సాక్షాత్కారం అయ్యింది 110

మత్య్సవల్లభుడు నారదునితో “మీరు అంజనీపుత్రుడు అంటారు .కానీ అందరూ హనుమంతుడు అంటారు” అని సందేహం వెల్లబుచ్చాడు. “బాలా , అంజనీపుత్రుడు ఒక రోజు ఆరుబయటపాకుతూ ఉండగా ఎర్రని పండు చూసి దాని అందుకోబోయాడు పవన వరప్రసాది అయిన ఆంజనేయుడు. ఒక్క ఉదుటున సూర్యుని వైపు వెళ్ళసాగాడు. శివ ప్రకాశంతో వెలుగొందుతున్న ఆంజనేయుని చూసి పరమేశ్వరా ప్రణామములు అంటూ సూర్యుడు చేతులు జోడించి నమస్కరించాడు .
అప్పుడు రాహువు సూర్యుని మింగబోతే తన పరాక్రమంతో ఆంజనేయుడు రాహువును తరిమి కొట్టాడు. రాహువు ఇంద్రునితో మొరపెట్టుకున్నాడు.ఇంద్రుడు తన మాట ఎక్కడ పోతుందో అని యుద్దానికి వచ్చారు .ఆంజనేయునిపై తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు.వజ్రాయుధం ఆంజనేయుని దవడ ఎముకకు తగిలింది. దాంతో సృహ కోల్పోయాడు. విగతజీవిగా ఉన్న కుమారుని చూసి అంజనీదేవి స్తంభించిపోయింది.వాయుదేవుడు హూతశుడయ్యి గాలిని నిర్భంధించాడు.సకల జీవరాశులు అష్టకష్టాలు పడ్డాయి “.అప్పుడు ముక్కోటి దేవతలు ప్రత్యక్షమయ్యి వరాలు ఇచ్చారు. బ్రహ్మదేవుడు సృహతప్పిన బాలుని మరల జీవితున్ని చేశారు.
దవడ ముందుకు రావడం వల్ల హనుమంతుడు అని పేరు పెట్టారు.(హను అంటే దవడ)
ఇంద్రుడు వజ్రకాయం ప్రసాదించారు
సూర్యుడు సూర్యతేజస్సు,
యముడు తన పాశం నుండి రక్షణ ను,
విశ్వకర్మ తను తయారు చేసిన ఆయుధాల నుండి రక్షణను, పొందగలవు అని వరం ఇచ్చారు.బ్రహ్మ బ్రహ్మాస్త్రం నుండి రక్షణను,
వాయువు భూత పిశాచ గణాల నుండి రక్షణను ప్రసాదించారు.
అప్పుడు వాయుదేవుడు శాంతించాడు.

ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, సూర్యచంద్రులు తన ఆధీనంలో ఉండాలనుకున్న రావణుడు సూర్యుని వైపు వెళుతున్న హనుమ తోకను పట్టుకున్నాడు.
రావణ సంహరానికై పుట్టిన పదకొండో రుద్రుడు వెంటనే తోకతో రావణాసురుని చుట్టుముట్టాడు.విడిపించుకోలేక పోయిన రావణుడు ఉక్కిరిబిక్కిరి అవుతుండుగా వివశ్రుడు(రావణ తండ్రి) ఆంజనేయున్ని వేడుకున్నాడు విడిచిపెట్టమని.
సర్వశక్తి సంపన్నుడైన హనుమంతునికి అల్లరి మహా మెండు .ఆశ్రమలలో మునులను,వారి పిలకలను,గెడ్డాలను,అంగవస్త్రాలను,పీకి ఆనందించేవాడు .వానర మూకతో కలసి మునుల పవిత్ర జలాలను లాక్కునేవాడు.ఏనుగులను,సింహాలను గాలిలో గిరాటు వేసేవాడు .
ఇదంతా చూసిన ఒక మహాఋషి కోపంతో �నీ శక్తులన్నీ నీవు మర్చిపోవుగాక �అని ఆవేశంగా శపించి కొంతసేపటికి తేరుకొని బ్రహ్మజ్జ్ఞాని,శివస్వరూపుడు అయిన ఆంజనేయుని చూసి”నాయనా ఎవరైనా ,నీకు గుర్తు చేస్తే నీ శక్తులు నీకు తెలియుగాక” అని వరం ఇచ్చారు.
నారదుడు మత్యవల్లభుడితో ,”బాలక చూశావా గంభీర స్వరూపుడైన నీవు ఎప్పుడైనా ఇలాంటి అల్లరి చేష్టలు చేసేవాడివా”.
“లేదు మహాముని నన్ను ఎవరైనా గేలి చేస్తే నేను వారిని గాలిలో ఎగరవేసేవాడిని ,మేము ఆడుకున్నప్పుడు ఏదైనా పాతాళ మృగం మమ్మల్ని దాడి చేస్తే స్నేహితులను కాపాడడానికి నేను దాని మట్టికరిపించేవాడిని .మిగిలిన అందరూ మాంసాహారము తినేవారు.నాకు పండ్లు తప్ప ఏమి రుచించేవికావు.తర్బూజ కాయలు,పుచ్చకాయలు,నా ఇష్టమైన ఆహారం. నా పితృసమానుడైన అహిరావణుడు నా ధైర్య సాహసాలకు మెచ్చి ద్వార నగర రక్షకునిగా నియమించారు.”అని చెప్పాడు మత్యవల్లభుడు.