సాక్షాత్కారం అయ్యింది 110

నారద మహర్షి మకరధ్వజునితో ఇలా అన్నారు. � మీ తండ్రి జననానికి చాలా ప్రక్రియ జరిగింది.�
� శివతేజస్సును గర్భంలో ధరించే పుణ్యం చేసుకున్న మహాసాధ్వి అంజనాదేవి.� ఆమె అప్సరస. గత జన్మలో ఆమె పేరు “పుంజికస్ధల”. ఇంద్రుని ఒంటినిండా ఉన్న కన్నుల చూసి నవ్వింది ,అందుకు ఇంద్రుడు ఆమెను కురూపిగా మారమని శపించాడు.కానీ లావణ్యమైన అందం ఆమెకు కోరుకున్నప్పుడు పొందగలదు అని చెప్పాడు.
అంజనాదేవి శివుని పరమ భక్తురాలు ఆమె భక్తికి మెచ్చి శివుడు ఆమె పుత్రునిగా ఉండటానికి అంగీకరించాడు .
దశరధ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు, ఆ యాగ ఫలం పాయశాన్ని ముగ్గురు భార్యలకు పంచాడు.
కైకేయికి ఇచ్చే సమయంలో దాన్ని గ్రద్ధ తన్నుకుపోయింది.కౌసల్య,సుమిత్ర తమ భాగాన్ని కైకేయి కు ఇచ్చారు. ఆ గ్రద్ధ ఆ పాయసాన్ని అంజనాదేవి ప్రార్ధన చేసే గుడి దగ్గర జారవిడిచింది.ఆ పాయసాన్ని వాయుదేవుడు అంజనాదేవి చేతిలో పడేలా చేసాడు.
వాయుదేవుని సహకారంలో పుట్టాడు కాబట్టి వాయునందనుడు అని పిలుస్తారు.
అప్పుడు మత్స్యవల్లభుడు ఇలా అన్నాడు. � నారదమహర్షి, మరి మా జనకుని పితృదేవుడు ఎవరు? ”
అప్పుడు నారదుడు చెప్పాడు
“కేసరి హనుమ జనకుడు.రాజు అయిన కేసరికి చాలా కాలం పుత్రలాభం కలుగలేదు. దాంతో కేసరి ,అంజనాదేవి ఆకాశ గంగ తీరాన శివుని పరమ భక్తితో ఆరాధించేవారు.కేసరి గొప్ప పోరాట యోధుడు.సాంబసదమడు అనే రాక్షసుడు మునులను హింసిస్తూ ఉంటే కేసరి అతణ్ణి మల్లయుద్దంలో మట్టికరిపించాడు.
.వానర రాజ్యం లంకాపురికి ఉత్తరంగా ఉండేది. వీరికి ఉత్తరంగా కిరాతార్జునుడు అనే మహారాజు ఉండేవారు. వానరులకు (కేసరి) ఆయన మిత్రుడు. ఉత్తర భారతం పై రావణుడు దండయాత్ర చేసి తిరిగి వస్తుండగా కిరాతార్జునుడు రాజ్యం పై దండేత్తాడు.వర గర్వంతో ఊగిపోతున్న రావణుడు కిరాతార్జునిపై విజయం అలవోకగా భావించాడు . కొలనులో కిరితార్జునుడు స్నానం చేస్తున్నాడు.రావణుడు అతని వద్దకు వెళ్లి లొంగిపొమ్మన్నాడు, ఓటమిని అంగీకరించని కిరాతర్జనుడు తన వెయ్యి చేతులలో సమానమైన కబంధ హస్తాలతో రావణుని ఉక్కిరి బిక్కిరి చేసాడు.విడిపించుకోలేక రావణుడు విలవిలలాడి ఓటమిని అంగీకరించాడు.కిరాతార్జునుడు,రావణుడిని ప్రాణాలతో విడిచిపెట్టాడు. బ్రతుకు జీవుడా అని రావణుడు బయట పడ్డాడు.అలాంటి హేమాహేమీలతో ఒక బలమైన వర్గంగా మధ్యభారతం వింధ్యకు దక్షిణంగా పెట్టనికోటగా మిగిలింది..

మత్యవల్లభుడు నారద మహర్షి తో “నన్ను బాల్యంలో ఎవరు పెంచారో తెలియదు నేను ఆలనాపాలనకు నోచుకోలేదు .కానీ మా మహారాజు అహిరావణూడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వాత్స్యల్యంతో చూచేవారు బాల్యంలో ప్రేమను రుచి చూసింది ఆయన వల్లే ,కానీ మిగిలిన పిల్లలు గేలి వల్ల చాలా భాధపడేవాడిని. తల్లి తండ్రులు ఎవరో తెలిసేది కాదు మహర్షి మీ పుణ్యం వల్ల నేను నా మాత పితలను తెలుసుకోగలిగాను. జన్మధన్య మైనది .నాతండ్రి గారి గురించి ఇంకా చెప్పండి అన్నాడు.
నారదుడు ఇలా చెప్పారు “యువరాజు హోదాలో అన్నీ రాచమర్యాదలు జరిగేవి అంజనీపుత్రునికి.. ఆంజనేయుడు ఉరుకులు ,పరుగులు తో పాకుతూ ఉంటే అందరికీ ఆనంద౦గా ఉండేది . మిగిలిన వానరులకు చాలా తేజస్సుతో ఉండేవారు .వానర వాలం చాలా ముద్దుగా ఉండేది.అందంగా ఉండేది.”