సాక్షాత్కారం అయ్యింది 110

“దేవి కరుణించింది, ఆమె దీవెన మనకే, చిరుతిండికే ఇంత సంతసమైతే, రామలక్ష్మణులను బలి ఇచ్చిన తరువాత ఎన్ని కోర్కెలు తీరుస్తుందో తల్లి?” అంటూ ముందుకు సాగాడు అహిరావణుడు.

లక్ష్మణుడు రామునితో ,”అగ్రజా! మన హనుమ ఎక్కడ? “అన్నారు.

అప్పుడు రామచంద్రప్రభువు ,”ఇవాళ హనుమ నాకు దేవుని లాగ కనిపిస్తున్నాడు” అన్నారు సౌమ్యంగా.

అహిరావణుడు బలిపీఠం మీద రాముని శిరస్సు వంచి ఉంచమని ఆజ్ఞాపించాడు అప్పుడు రామచంద్రప్రభువు �నేను అయోధ్య చక్రవర్తి ముద్దుల రాకుమారుడను, నాకు తల వంచడం తెలియదు. నీవు ఒకసారి చూపినచో నేను చేస్తాను “అన్నారు. నవ్వుతూ తలవంచి చూపించాడు అహిరావణుడు.

వెంటనే హనుమంతుడు ఒక్క ఉదుటన కత్తితో అహిరావణుని శిరస్సును ఖండించాడు.

ఇక ఆలస్యం చేయకూడదని రామలక్ష్మణులను భుజం మీద ఎక్కించుకుని యుద్ధ శిబిరానికి వెళ్ళసాగారు హనుమ.

వెళుతూ బందీగా ఉన్న మకరధ్వజుని చూపించి �రామా! ఇతను నా పుత్రుడు�. అని చూపించాడు. దానికి రాముడు, హనుమా !” నీకు తగిన పుత్రుడు, ముందే నేను కలిసాను. తన తండ్రి గురించి చెప్పమని నన్ను అడిగాడు నీ పుత్రిడికి మన బాల్య విశేషాలు అన్నీ చెప్పాను.

ఇప్పుడు నువ్వు ఇతన్ని ఈ పాతాళలోకానికి రాజుని చెయ్యి, మనకి యుద్ధంలో ఇద్దరు హనుమలు రాముని సేనతో పోరాడతారు.”

వెంటనే హనుమ తన పుత్రుని పట్టాభిషేకం చేసి యుద్ధభూమికి ఎగిరి వెళ్ళిపోయారు.

ఏకాకి అయిన అహిరావణుని అంత్యక్రియలు మాత్య్సవల్లభుడు జరిపించారు.

బ్రహ్మాస్త్రం రావణుని వద్ద ఉంది. దాన్ని ఇద్దరు హనుమ, మకరధ్వజుడు వెళ్ళి మండోదరి వద్ద బ్రాహ్మణులులా నటించి, విభీషణుడు దాన్ని దొంగిలించడానికి కుట్ర పన్నారని చెప్పి, దాన్ని వేరే చోట చేర్చమని మండోదరికి చెప్పి, దాన్ని మారుస్తూ ఉండగా తీసుకుని మాయమై పోయారు.

యుద్ధం ముగిసింది. రావణవధ జరిగింది.

కానీ రాముని కధ మత్స్యవల్లభుడికి పూర్తిగా అర్ధం అవ్వలేదు. తన తండ్రిని అడిగి తెలుసుకోవాలనుకున్నాడు. తన తండ్రి వద్దకు అయోధ్య వెళ్ళాడు మకరధ్వజుడు. సీతారామపట్టాభిషేకం చూసి ఆనందభరితుడయ్యాడు. కొని సంవత్సరాల తర్వాత అయోధ్య వెళ్లారు మళ్ళీ. అక్కడ రామచంద్రుడు ఒక్కరే ఉన్నారు. సీతాదేవి అడవులలో విడవబడినది అని తెలిసి చింతించారు. అక్కడ నుండి పవన తనయుడి కోసం వెతికాడు.
తండ్రి చింతతో ఎక్కడో పర్వతం మీద ఉన్నారని తెలిసి అక్కడకు వెళ్ళి కలిసారు. పుత్రుని చూసి ఉప్పొంగిన హనుమ, పాలన వాటి గూర్చిన ధర్మసందేహాలను తీర్చి తనకు ఉన్న విద్యను, సూర్యభగవానుని సాక్షిగా తన కుమారునికి ఇచ్చారు.