వెళ్ళండి బాబుగారూ 2 561

ఏవండోయ్ .. సాంబయ్య గారూ! ఆరోగ్యం బావుంటోందా! మరీ నల్ల పూస అయిపోయారీమధ్య.. అరుగుమీద తీరుబడిగా కూచ్చున్న ఆచార్లు గారు, పొలం నుంచి తిరిగొస్తున్న సాంబయ్యను అభిమానంగా పలకరించాడు.
బాగుంది… రెండు పూటలా ఈ దారి గుండానే పోతూ వస్తున్నాను.. మీరే ..మందుకోసమో, తాయెత్తు కొసమో కిట కిట లాడిపోతున్న వచ్చే పొయ్యే జనాలతో తీరుబడి లేకుండా ఉన్నారు… తిరిగి నా మీదే వేస్తున్నారే నిందా, అని నవ్వుతూ అరుగుమెట్లెక్కాడు.
“ఇవ్వాల కొంచం తీరుబడి దొరికినట్టుంది మీకు” అన్నాడు ఆచార్యులు సాంబయ్య గారికి కుచోడానికి కుర్చీ చూపెడుతూ. అదేమీ లేదండీ.. మగాళ్ళయినా పర్వాలేదు.. ఆడాళ్ళతో నిండిపోయిన మీ ఇంట్లోకి వాళ్ళని తప్పించుకుని రావడం ఎందుకని ఇలా రావడం లేదు… ఇవ్వాళ మీరు కూడా తీరుబడిగా ఉన్నట్టున్నారు.. అని సాంబయ్య అనగానే, అదేమీ లేదండీ ప్రెసిడెంటు గారి పని మీద ఆయనతో పాటు టవునుకెళ్ళి ఇప్పుడే తిరిగొచ్చి ఇలా కుచ్చున్నాను, భొజనము అదీ అక్కడే ఆయనతోనే అయ్యిందిలెండి అన్నాడు గుంభనగా నవ్వుతూ.
సాలోచనగా తల పంకించాడు సాంబయ్య.
గత నెల రోజుల నుండీ అతని మనసులో ఓ సందేహం పీకుతోంది. పూజలూ పునస్కారాలు అన్నవి మనుష్యులే చేస్తారు. దేవతలు కూడా చేస్తారు. కాని దెయ్యాలు.. అందునా కామిని పిశాచాలు కూడా అంత నిష్టగా పూజలు చేస్తాయా! యిదే అతని సందేహం.. ఎవరిని అడగాలో ఎలా అడగాలో పాలు పోక ఊరుకున్నాడు. ఆచార్లు కి ఇలాంటి విషయాల్లో అనుభవం ఉండడంతో అతని ద్వారా తన సందేహాన్ని నివౄత్తి చేసుకోవలని ఉబలాట పడ్డాడు తను.
అయితే కొంచం తెలివి ఉపయోగించి ఏదో ఊళ్ళో తనకి తెలిసిన వాళ్ళ ఇంట్లో జరిగినట్టుగా కధ అల్లి నెల రోజుల క్రిందట తన ఇంట్లో జరిగిన వ్యవహరం అంతా పూస గుచ్చినట్టు చెప్పి.. అక్కడక్కడా యిలాంటివి జరుగుతుంటాయా అనడిగాడు.
ఆచార్లు వెంటనే సమాధానం చెప్పలేదు. కొంత సేపు కళ్ళు మూసుకుని ఉండి.. ” ఒక వేళ జరిగినా పైకి చెప్పుకునే విషయమంటారా” సాంబయ్య మొహం లోకి సూటిగా చూస్తూ అడిగాడు.
తొట్రుపడుతూ..”మంచి పాయింటే పట్టుకున్నారు.. అందుకే మీ దగ్గర చెప్పుకున్నాను..” అంటూ పళ్ళికిలించాడు.
ఏదేమైనా ఓ కొత్త సంగతి పట్టుకొచ్చారు మీరు.. అని ఆచార్లు నవ్వుతూ చూసి… మనకీ, దేవతలకీ, దేవుడెంతో.. దెయ్యాలకీ భూతాలకీ బేతాళుడంత..
కాక పోతే… కామిని ఎప్పుడూ మగాళ్ళని పట్టుకు తన కోరిక తీర్చుకుని వాడిని పీల్చి పిప్పి చేస్తుంది కాని ఈ కేసులో ఓ ఆడదాని మీద పడి తన కోరిక తీర్చుకోడమే వింతగా ఉంది. ఓ పని చేయండి.. రేపు పొలం వెళేప్పుడు ఓ సారి ఇలా రండి. రాత్రికి పూజలో అమ్మవారిని అడిగి ఏం చెబుతుందో చెబుతాను. ఈ కేసు మన కోసం కాకపోయినా, రేపు మన వాళ్ళకు ఎవరికైన ఇలాంటి ఇబ్బంది వస్తే ఒక దారి దొరుకుతింది కదా .. రేపు మర్చి పోకుండా రండి..” అన్నాడు అచార్లు.