గౌతమి కొడుకు 1543

తమకు నాలుగు రెట్లు వున్న శత్రువులను ధైర్యం తో ఎదురు నిలిచారు శాతకర్ణి సైన్యం
ముందుకు దూసుకువచ్చింది పక్షి ముందు భాగం అశ్వదళం తో, వెనుక నుండి బాణాల వర్షం కురిసింది శాతకర్ణి సేన మీదకు .అప్పుడు శాతకర్ణి సైనికులు తయారుచేసిన యుద్ధగజాలను ముందుకు వదిలారు.
తొండాలకు కట్టిన ముళ్ల గుండ్ల తో శత్రు అశ్వాలపై విరుచుకు పడ్డాయి.
ఊహించని పరిణామాలకి హుతాశులయ్యారు నాహాపణ సైన్యం .
గరుడవ్యుహం ముక్కు పగిలిపోయింది
శాతకర్ణి మధ్యలోంచి సింహం పైకి ఎక్కి ఉరిమి కత్తి తో ముందుకు ఉరికాడు
కానీ నాహాపణ సైన్యం చండ ప్రచండం గా ఉన్నది. నిలువరించ లేకపోతున్నారు.
శాతకర్ణి ఎగిరే రధం ఎక్కి భాస్వరం నిండిన గోళాలను ఆకాశంనుండి వదిలాడు.
వాటిని నిప్పు బాణం తో కొట్టాడు.

నాహాపణ సైన్యం చండ ప్రచండం గా ఉన్నది. నిలువరించ లేకపోతున్నారు.
శాతకర్ణి ఎగిరే రధం ఎక్కి భాస్వరం నిండిన గోళాలను ఆకాశంనుండి వదిలాడు.
వాటిని నిప్పు బాణం తో కొట్టాడు.
భయంకరమైన పేలుడు సంభవించి శత్రుసైన్యం చెల్లాచెదురు అయ్యారు.
ఇప్పుడు భగవతి ఆలయం నుండి వచ్చిన వీరులు రంగం లోకి దిగారు .రెండు చేతులతో ఉరిమి ని పట్టి ఒక్క వేటుతో పది మందిని బలితీసుకున్నారు . క్యాలరీ విద్య లో ౧౦౮(108 )రకాలు ఉన్నాయి ,వాటిని మార్చి మార్చి ఉపయోగించారు.దెబ్బకు శత్రు సైన్యం సగమైంది .
అప్పుడు శాతకర్ణి తన సింహం ఎక్కి సైన్యం పై విరుచుకు పడ్డాడు. మహావాలి కి చెందిన హారాన్ని ధరించి రెండు చేతులలో ఉరిమి కత్తులను పట్టి చేతులను చాచి మణికట్టు వద్ద వేగంగా గుండ్రంగా తిప్పాడు , సింహం వేగానికి ఎత్తులు సుడిగాలి గా అగుపించాయి .మధ్య మండలం లో ఉన్న శత్రుసైన్యం తుడిచిపెట్టుకుపోయింది. ఇంతలో గాయపడిన తన సైన్యం వద్దకు వచ్చి సోమవజ్రం తో వారి గాయాలు మానేలా చేసాడు.
గాయపడిన ఏనుగులు శక్తి పుంజుకున్నాయి .ఇంతలో సూర్యాస్తమయం అయ్యింది .
తర్వాతి రోజు యుద్ధం మొదలైంది .
శాతకర్ణి శూల వ్యూహం రచించాడు. తక్కువ సైన్యం తో సూది ని పోలిన వ్యూహాన్ని రచించాడు.
దానికి ధీటుగా రెండు వరుసలలో గోళాకార వ్యూహాన్ని అమలు పరిచాడు నహపాణుడు,విజయం మీద ధీమా తో.
కానీ తన సైన్యాన్నంతా ఒకే చోట పెట్టి తప్పు చేసాడు.
ఇంతలో శత్రు సైన్యానికి కుడి వైపు గండ్ర గొడ్డలి ఉన్న జెండాలు కనిపించాయి ….త్రికోణాకారం లో కిష్కింద నుండి అనిరుద్ధుడు సైన్యం ఆఘమేఘాల మీద గోళాకారం ను చుట్టుముట్టాయి. ఎడమ వైపున మహా బలి ,మహా బలి అని అరుపులు వినిపించాయి ,భగవతి ఆలయం లోని అశ్వదళం మరో త్రికోణం ఆకారం లో ఎడమవైపు గోళాన్ని చుట్టుముట్టాయి .
పైనుంచి రధం లో చూస్తున్న శాతకర్ణి కి మధ్య లో శూలానికి గుచ్చిన గోళం ,గోళం ఇరువైపులా రెండు త్రికోణాల తో గండ్రగొడ్డలి ల వుంది ….దీన్నే గండ్రగొడ్డలి వ్యూహం అంటారు అని మహాబలి ఇచ్చిన పుస్తకం లో వుంది.
నహపాణుడు ఓటమి ఒప్పుకోక తప్పలేదు.

ఇలా శాతకర్ణి ఒక పెద్ద సామ్రాజాన్ని నెలకొల్పాడు జంబూ ద్విపం లో .

యువరాజు ను చక్రవర్తి గ పట్టాభిషక్తుడిని చేసాడు శివస్వతి .

ఇంకా వివాహం చేద్దామన్నంతలో సింహళ రాజు నుండి వర్తమానం అందింది. అందులో ఏమున్నది అంటే శాతకర్ణి పెంపుడు కొడుకు ..కదా ,రాచరిక రక్తం కాదు , దాన్ని నివృత్తి చేసుకోడానికి సింహళ దేశ రాజు వస్తున్నాడని సారాంశం.