గౌతమి కొడుకు 1574

అప్పుడు మహాబలి ఇలా సెలవిచ్చారు “నిజం సైన్యం కాదు, మట్టితో చేసిన బొమ్మలు, అతనిని ఒక నాగా సాధువు తీసుకొచ్చి మా వద్ద వదిలాడు, అతని కుండలినిలో మహారాజయోగం ఉంది అని
అప్పుడు అతనిని అరుణాచలంలో బుద్ది బలాన్ని, రిష్య ముఖ పర్వతాలలో భుజ బలాన్ని పెంపొందించుకునేలా సమగ్ర శిక్షణ ఇప్పించాము.విక్రమార్కుని పై యుద్దానికి శ్రీముఖుని సన్నద్దం చేసాము.
మా మిత్రులు ద్వారా లక్షమంది సైన్యాన్ని సమీకరించాము. కానీ విక్రమార్కుని సైన్యం రెండు లక్షలకు పైగా ఉంటుంది.
అందరికీ నాగాసాధువు లక్షమంది సైన్యం, శ్రీముఖుడు తయారు శ్రీముఖుడు చేసిన మట్టిబొమ్మల నుంచి సృస్టించారని వదంతి వ్యాపింప చేసాం.
యుద్ధ భేరి మ్రోగింది .శ్రీముఖుడు ఉరిమి అనే ఆయుధం తో బరిలోకి దిగాడు .
ఒకే పిడిలో ఉన్న మూడు వంగే కత్తులలో చుట్టూరా గోళాకారంలో తిప్పుడూ రధం పైకి ఎక్కి ముందుకు ఉరికాడు శాలివాహనుడు.
శాలివాహనుడు, యుద్దంలో ఉరిమిలో విజృంభిస్తున్నాడు. సైన్యం ప్రక్కనే ఉన్న అడవిలో తలదాచుకున్నారు
పెద్ద ఎత్తున ఉన్న విక్రమార్కుని సైన్యాని నిలువరించలేక పోతుంది కాబట్టి.
ఒకే ఒక్కడు శాలివాహనుడు బయలుదేరారు. అప్పుడు శాలివాహనుడు, చక్రవ్యూహంలోకి అడుగుపెట్టారు.
వ్యూహం మధ్యలో వెళ్ళగానే కత్తులలో 15 మంది చుట్టుముట్టారు.
ఉరిమిని పైకి లేపి, గుండ్రంగా ఒక వేటు వేసాడు శాలివాహనుడు ఉరిమిలోకి కత్తులు, మెరుపుల్లా పదిహేను మందినీ చంపేసాయి.
తేరుకున్న సైనికులు రెండో వలయంలో 30 మంది బాణాలు సంధించారు.
ఉరిమితో వలయాకారంలో ఉరిమి తిప్పుతూ అతి వేగంగా తన చుట్టూ గోళాకారం లో రక్షణవలయాన్ని స్టాపించాడు.
తన మొలలోనించి ఒక కత్తిని తీసాడు.
నెలవంక ఆకారంలో ఉన్న రెండు కత్తులను రెండు వైపులా విసిరాడు శతవాహనుడు. సుదర్శన చక్రం లా రెండు కత్తులూ తిరుగుతూ 30 మందినీ చంపేశాయి, వెంటనే తన చేతుల్లోకి వచ్చేసాయి.
వెంటనే సైన్యం అంతా చక్రవ్యూహం వైపు వచ్చి చుట్టుముట్టారు.
రధంలోనుంచి దూకి మహాబలి ప్రసాదించిన పరశురాముని గొడ్డలి బయటకు తీసారు శ్రీముఖుడు .
వెంటనే గొడ్డలి వేగంగా తిప్పుతూ గాలిలోకి విసిరారు.
ఆకాశంలో ఆ గొడ్డలి వేగంగా గుండ్రంగా తిరుగుతూ ఎర్రగా సూర్యునిలా వెలుగుతూ నిప్పులు రువ్వసాగింది.
ఆ వెలుగుకు అందరూ కుప్పకూలిపోయారు విక్రమార్కునితో సహా.
