సాక్షాత్కారం అయ్యింది 110

అప్పుడు వాళ్ళు చెప్పారు. అసురులు భయకంపితులవుతూ లంకాపురిని దహనం చేసింది ఈ వానరుడే అని పలికారు. అహిరావణుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు శివాలయం ప్రధాన పూజారి లంకానగర రహస్య పత్రాలు,దేవుని ఆభరణాలు తీసుకొని పాతాళలోకంలో దాయడానికి వచ్చాడు. నందీశ్వరుడు అని పేరుగల ఆయన తన పురవాసుల పరిస్ధితి చూసి వారికి చెప్పాడు .
“లంకాపురి వాసులారా ! మన సుందర లంకాపురాన్ని నామరూపాలు లేకుండా అగ్నికి ఆహుతి చేసినది వానరుడు ,రామదూత ,అతులిత బలధాముడు ,అంజనీ పుత్రుడు హనుమంతుడు”.
ఇతను మకరధ్వజుడు స్వామి భక్తిపరాయణుడు. పాతాళలోకవాసి అని సర్ధి చెప్పాడు.
హనుమంతుని పేరు వినగానే మకరధ్వజుడికి ఒళ్ళు జలదరించింది,గగుర్పాటుకు లోనయ్యాడు .మకరధ్వజుడికి మనసులో ఎన్నో ఆలోచనలు స్పురించాయి. హనుమంతుడుకి తనకి సంబంధం ఏమిటి నా జన్మరహస్యం ఏమిటి,అని తర్జనభర్జనలు పడ్డాడు. ఏమి పాలుపోక నందీశ్వరుని వద్దకు వెళ్ళాడు.
నందీశ్వరుడు లంకాపురికి బయలుదేరుతుండగా తన వద్దకు వచ్చిన మకరధ్వజుని చూసాడు. మకరధ్వజుడు నందీశ్వరునికి నమస్కరించి తన జన్మరహస్యాన్ని తెలిస్తే చెప్పమని ప్రాధేయపడ్డాడు . నందీశ్వరుడు తనకు తెలియదని లోకకల్యాణ కారకుడైన నారదుని ఉపాసించమని చెప్పి వెళ్ళిపోయాడు.

మకరధ్వజునికి తను రాముని శిబిరానికి వెళ్ళి వస్తానని చెప్పి జాగ్రత్తగా ఉండమని అహిరావణుడు నుంచి తనకు వర్తమానం వచ్చింది .
మకరధ్వజుడు కావలి కాస్తూ నారదమహర్షిని ఉపాసించ సాగాడు.
నారద మహర్షి ప్రత్యక్షమై మకరధ్వజునికి ఏం కావాలో కోరుకోమన్నాడు.
అప్పుడు మకరధ్వజుడు “దేవర్షి,నాకు నా జన్మవృత్తాంతము గురించి తెలుసుకోవాలనుంది.
నా మాతృమూర్తి,పితృదేవులు గురించి తెలుసుకోవాలని ఆరాటంగా ఉంది.
ఈ పాతాళలోకంలో మిగిలినవారితో కంటే భిన్నంగా ఉన్నాను. మహారాజు నన్ను పుత్రవాత్యల్యంతో చూసినా ఏదో తెలియని ఒoటరి తనం, వ్యాకులత నన్ను ఆవహించినవి. నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నా మనస్సుకు ప్రశాంతత చేకూర్చ ప్రార్ధన.” అని నమస్కరించాడు
అప్పుడు నారద మహర్షి బాలకా, “మొదట నీవు తెలుసుకోవలసినది నీ మహారాజు సోదరుడు రావణ బ్రహ్మ గురించి “అని రావణుడు గురించి చెప్పసాగాడు.

నారదుడు ఇలా చెప్పారు

“రావణుడు తండ్రి వివశ్రుడు ,బ్రహ్మదేవునికి మనుమడు విశ్రవుడు. పదిమంది ప్రజాపతులలో, ఏడుగురు మహర్షులలో ఒకరాయన”

విశ్రవుని భార్యలు ఇలావద, కైకశి.

ఇలావద ద్వారా కుబేరుడు మరియు ఇద్దరు పుత్రుల్ని పొందాడు.

బాలకా ! రావణుని తల్లి కైకశి (సుమాలి తండ్రి) మీ సంతతికి చెందింది. తన తమ్ములు విభీషణుడు, కుంభకర్ణుడు, సోదరి శూర్పణక. రావణుడు తండ్రి ద్వారా సకల శాస్త్రాలను, తల్లి ద్వారా క్షత్రియ గుణాలను పొందాడు.