వెళ్ళండి బాబుగారూ 2 561

“ఆలోచించు మించిపోయిందిలేదు! తప్పదంటే పెద్దాయనా నువ్వంటే పడిచచ్చేవాడె!కొడుక్కే పిచ్చెక్కించిన నీ అందం తండ్రికి నచ్చదా! నువ్వు పిలుస్తున్నావంటే ఈపాటికి ఎక్కడ మందుకొట్టి తొంగున్నా కొట్టిందంతా దిగిపోయి రాకుండా ఉంటాడా, నేను దానికీ సిద్దమే! పైగా పెద్దాయనైతే నాకు ఆ స్థలమొక్కటేం ఖర్మ కొన్ని పొలాలే రావొచ్చు!నిజానికి ఎప్పున్నించో ఆయనే నిన్ను కోరుతుంటే తప్పని నొప్పించా, తప్పదని పట్టుబడితే నువ్వు నిప్పని తప్పించా, ఇక ఆతని కోడుకు మరీ ఆరాధనంటే ఒప్పించక తప్పలేదు! కాకపోతే నాకు నువ్వు అక్కవంటే ఈ అమాయకుడిలా నమ్మేవాడు కాదు పాత ప్రసీడెంటు! నిలకడగా చెప్పుకొచ్చిన ఆచార్లునిఇంకాపమన్నట్టు చేయిచూపించింది.
“ఇంకయిందేదో అయింది! ఇకవదిలేయ్! వెళ్తేనే కదా త్వరగా తిరిగొచ్చేది! ” అని అతన్ని దాటిపోతుంటే భుజం పట్టుకుని ఆపాడు ‘బాధపడకు! …మనదేముందీ దిన్మే భయ్యా–షామ్మే సయ్యా! మనది పాత ఖతానేగా! ఇకా బుడ్డోడి గురించి బెంగ అనవసరం! మరీ అంత ఆపేక్ష ఉన్న లేతకుర్రాడు అదరగొట్టేదేముందిలే, రివటలా బక్కచిక్కినతను నీకు కప్పులో చెంచా అయినా ఆశ్చర్యంలేదు. కుర్రోడు నీ కుతికి చిత్తయి మళ్ళి ముఖంచెల్లక బెదిరిపోతాడని నమ్మకంగా చెప్పగలనూ” అంటూ అనునయిస్తున్నతన్ని గమ్మున చూస్తూ ‘నువ్వుమాత్రం ఉండిక్కడే’ అన్నట్టుభుజంతట్టి గదివేపు కదిలింది.
అమ్మక్రమశిక్షణ

తలుపు తెరిచేప్పుడామె చేతులు కొద్దిగా వాణికాయి. లోపల మంచంపై కూర్చుని, తెచ్చిన సామాన్లు సర్దుతున్నదాన్నిబట్టి తననుకున్నట్లు బయట జరుగుతున్న తంతుని గమనించాలన్న ఆసక్తతనికిలేదని అర్థంచేసుకుంది. దానికతనిపై కొంత సదభిప్రాయం కలిగిందామెకు. చూసీ చూడగానే చేతిలో పొట్లాం పట్టుకుని నిల్చున్నాడు. ఎందుకో ఇబ్బందిగా అనిపించి వెనుతిరిగిందామె. తలుపు ముస్తే తానే లొంగినట్టుందనుకుని అలాగే ఉండిపొయింది.
అయినా తను భయపడినట్టు ” మీరు ఫలాన కదూ ” అని అడగలేదు తనను.
అసలెప్పుడూ ఇంతకు ముందు చూడనట్టు హుందాగా ప్రవర్తిస్తూనే చనువుగా దగ్గరకొచ్చి
“మనల్ని కలపాలని ఎంతో ఆరాటపడ్డాడు …. బెదరగొట్టారా ! పాపం ! తను మీతో కలిపిస్తానని మాటిస్తే స్నేహితులతో పుట్టినరోజు విందుమానుకుని వచ్చి అందర్నీ నిరాశపర్చాను! అందుకేనేమో అమ్మవారు నన్ను సాధిస్తున్నట్టుంది” అన్నాడు మెల్లిగా
తిరిగిచూస్తే గర్భగుడివైపుచూస్తున్నాడు. అప్పుడు గమనించిందామె…. పెదాలు కాస్త తడారిపోయి ఎర్రగా ఉన్నాయి … పాలుగారే ఒంటిరంగూ, సూటైన ముక్కు, తెల్లటి ముఖానికి నల్లటి మీసాలూ, ఉంగరాల ఒత్తైన జుట్టు. కొంతమంది దూరంగా బాగనిపించినంత దెగ్గరగా చూస్తే ఉండరు. ఈ శాల్తీ అందుకు పూర్తి వ్యతిరేకమనిపించిందామెకు! తానెరిగిన వయసొస్తున్నవాళ్ళూ, మీరినవాళ్ళూ కూడా గుసగుసలాడుకునే కత్తిలాంటి కుర్రాడు వీడేకదూ! అప్పుడప్పుడూ మునుపు బయటచూసినా గమనించడమిదే !