వెంటనే అడవిలో ఉన్న సైన్యం, అందరినీ బంధించింది.
విక్రమార్కుడు తప్పించుకున్నాడు.
చండప్రచండంగా ఉన్న ఆ గొడ్డలి మళ్ళీ శాలివాహనుడు చేతిలోకి వచ్చింది.
అలా మీ ముత్తాత శాలివాహనుడు అలా విక్రమార్కుని ఓడించి శాలివాహన శకాన్ని స్థాపించారు .
ఆ గండ్రా గొడ్డలిని హిమాలయలకు తీసుకెళ్ళి అమరనాధునితో నిక్షిప్తం చేసాము.
అప్పుడు మహాబలి నాయన అది మీ ముత్తాత కధ అని చెప్పారు.
మహాబలి “నాయినా నీకు కూడా చక్రవర్తి యోగం ఉంది. ఈ దేశాన్ని బయట శత్తులు ఆక్రమిచడానికి పన్నగాలు పన్నుతున్నాయి. వాటిని నీవు నిలువరించాలి.అలా నిలువరించాలి అంటే నీవు చతురంగ బలాలు, నావికా బలాలలో సుసంపన్నం అవ్వాలి.
నావికా బలం పెంపొందాలంటే మన ప్రక్కన ఉన్న సింహళ రాజ్యాన్ని మనం మిత్రులం చేసుకోవాలి.”

జలపాతం పైన సింహళ రాజు కోట ఉంది .అది పర్వత రాజ్యం. హోరుగా ఉన్న జలపాతం ఎక్కి అడవి ని చేరుకున్నాడు .అక్కడ ఒక యువకుడిని పులి దాడి చేసింది .చుట్టూ ఉన్న సైనికులు ఆయన్ను కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు ,కానీ ఆ బెబ్బులి ధాటికి తట్టుకోలేక పారిపోయారు.
అప్పుడు శాతకర్ణి పులి పై దూకి దానిని నిలువరించారు .
అప్పుడు ఆ యువకుడు కృతజ్ఞతలు చెప్పి తాను సింహళ దేశ యువరాజు అని చెప్పి రాజ్యానికి తీసుకెళ్లాడు.
సింహళ రాజును కలిశాడు శాతకర్ణి .శాతకర్ణి కి ఘనసత్కారం చేసాడు రాజు.
అప్పుడు శాతకర్ణి తాను శాలివాహన యువరాజు అని చెప్పి తనువచ్చిన కార్యం గురించి చెప్పాడు.
సింహళ రాజు “ఆ మ్లేచ్చుల తో మాకు చిరకాల వైరం ఉంది, మీకు యుద్ధం లో నా నావికా దళం కావాలంటే ,మీరు నాకు ఒక సహాయం చేసిపెట్టాలి.”అన్నారు.
“ఈ రాజ్యం దగ్గర లో పిపిరి పర్వత శ్రేణి లో ఒక తెగ వారు నివసిస్తున్నారు .వారు నాగరికులకు దూరం గా ఉంటారు .వారి వద్ద మహాశక్తి ఉందని సమాచారం. ఆ శక్తి వల్ల వారు అతులిత బలధాములలాగా ఉంటారు. ఎంత ప్రయత్నించినా ఆ రహస్యాన్ని నేను ఛేదించలేకపోయాను. సింహళ దేశ బెబ్బులి ని మీరు ఒంటి చేత్తో మట్టికరిపించారు .మీరు మహా యోగి లాగా ప్రకాశవంతం గా ఉన్నారు. . గత కొన్నేళ్లుగా మా దేశం లో ఒక భయంకర మహమ్మారి పీడిస్తుంది, ఆ మహమ్మారికి విరుగుడు వారి వద్ద ఉందని మా రాజ్యగురువు చెప్పారు. ఈ పని చేస్తే మీకు జీవితాంతం రుణ పడి ఉంటాము .ఈ సాయం చేస్తే మీకు నా కుమార్తె ను ఇచ్చి వివాహం చేస్తాను” అని రాజు చెప్పారు .