సాక్షాత్కారం అయ్యింది 110

అప్పుడు వాసుకి ఒక పర్వతం చూపించారు .ఆ పర్వతం ఎక్కడానికి సుడులు తిరుగుతూ వెళ్లారు మా తండ్రి .పర్వతం చుట్టూ వలయాలు ఉన్నాయి .పర్వతం అంతం ఆకాశం లోకి ,ఆది సముద్రం లోకి ఉన్నాయి. ఆద్యంతాలు కనుక్కోలేక అలసిసొలసి మా తండ్రి వాసుకి వద్దకు వచ్చి వలయాలు గురించి చెప్పామన్నారు.

అప్పుడు వాసుకి మా తండ్రి తో ఇప్పుడున్న సీత మొదటి సీత కాదు ,రాముడు మొదటి రాముడు కాదు .యుగయుగాలకు హరి దివినుండి భువి కి, లక్ష్మీదేవి భువినుండి వెళుతూఉంటారు ,ఆ వలయాలు దానికి తార్కాణం.అదే కాలచక్రం అన్నారు.

అప్పుడు ఆ పర్వతం మెల్లగా మనుష్య రూపం సంతరించుకుంది. ఆయన ఎవరో కాదు. ధ్యానముద్ర లో ఉన్న పరమశివుడు.

పరమశివుని ఆయన అంశ అయిన మా తండ్రి తెలుసుకున్నారు. ఈవిధంగా మా తండ్రికి ఆత్మ సాక్షాత్కారం అయ్యింది.

అప్పుడు మా తండ్రికి వాసుకి ఒకే రకం గా ఉన్న అంగుళీకాలు చూపించి పరమశివుని మెడచుట్టూ చుట్టుకున్నారు.

ఇది అర్ధమయ్యి వచ్చే సరికి శ్రీరాముడు సరయూనది లో ఐక్యం అయ్యారు.