గౌతమి కొడుకు 1578

అప్పుడు, శాతకర్ణి బాగా ఆలోచించి ఆవు కొమ్ముతో నీళ్ళు పడదాము అని చెప్పి, కానీ రక్తం రాకుండా వాటిని తీయడమెలా అని ఆలోచించి సోమవజ్రానికి అనంతశక్తి ఉంది. ఆ శక్తిని చిన్న కిరణంలా మారిస్తే అని తలచి ఒక సీసపు పెట్టెలో వజ్రాన్ని పెట్టి మూసాడు. తన ఆత్మ శక్తితో వెలిగించాడు. అందులోనుంచి ఒక కిరణం వచ్చింది. ఆ కిరణం శక్తికి చెట్టు పడిపోయింది ;మెల్లగా కొమ్మును ఆ కిరణం సాయంతో కత్తిరించాడు.
రక్తం రాకుండా తెగిపోయింది కొమ్ము.
మార్గశిర ఏకాదశి రానేవచ్చింది, ఆ కొమ్ముతో నీరు పట్టి, ప్రమిద వెలిగించాడు శాతకర్ణి.
ఇప్పుడు ఆ దీపాన్ని ఆకాశంలో మూడు వెలుతురులు మధ్య పెట్టాలి అది ఎక్కడ అని ఆలోచించసాగాడు.
అప్పుడు శాతకర్ణి ఆలోచించాడు, పరశురాముడు కేరళ ప్రాంతాన్ని నిర్మించాడు కదా, అక్కడకు వెళ్ళి వెతుకుదాము అని బయలుదేరాడు.
దారిలో ఒక పండితుడు శాతకర్ణికి కనిపించాడు. ఆయన దుర్భిణిలో చుక్కలను చూస్తున్నాడు. అప్పుడు శాతకర్ణి ఆయనకు నమస్కరించి స్వామీ మీరు ఏమి చేస్తున్నారు అన్నాడు. అప్పుడు ఆయన “నా పేరు భట్టు, నేను ఖగోళశాస్త్రాన్ని అభ్యసిస్తున్నాను. అని అతనికి ధృవ నక్షత్రం దుర్భిణిలో చూపించాడు. శాతకర్ణి సంతోషించి, నాకు ఒక సందేహం ఉంది ఆకాశంలో మూడు వెలుగులు ఎక్కడ ఉంటాయి. చుక్కలైతే లెక్కపెట్టలేనన్ని ఉంటాయి కదా అని అన్నాడు.
అప్పుడు భట్టు నాయనా, ఇప్పుడు వచ్చే మాసంలో మకర సంక్రాంతి నాడు ఆకాశంలో శబరిమల పైన మూడు కాంతులు దర్శనమిస్తాయి అని చెప్పారు.
అప్పుడు శాతకర్ణి ఆయనకు నమస్కరించి, సెలవు తీసుకున్నాడు. శబరిమల పైకి ప్రయాణం సాగించాడు.
దారి మధ్యలో హనుమంతుని గుడి ఒకటి ఉన్నది. ఆయన ఆ గుడి వద్ద ఆగారు. అక్కడ ఒక యోగిని చూశాడు. అప్పుడు ఆ యోగి శాతకర్ణిని నాయనా ఎవరు నీవు అని అడిగాడు.
అప్పుడు శాతకర్ణి తన దగ్గర ఉన్న సోమవజ్రాన్ని, నీటిని చూపించాడు. అప్పుడు ఆయన నీవు ఇచ్చటకు వచ్చిన పని ఏమిటి అని అడిగారు.
అప్పుడు శాతకర్ణి ఆకాశంలో మూడు వెలుగుల మధ్య ఈ వెలుగు పెట్టాలి, అని చెప్పాడు.
అప్పుడు ఆ యోగి “నాయనా, మకర కలువు అంటే మూడు వెలుగులు, ఆవెలుగులు మకరసంక్రాంతి రోజున కనిపిస్తాయి కానీ ఆ వెలుతురులో ఒక మర్మం ఉన్నది. బ్రహ్మచారి, ఐహిక సుఖాలను వదలి, సాత్వికాహారం భుజించి దీక్షగా దేవుని స్మరించువారికి ఆ మూడు వెలుగులు స్పష్టంగా కనిపిస్తాయి. వెలుగులు క్షణకాలం పాటు ఒక్కొక్కటిగా వస్తాయి.”
“ఆ వెలుగుల నుండి ఒక శక్తి వచ్చి అది చూసిన వారిలో ఒక నూతనోత్తేజం నింపుతుంది.”అని అన్నాడు.
ఆ రోజు మకరసంక్రాంతి..