సాక్షాత్కారం అయ్యింది 110

ఇంద్రుని మేనకోడలు జయంతి విమానంలో వెళుతూ దాన్ని పట్టుకుంది. ఇంతలో హనుమ వచ్చి ఆమెను గాలిపటం ఇమ్మన్నాడు. ఆమె �ఇంతెత్తు గాలిపటం ఎగురవేసిన యోధుని నేను చూడాలి� అంటే ఆమెను తీసుకు వచ్చి రామచంద్ర ప్రభువుని చూపించాడు హనుమ. ఆమె ఆనందభరితురాలై నేను ఇంద్రలోకం వేగిరంగా వెళ్లాలి, మళ్ళీ మనం ఎప్పుడు కలవగలం అన్నప్పుడు ,రాములవారు అరణ్యవాసంలో కలుద్దాం అని మాటిచ్చారు.
వాయువేగంతో గాలిపటం తీసుకువచ్చాడు కాబట్టి �మారుతి� అని పేరు పెట్టాము.
మేము యుక్తవయస్కులం అయ్యాక హనుమ తాను గురుదక్షిణగా సూర్యునికి ఇచ్చిన మాట ప్రకారం సుగ్రీవుని వద్ద రాజ్యపరిపాలనలో సాయం చేయాలని మా వద్ద నుంచి కిష్కిందకు వెళ్లిపోయాడు.”

ఇంతలో మకరధ్వజుడు ప్రమాద ఘంటికలు విని రాముని వద్ద శెలవు తీసుకుని ద్వారం వద్దకు వెళ్లారు. తనతో నారదుడు కూడా వెళ్లారు.

మకరధ్వజునికి వర్తమానం అందినది.

“ద్వారపాలకా మనకు కాపలాగా ఉన్న మహా సర్పాలు చంపబడ్డాయి. వెంటనే జాగరూకులు కండి “అన్నారు వేగులు.

తన సైన్యాన్ని అప్రమత్తం చేశాడు మకరధ్వజుడు ,నారదుని నుండి ఆశీస్సులు తీసుకున్నాడు.

ఒక మహాకాయుడు, మహాకాలుని వలె సైన్యాన్ని మట్టికరిపించసాగాడు.

ఇక తాను రంగంలోకి దిగాలని మకరధ్వజుడు మహాకాయుని వద్దకు వెళ్ళాడు.

అప్పుడు మహాబలసంపన్నుడు అయిన ఆవీరుడు, “బాలకా ఎవరు నీవు, అచ్చ౦ నాలాగే ఉన్నావు “అని ప్రశ్నించగా?

అప్పుడు నారద మహర్షి కలుగ చేసుకుని “హనుమా! ఇతను నీ పుత్రుడు మకరధ్వజుడు అని చెప్పగా

” దేవర్షీ అదెలా సాధ్యం నేను అస్ఖలిత బ్రహ్మచారిని నాకు పుత్రుడు ఎలా కలిగాడు ” అని అనగా

అప్పుడు నారద మహర్షి మకరధ్వజుని జన్మ వృత్తాంతం చెప్పారు.

“బాలకా! నేను నా ప్రాణప్రదమైన రామలక్ష్మణులని విడిపించడానికి వచ్చాను. ధర్మనిరతులైన వారిని విడిపించడానికి సహాయం చెయ్యి, రావణునితో యుద్ధానికి అంతిమ ఘడియలు చేరువయ్యాయి. లోక కళ్యాణనికి నీవంతు సాయ౦ చెయ్యి “అని అన్నారు హనుమ తన కుమారునితో.

అప్పుడు మకధ్వజుడు “తల్లి తండ్రులు ఎవరో నాకు తెలియనప్పుడు నా ప్రభువు అహిరావణుడు నన్ను ముక్కిలి వాత్సల్యంతో చూశారు.పితృవర్యా! నేను నా స్వామిభక్తిని నిరూపించుకునే సమయం ఇది. కావున మీకు సాయం చేయలేను “,అని ధర్మయుద్ధం మాటలతో మొదలుపెట్టాడు.

“పుత్రా! నీ పేరేమి?” అడిగారు హనుమ.

నాపేరు మత్స్యవల్లభుడు అని సమాధానమిచ్చాడు .

“నీ వివేచనా జ్ఞానానికి నేను మిక్కిలి సంతసించుచున్నాను. నీ స్వామిభక్తి నా స్వామిభక్తితో సమానమయినది.

మనం మన యొక్క స్వధర్మాలను నిర్వర్తిద్దాం ” అన్నారు హనుమ.

ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది.

ఎంతసేపటికీ హనుమ మకరధ్వజుని మట్టికరిపించలేకపోతారు.

అప్పుడు తన దివ్యజ్ఞానంతో చూస్తే ఐదు దిక్కులలో ఉన్న ఐదు స్తంభాల మీద ఉన్న జ్యోతి కాంతులు మకరధ్వజుని పై పడుతూ ఉంటాయి.

అప్పుడు హనుమ దీపాలపై గాలి ఊదుతారు. అవి అన్నీ ఒకసారి ఆరలేదు .

ఆగ్రహించిన హనుమంతుడు, బ్రహ్మదేవుని వరాన్ని ఉపయోగించుకుని పంచముఖి ఆంజనేయుడిగా అవతరిస్తారు.

పంచముఖాల నుండి ఒక్కసారిగా ఆ ద్వీప కాంతులని ఆర్పడంతో మకరధ్వజుని తేజస్సు సన్నగిల్లింది . వెంటనే హనుమంతుడు మకరధ్వజుని తన తోకతోనే బంధించి కాళీ ఆలయంలోనికి వెళతాడు హనుమ.

కాషాయ వస్త్రదారులైన రామలక్ష్మణులను కాళికాదేవికి బలివ్వడానికి సిద్ధం చేస్తున్నాడు అహిరావణుడు.

హనుమ కాళికాదేవి విగ్రహాన్ని ప్రక్కకు నెట్టి తానే కాళికగా కత్తితో విగ్రహంలా నిల్చున్నారు.

అప్పుడు దేవికి అహిరావణుడు పంచభక్ష్యపరమాన్నాలతో నైవేద్యం పెట్టాడు . అప్పుడు హనుమ ఆ నైవేద్యాన్నంతా ఒక్క ఉదుటన ఆరగించేశారు.