సాక్షాత్కారం అయ్యింది 110

రావణుడు శివ భక్తుడు రుద్ర వీణను వాయించడంలో సిద్దహస్తుడు, మహారుద్రుని కోసం ఘోర తపస్సు చేసి కడుపులో అమృత భాండాన్ని వరంగా పొందాడు.

దేవతలు,యక్షులు,కిన్నెరల, కింపురుషులు, ఎటువంటి జంతువుల వల్ల తన మరణం సంభవించకుండా వరం పొందాడు.తన వర బలంలో భూలోకాన్ని ఆక్రమించాడు. సవతి సోదరుడైన కుబేరుని లంకను,అతని సంపదను ఆక్రమించాడు.కుబేరుడు దేవతలను సాయం కోరగా రావణుడు దేవలోకాధిపతి ఇంద్రుడిని ఓడించి దేవలోకాన్ని హస్తగతం చేసుకున్నాడు.
పాతాళలోకాన్ని ఆక్రమించి సోదరుడు అహిరావణున్ని అధిపతిగా చేసాడు.

ఇలా ముల్లోకాలను జయించాడు.

పరమశివుని ప్రియభక్తుడి వల్ల జరిగిన ఈ దారుణాలను దేవతలు ఆయన వద్దే మొర పెట్టుకున్నారు.

శివునికి ఉపాసన చేసే రావణుడు కైలాస ద్వారపాలకుడు నందిని అవహేళన చేసాడు మూపురం చూపించి.

కోపోద్రిక్తుడైన నంది శపించాడు, �నన్ను కోతిలా ఉన్నావని గేలి చేసావు కాబట్టి నువ్వు వానరుని వలన సర్వనాశనం గావింపబడతావు � అని.

రావణుడు పరమశివునికి పది తలలు బలి ఇచ్చాడు.కానీ ఆ బలి వల్ల మహాకాళుడు లోని పదిరుద్రులు మాత్రమే సంతృప్తి చెందారు. పదకొండవ మహారుద్రుడు శాంతించలేదు.

మహావిష్ణువు మానవరూపం దాల్చే సమయం ఆసన్నమైంది.మహాశివుడు విష్ణు అవతారానికి సాయపడతానని చెప్పాడు.

కానీ మానవ శరీరం మాయలకు, మోహాలకు అవలీలగా గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే శివుడు వానరరూపం దాల్చడానికి పూనుకున్నాడు.

శాంతించని పదకొండవ మహారుద్రుడు భూమి మీద మహాప్రతాపంతో ఆవిర్భవించబోతున్నాడు.

సతీదేవి శివుని అడిగింది. � ఈ మహత్కార్యంలో తనను కూడా భాగం చేయమని � .ఎప్పుడూ తన వద్ద ఉండేలా అందమైన తోకలా ఉండమని వరం ఇచ్చాడు.

అలా రావణాసుర సంహారానికి హనుమంతుని ఆవిర్భావం జరిగింది.

నారదుడు ఇలా అన్నారు ,” హనుమంతుడే మీ జనకుడు.లంకాదహనం చేసి సముద్రం పై ఎగురుతున్న హనుమంతుని స్వేదం ఒక చేప నోట్లో పడి నీవు ఆవిర్భవించావు .ఆ మత్స్యమే అహిరావణుడికి దొరికింది .”
మత్స్యవల్లభుడు భావావేశం తో ఉప్పొంగిపోయి నారదుడికి సాష్టాంగనమస్కారం చేసాడు .
అప్పుడు మత్స్యవల్లభుడు నారదుని తన తండ్రి వృత్తాంతం గురించి చెప్పమన్నాడు.