సాక్షాత్కారం అయ్యింది 110

“స్వామి ,నారద మహర్షి మా జనకుల బాలరిష్టాలను చక్కగా వివరించారు ఇందాక మా పితృవర్యులను ఉదహరించి బ్రహ్మజ్జ్ఞాని అని అన్నారు
అదేమిటో చెప్పగలరు” అని మత్యవల్లభుడు అన్నాడు.
“స్వామి ,నారద మహర్షి మా జనకుల బాలరిష్టాలను చక్కగా వివరించారు ఇందాక మా పితృవర్యులను ఉదహరించి బ్రహ్మజ్జ్ఞాని అని అన్నారు
అదేమిటో చెప్పగలరు” అని మత్యవల్లభుడు అన్నాడు.
నారదుడు ఇలా అన్నారు “అoజన దేవి శాపగ్రస్తుడైన తన బిడ్డను చూసి ఎవరైనా మంచి గురువు వద్ద విద్యా బుద్దులు నేర్పించాలి అనుకున్నది.
ఆఖరికి జ్జ్ఞానభాండాగరం అయిన సూర్యభగవానుని వద్దకు పంపిద్దామని కేసరి,అంజన నిర్ణయం తీసుకున్నారు.
వానరునితో సహవాసానికి సూర్యుని వద్ద ఉన్న సప్తర్షి మండలం ఒప్పుకోలేదు “.అప్పుడు సూర్యభగవానుడు హనుమతో ఇలా అన్నారు “వానరోత్తమా! నేను నీకు విద్యను ఉపదేశించడానికి సముఖమే కానీ నేను విశ్వంలో చుట్టూ తిరుగుతూ ఉండాలి ఒక చోట స్థిరంగా ఉండను” అన్నారు.
అప్పుడు సూర్యుని అభిముఖంగా సూర్యునివేగంతో వెనక్కి తిరుగుతూ అంజనీపుత్రుడు విద్యను అభ్యసించారు.
కొద్ది రోజులలో సకల శాస్త్రాలను ఔపోసన పట్టిన ఆంజనేయుని చూసి ముచ్చట పడిపోయాడు .సూర్యభగవానుడు ఇంకొంత కాలంలో శివుని అంశతో గడపాలని చెప్పి నిన్నటి పాఠాన్ని గుర్తు చేసేవాడు కాదు సూర్యుడు అంజనిసుతుడు శాప ప్రభావం వల్ల గుర్తు చేసుకునేవాడు కాదు
ఇలా కొన్ని నెలల తర్వాత విద్యాభ్యాసం ముగిసింది అని అంజనా దేవి వద్దకు పంపి౦చ ఏర్పాట్లు చేసాడు సూర్యభగవానుడు.
అప్పుడు హనుమ సూర్యునికి నమస్కరించి గురుదక్షిణగా ఏమి కావాలని అడిగాడు.” నాకు ఏమి వద్దు కానీ నా పుత్రుడు సుగ్రీవునికి నీవు సహాయం చేయాలి.అతడు దీనావస్థలో ఉన్నాడు. అతనికి మంత్రిగా ఉండి నీవు మార్గోపదేశం చెయ్యాలి” అన్నాడు .

మకరధ్వజుడికి కబురు వచ్చింది అహిరావణుడు ఇద్దరు బందీలను కాళీకాలయంలో ఉంచారని,వారు తప్పి౦చుకోకుండా చూడాలని దాని సారాంశం .
వారు ఇద్దరూ ముని కుమారులుగా అగుపించారు.వారిని చూస్తూ వీరెవరని ప్రశ్నించాడు మకరధ్వజుడు . “వీరు అయోధ్య నగర కుమారులు రాముడు,లక్ష్మణుడు �.వారి ముఖారవిందములు చూడగానే మకరధ్వజునికి ప్రశాంతత,దైవత్వం ఉట్టిపడుతూ అగుపించాయి.
నాయనా బాలకా! ఈ రామచంద్రుడు సూర్యవంశ కోవిదుడు.సకలగుణాభిరాముడు అంతకు మించి హనుమంతునికి అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తి.”ఆ మాట వినగానే మకరధ్వజుడు రామునికి నమస్కరించాడు.
రామచంద్రప్రభువు నారదుని అడిగారు �నారద ఈ బాలకుడు అచ్చం మన హనుమలాగా ఉన్నాడు ,ఎవరితడు.”
అప్పుడు మకరద్వజుని జన్మవృత్తాంతం రామునికి వివరించారు దేవర్షి.

రాముని గురించి మకరధ్వజుడు గొప్పగా విన్నాడు .మకరధ్వజుడు తన తండ్రి గురించి రాముని నుంచే వినాలని ఇలా అడిగాడు .
�రామచంద్రప్రభు !మీకు మా తండ్రి గారికి సాంగత్యం ఎలా ఏర్పడింది మా తండ్రి గారి ప్రాణం మీరు ,ఇంత అవినాభావ సంబంధానికి పునాది ఎలా ఏర్పడిందో చెప్పండి”, అన్నాడు.
అప్పుడు రాములవారు “నాయనా ,నా చిన్నతనంలో ఒక సాధువు జటఝాటదారి(సాక్షాత్ శివభగవానుడు ) వచ్చి రాజప్రాంగణంలో ఒక గారడీ ప్రదర్శన ఇచ్చారు. ఆయన ఆడించిన ఆటను చూసి మేము సమ్మోహనముతో ఆనందభరితులయ్యాము.
అతని వద్ద ఉన్న బాలుని విన్యాసాలు ఇంకా ఆకట్టుకున్నాయి.
నేను మారాం చేసి వాళ్ళిద్దరినీ ఇక్కడే ఉండిపోమన్నాను, కైకేయి మాతతో చెప్పి కానీ ఆ సాధువు ఒప్పుకోలేదు నేను మారాం చేయడంతో తన వద్ద ఉన్న బాలుడిని మాకు ఇచ్చి వెళ్ళిపోయారు.
బాలుడు తన పేరు హనుమ అని, తనది దక్షిణ దేశం అని చెప్పాడు. మూతి ఎర్రగా ఉండేది. మిగిలిన బాలురు తనను గేలి చేసేవారు. నాకు మాత్రం తాను అంటే మహా స్నేహంగా ఉండేది.
హనుమ రోజూ చిక్కుకున్న గాలిపటాలను విడదీసేవాడు, మా బంతి ఎంత దూరం వెళ్ళినా ఒక్క ఉదుటున గెంతుకుంటూ వెళ్ళి తెచ్చేవాడు. కోట గోదాల్ని అవలీలగా ఎక్కేవాడు. మంచి మంచి మామిడికాయలు, జామకాయలు, కోసుకొచ్చేవాడు.నాకు అలసట వస్తే భుజం మీద ఎక్కించుకొనేవాడు.
మా స్నేహం కాలంతో రెట్టింపయ్యింది. నా ఆంతరంగిక మందిరంలో నా పాన్పుపై శయనించేవాడు హనుమ.
అలా మాతో పెరిగేవాడు హనుమ, ఒక రోజు నేను ఎగురవేసిన గాలిపటం కిందకు రావటంలేదు. అప్పుడు హనుమ గాలిపటం కోసం ఆకాశంలోకి ఎగిరాడు.