు.
అరుణాచలం కొండ క్రిందకు వచ్చి శాతకర్ణి అంతా వెదికాడు ఏమైనా దారి దొరుకుతుందేమోనని.
అంతా దట్టమైన అడవి, యువరాణిని ఇంకా మరిచిపోలేకుండా ఉన్నాడు శాతకర్ణి.
అప్పుడు ఒక శివాలయం కనిపించింది. అందులోని పూజారి పేరు దక్షిణామూర్తి, దక్షిణామూర్తికి జరిగిన సంగతి అంతా చెప్పి తనకు దారి చూపించమన్నాడు శాతకర్ణి అప్పుడు పూజారి “నాయనా ఇది శివుడు తన ఆత్మశక్తి జ్వాలగా మార్చి వెలసిన ప్రదేశం. బ్రహ్మ కుమారులు(సనక, సనాతన, సనందన, సనత్ కుమారులు ) నలుగురూ అన్ని శాస్త్రాలను ఔపాసన పట్టినా ఏదో తెలియని తనం వెంటాడుతూ ఉండేది.
అప్పుడు జ్ఞానం సంపాదించుకోవడానికి పరమేశ్వరుని వద్దకు వచ్చి జ్ఞానం ఉపదేశించమని చెప్పారు.
శివుల వారు దక్షిణామూర్తిగా మారి ఒక భోధి వృక్షం దగ్గర ఉపదేశం చేశారు.
ఆ ఉపదేశం సారాంశం ఏమిటంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలని.నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే తురియ స్థితికి చేరాలి, అది సమాధి స్థితికి ముందు స్థితి.ఆ భోధి వృక్షం ఇక్కడే ఉంది.ఆ స్థితి పొందడానికి నీకు నేను సాయం చేస్తాను “అన్నారు.
ఇది కార్తీక మాసం, కార్తీక మాసం 21వ రోజున శివుని శక్తి సంపూర్ణంగా వెలుగు రూపంలో కనపడుతుంది. ఆ శక్తికి మూలం ఎక్కడో ఎవరికీ తెలియదు. నువ్వు తెలుసుకుంటే నీటిలో దీపం వెలిగించే అగ్గి రవ్వ దొరుకుతుంది అని అన్నారు.