నాన్ సెన్స్ గా మాట్లాడకు. సెన్స్తో ఆలోచించిచు… Part 2 180

శోభరాజ్ ఒక్కక్షణం ఇబ్బందిగా కదిలి, “కంగ్రాట్స్ చెప్పాల్సింది నాక్కాదు… అనిమిషకు కాబోయే శ్రీవారికి… అన్నట్టు మీక్కాబోయే శ్రీవారి పేరేమిటి అనిమిషా…” అని అడిగాడు.

“అనిరుద్ర” సిగ్గుపడ్తూ చెప్పింది అనిమిష, స్టాఫ్ అంతా షాకయ్యారు. నిఖిత ఇబ్బందిగా బాస్వైపు చూసింది. భావనలో చిన్న ఫీలింగ్. బాస్ మొహంలోని బాధ ఆమెకు అర్ధమవుతూనే ఉంది.

“లెటజ్ కంగ్రాట్స్ హర్…” అనగానే స్టాఫ్ ఒక్కొక్కరూ అనిమిషను అభినందించసాగారు.

“డియర్ స్టాఫ్… నిన్ననే నేనో ప్రామిస్ చేశాను. నా దగ్గర పనిచేసే స్టాఫ్లో ఎవరి పార్ట్నర్ కి ఉద్యోగం లేకపోయినా రెట్టింపు జీతం ఇస్తానని. అలా పెళ్లయిన వెంటనే డబుల్ జీతం అందుకునే అదృష్టవంతురాలు మన అనిమిషే. అంతేకాదు… మన సంస్థలో పనిచేసే అనిమిష కొత్త కాపురానికి కావాల్సిన ఫర్నిచర్ సమకూర్చుకోవడానికి కావాల్సిన లోన్ ఇంట్రెస్ట్ లేకుండా… సంవత్సరంపాటు కటింగ్ లేకుండా అందిస్తున్నాను” అన్నాడు శోభరాజ్.

అందరూ చప్పట్లు కొట్టారు. శోభరాజ్ మరోసారి స్టాఫ్ వైపు చూసి, “ఈ రోజంతా మీరు పని చేయనక్కర్లేదు… జాలీగా కబుర్లు చెప్పుకోవచ్చు… అఫ్ కోర్స్ నా గురించి కామెంట్స్ కూడా చేసుకోవచ్చు… రేపు అనిమిష మ్యారేజ్ డే కోసం గిఫ్ట్ కోసం షాపింగ్ చేయడానికి మ్యారేజ్ ఏర్పాట్లు చేయడానికి సెలవు ప్రకటిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ అనిమిషా… సీ యూ టుమారో…” అంటూ శోభరాజ్ తన క్యాబిన్ లోకి వెళ్లిపోయాడు.

టెంపుల్లో పెళ్లి సింపుల్ గా జరిగింది. ఆఫీసు స్టాఫ్ అంతా వచ్చారు. అనిరుద్ర తరపు నుంచి బామ్మ, కార్తీక్ మాత్రమే వచ్చారు. పెళ్లి తంతు ముగిశాక అంతా ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు. అనిరుద్ర అనిమిషతోపాటు బయల్దేరే ముందు బామ్మ అనిమిషను ఆపింది.

“చూడమ్మా.. అనిమిషా… నువ్విప్పుడు నాకు మనవరాలివి… నా మనవడికి ఓ విధంగా బాస్… వాడు నీ దగ్గర మొగుడు ఉద్యోగం చేస్తున్నందుకు నాకేం బాధగా లేదు… ఆ ఉద్యోగం పర్మినెంట్గా వుండేలా చేయమని ఆ తిరుపతి వెంకటేశ్వరుణ్ణి వేడుకుంటున్నాను. నీకు ఎన్నో ముచ్చట్లు జరిపించాలని ఉంది. అవేవీ మీ ఒప్పందంలో లేవని మా అనిరుద్దుడు చెప్పాడు. నీకో విషయం తెలుసా అనిమిషా… అనిరుద్దుడు మన్మధుడి కొడుకు పేరు. ఆ పేరు పెట్టుకున్న మా అనిరుద్ధుడికి మొదటి రాత్రి యోగం లేదు… అయినా బాధలేదు. ఇంకా ఎన్నో రాత్రులు ఉన్నాయి. వాడి పెళ్లయినా వాడికి ఉద్యోగం దొరికినా కాశీకి వస్తానని మొక్కుకున్నా. రేపే బయల్దేరుతున్నాను. నేను కాశీ నుండి వచ్చేటప్పటికి నువ్వు నా మనవణ్ణి పర్మినెంట్ మొగుడిగా చేసుకోవడం నేను చూడాలి…” అంటూ కళ్ళు ఒత్తుకుంది బామ్మ.

అనిమిష కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇలాంటి వ్యక్తిత్వం వున్న బొమ్మలు కూడా ఉంటారా? బామ్మ అనిరుద్రవైపు తిరిగి చెక్ బుక్, తాళాల గుత్తి చేతిలో పెట్టింది.

“ఒరే… ఈ ఆస్తి అంతా నీదే… నా మనవడికి కాకుండా ఎవరికిస్తాను? ఆ దేవుడే వచ్చి అడిగి ఒక్క పైసా కూడా ఇవ్వను… జాగ్రత్తగా…” అంటూ అనిరుద్ర బుగ్గల మీద ముద్దు పెట్టుకుంది. అనిరుద్ర కళ్లు చెమ్మగిల్లాయి.

****