నాన్ సెన్స్ గా మాట్లాడకు. సెన్స్తో ఆలోచించిచు… Part 2 180

“ఇలాంటివన్నీ కామన్… కొంతమంది కావాలనే టీజ్ చేస్తారు. మరి కొంతమంది ట్రయ్ చేస్తారు… అన్నట్టు మొత్తం ఇవాళ మన ఫోన్ కాల్స్ ఎన్ని?”

“దీంతో కలిపి వన్ ఫార్టీ టూ” అన్నాడు కార్తీక్.

“అంటే వన్ ఫార్టీ త్రీ… అంటే ఐ లవ్ యూకు ఒకటి తక్కువగా వుందన్నమాట…” అన్నాడు ఆ నెక్ట్ కాల్ అనిమిషదే అవుతుందన్న విషయం తెలియని అనిరుద్ర. రాత్రి పదకొండు నలభై…

అనిమిష ఆలోచిస్తోంది… టేబుల్ మీద ద్విముఖ తెచ్చిన ఆవేల్టి దినపత్రిక ఉంది. అందులో అనిరుద్ర ఇచ్చిన ప్రకటన , ఉంది. అనిమిష కళ్ల ముందు యాక్సిడెంట్ దృశ్యం కదలాడుతోంది. భయానకమైన ఆ సంఘటన ఆమె మొహంలో స్వేదాన్ని అద్దింది. అలా ఆ…లో…చి…స్తూ…నే ఉంది.

పదకొండు యాభై అయిదు నిమిషాలు. యాభై ఆరు నిమిషాలు… యాభై నాలుగు నిమిషాలు…

టేబుల్ మీద వున్న మొబైల్ తీసి డయల్ చేసింది. 92462-02616 ఒక్కో నంబర్ డయల్ చేస్తుంటే ఆమె చేతి వేళ్లు సన్నగా కంపించసాగాయి. చిన్నపాటి ఉద్వేగం ఆమె మహా శరీరాలను ఆక్రమించుకుంది.

అనిరుద్ర ఆకాశం వంక చూస్తున్నాడు. అతని గుండెల మీద మొబైల్ ఫోన్. ఒక్క క్షణం చిన్నపాటి క…ద…లి…క. ఫోన్ రింగవుతోంది. టైం చూశాడు. అర్ధరాత్రి పన్నెండు గంటలు… మొబైల్ తీసి ఓకే బటన్ ప్రెస్ చేసి, ‘హలో’ అన్నాడు.

“మీరు మిస్టర్ అనిరుద్రే కదూ…” అవతల వైపు నుంచి మనసు పొరలను స్పృశించే కంఠం.

“అవుననే అనుకుంటున్నాను… ఇంతకూ మీరు…”

“మీ ప్రకటన చూశాను. మిమ్మల్ని కలవాలి”

“ఇప్పుడా… ఈ టైంలోనా…”

“సారీ… ఇప్పుడు కాదు. రేపు… రేపొద్దున్నే ఆరు గంటలకు వీలవుతుందా?”

“వ్వా…ట్… మార్నింగ్ సిక్స్ కా? తర్వాతైతే కుదర్దా” కాసింత టీజింగ్ కనిపించింది అనిరుద్ర గొంతులో.

“పది గంటలకు ఆఫీసుకు వెళ్లాలి… అంటే తొమ్మిదిన్నరకు బయల్దేరాలి… తొమ్మిదిన్నరకు బయల్దేరాలంటే ఏడు గంటలకే పనులన్నీ మొదలు పెట్టాలి. అందుకే మిమ్మల్ని ఆరు గంటలకు కలుద్దామని”

“నో ప్రాబ్లమ్… నేనే మీ ఆఫీసులో లంచ్ అవర్లో కలుస్తాను” “వదొద్దు… నేనే కలుస్తాను”

“పోనీ మీ ఇంటికి వచ్చేయమంటారా?”

“వద్దోద్దు… నేనే మా ఫ్రెండ్ ని తీసుకొని వస్తాను”

“జనరల్గా ఇలాంటి అపాయింట్ మెంట్స్ ఇవ్వను. మీ కోసం ఒప్పుకుంటున్నాను. మరో విషయం తెలుసా? చాలామంది కలుద్దాం అన్నారు. అందరికీ రేపు ఉదయం పది తర్వాతే అపాయింట్ మెంట్ ఇచ్చాను”

అవతలివైపు అనిమిష కామ్గా ఉండిపోయింది.

“ఏంటీ… మగవాళ్ల సైకాలజీ ఇలానే ఉంటుంది. వాళ్లను వాళ్లే మోసుకుంటారని ఫీలవుతున్నారా? నేను నిజం చెప్తున్నాను. అన్నట్టు… రేపు ఉదయం క్వశ్చన్ అవర్ ఉంటుందా? ఐ మీన్ మీరు నన్ను ప్రశ్నలడగడం లాంటివి…”

“క్వశ్చనవర్ ఏమీలేదు. ఓన్లీ క్లారిఫికేషన్” అటువైపు నుంచి అనిమిష చెప్పింది.

“ఇంతకీ మీ పేరు చెప్పలేదు”

“రేపు కలిశాక చెప్తాను. అయినా ముందు పని ముఖ్యం కదా”

“మరేం లేదు… నేను పనిచేసే ఆఫీసు పేరు… అదే బాస్ పేరు తెలుసుకోవాలిగా” నవ్వి అన్నాడు అనిరుద్ర..

“గుడ్ నైట్” అంది అట్నుంచి అనిమిష

“గుడ్ నైట్” చెప్పాడు అనిరుద్ర.