నాన్ సెన్స్ గా మాట్లాడకు. సెన్స్తో ఆలోచించిచు… Part 2 180

“ఐయామ్ సారీ అనిమిషా… నీ పాయింటాఫ్ వ్యూ లోనుంచే కాదు… ఎవరి పాయింటాఫ్ వ్యూలోంచి చూసినా నీదే కరెక్ట్… నీ వ్యక్తితం చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఆల్ ద బెస్ట్… రేపు మనం అనిరుద్రని కలుస్తున్నాం” చెప్పింది ద్విముఖ అనిమిష చెప్పిందంతా విన్నాక. అనిమిష ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయింది.

****

బీచ్….

జనం పలుచగా ఉన్నారు. అనిరుద్ర, కార్తీక్ రెయిలింగకు ఆనుకొని నిలబడి ఉన్నారు. అనిరుద్ర చేతికి వున్న వాచీ వంక చూశాడు. ఆరు కావడానికి రెండు నిమిషాలు తక్కువ ఉంది.

“అనూ… ఏమిటీ శిక్ష? పొద్దున్నే టిఫిన్ చేయిస్తానని అంటే పేస్ట్ లేకుండానే బ్రష్తో పన్లు బరబరా గీకి మొహం కడుక్కొచ్చాను. అయ్యర్ హోటల్లో ఇడ్లీల వాసన ఇక్కడికి వస్తోంది” అన్నాడు కార్తీక్.

‘గెస్ట్లు రావాలి కదా… వాళ్లే హోస్ట్ లు చెప్పాడు అనిరుద్ర.

ఓసారి కార్తీక్ వైపు ఎగాదిగా చూసి, “నా కళ్లకు నువ్వో పెద్ద ఘోస్టులా కనిపిస్తున్నావు అన్నాడు.

“ఘోస్ట్ అంటే… నేనెవరో ఘోస్ట్ రైటర్ని అనుకుంటారు. అసలే ఈ మధ్య ఘోస్టీన్గ్ గురించి అందరూ చెవులు కొరుక్కుంటున్నారు” అనిరుద్ర మాట్లాడుతూ వుండగానే ఓ ఆటో వాళ్ల ముందాగింది.

అనిరుద్ర ఆ ఆటోలో నుండి దిగిన అమ్మాయిలను చూశాడు. అందులో ద్విముఖ ను గుర్తుపట్టాడు. వాళ్లిద్దరూ అతని దగ్గరికొచ్చారు.

“హలో… నన్ను గుర్తుపట్టారా…. డ్రీమ్ టీవీ… యాంకర్…” అంది ద్విముఖ.

“గుర్తు పట్టకపోవడమేమిటి….” అంటూ కార్తీక్ వైపు చూశాడు అనిరుద్ర.

“ఏంటీ… ఇప్పుడేదైనా ప్రోగ్రామ్ చేస్తున్నారా?” క్రాఫ్ సరిచేసుకుంటూ అడిగాడు కార్తీక్.

“కాదు… పర్సనల్ పని…” అంటూ అనిరుద్రవైపు తిరిగి అనిమిషను పరిచయం చేస్తూ.

“అనిమిష… నా ఫ్రెండ్… రూమ్మేట్… మీ యాడ్ చూసింది. ఆ విషయమై మీతో మాట్లాడాలని” అంటూ ఆగింది ద్విముఖ.

“మనం టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం” అన్నాడు అనిరుద్ర.

“దట్స్ గుడ్. నా నోట్లో వున్న మాటలే మా వాడు చెప్పాడు” అన్నాడు కార్తీక్. అందరూ అయ్యర్ హోటల్వైపు కదిలారు. ఎర్లీ మార్నింగ్ కావడం వల్ల రష్ లేదు.

*** పొగలు కక్కే ఇడ్లీ టేబుల్ మీద ఉంది.

“మీకు భర్తగా జాబ్ చేయాలని ఎందుకు అనిపించింది?” అడిగింది అనిమిష.

“మీకు ఉద్యోగం చేయాలని ఎందుకు అనిపించింది?” ఎదురు ప్రశ్న వేశాడు అనిరుద్ర.

“అదేంటి… బ్రతకడానికి జాబ్ కావాలిగా…’

“నాకూ అంతే…”

“మీ క్వాలిఫికేషన్ కు ఏదో ఓ మంచి జాబ్ వస్తుందిగా…” “అంటే భర్త జాబ్ మంచిది కాదని మీ ఉద్దేశమా?”

“నా ఉద్దేశం అది కాదు…” చప్పున అంది అనిమిష.