“హూ! అయితే?” అంది.
ప్రశ్న చొప్పదంటుదైనా, ఏదైనా చెప్పమన్న ధ్వనిఉందందులో.
ఆమెవేపుకి తిరిగి వచ్చాడు ! అడుగుదూరంలో ఉన్నతను చూడ్డంతో. అతనేదో తనకి అందిస్తున్న వస్తువుని పట్టుకునే మిషతో చూపులు మరల్చింది!
పట్నం నుండి వచ్చినప్పుడల్లా మీకోసం వెతికేవాన్ని. కనబడకపోతే అదోలా అయిపోయేది! తిరిగి వెళ్ళబుద్దయ్యేదికాదూ! గుడికి మీరొచ్చే సమయాలన్నీ తెలిసే వస్తుంటాను!
మీ చీరె కట్టు, బొట్టు, జాకెట్టు డెజైన్లు, నవ్వు పెదాలూ, చమత్కారపు మాటలూ, హావభావాల కళ్ళు ఇవే గుర్తొస్తుంటాయి.
పదేళ్ళనుంచి చూస్తున్నా కానీ ఈ మధ్య మీఅందంలో నిండుతనంతో పాటు నాలోకూడా ఊహలు పెరిగిపోయాయి.
ఆచార్లు – మాఅక్క నీన్నుకలవాలనుకుంటుంది. వస్తావా? అన్నప్పుడు నమ్మలేకపోయాను! అబద్దమైనా ఆమాటే చాలనుకున్నా !
కానీ మరీ-మరీ నాకోసం అడిగేవారు మరి బయటెప్పుడూ కళ్ళు కలపలేదెందుకూ? ఎంతో వెలితి అనిపించేది!
ఇన్నాళ్ళకి ఆచార్లుని పుణ్యమాని మిమ్మల్ని దగ్గరగా చూస్తుంటే కళ్ళుచాలడంలేదు! .. మెల్లిగానే అయినా సూటిగా నాటుకునేట్లు చెప్పాడు.
వింటున్న ఆమెకు అసలేమనాలో తోచలేదు.
ఆమాటలకి జన్మలో తొలిసారిగా తాయారుకి తనకితాను అపురూపంగా అనిపించి మనసు ఉప్పొంగిపోతుంటే..
“మీరు దూరంకన్నా దెగ్గరగా ఎంతబావున్నారో” అన్నాడు. తనమనసులోమాట అతనన్నందుకు ఆశ్చర్యంగా చూసిందామె. బిడియంగా చూపులు అప్పుటికే పరధ్యానంగా తీసుకున్న వస్తులపైకి మరల్చింది
‘వాటిని అంతగా పరీక్షించక్కర్లేదు! సహజమైన అందగత్తెకు సత్తురేకులు తెచ్చేవాన్నికాను?! అదీ మీలా మంచి బంగారమే “అన్నాడు.
తెలివొచ్చిచూసినామెకు ఎందుకో చేతిలో నగలు తృణప్రాయంగా అనిపించి వాటిని అతనిచేతిలోకి తోసింది. ఆడదానికి నగలకన్నా విలువైనవీ, ఆనందాన్నిచ్చేవీ ఇంకేవో ఉంటాయని మొదటిసారిగా అర్థమయ్యిందామెకు.
‘నన్నంతగా అభిమానిస్తే మరి ఇవన్నెందుకూ? నన్ను ఇలాంటిదాన్నని ఎలాఅనుకున్నావూ! ? అందతన్ని సూటిగాచూస్తూ!
తికమక పడిపోయాడు. అతన్ని మరింత ఉడికించాలని … ఇలాంటి పితలాటకం పెడితే నేనెళ్ళిపోతాను! అంది కానీ కదల్లేదు.
అయ్యో! మీరు నన్ను రమ్మన్నారన్న ఆనందంలో అభిమానంతో తప్ప… ఆప్పుటికీ అనుమానంగానే ఉండింది! అంటూ పక్కన వాటిని పెట్టేస్తూ…. ఎంతో తిరిగి-తిరిగీ ఎన్నో తెచ్చాను. ఫర్లేదు మా పిన్నివీ మీ కొలతలే. ఆవిడకు ఇచ్చేస్తాలే మరి! అంటూ గొణిగాడు.