నాన్ సెన్స్ గా మాట్లాడకు. సెన్స్తో ఆలోచించిచు… Part 2 180

“రామ్ గోపాల్ వర్మకు ఓ మాంచి మర్డర్ థ్రిల్లర్ కథ చెప్పాలనుకుంటున్నాను…

“మీకెప్పుడైనా మీ బామ్మను చంపాలనిపించిందా’ అన్నది ట్యాగ్ లైన్ చెప్పాడు కామ్గా అనిరుద్ర.

“వ్వాట్… ఏంటీ నేనిక్కడ సీరియస్గా మాట్లాడుతుంటే సెటైర్స్ వేస్తున్నావా? అయినా బామ్మను చంపే ఉద్దేశం ఉందా? తప్పురా… బామ్మపోతే ఆ ఆస్తి అంతా నీకొస్తుందో? లేదో… కనుక్కొని ప్లాన్ చెయ్యరా” చెప్పాడు కార్తీక్.

“ఏంటీ కార్టూన్లా…” అంటూ లేచి కూర్చున్నాడు అనిరుద్ర. రెండు

“నీకో విషయం తెలుసా అనూ… బామ్మ తను చచ్చేలోగా నువ్వు ఉద్యోగం చేయకపోయినా, పెళ్లి చేసుకోకపోయినా ఆస్తి అంతా అభిషేక్ బచ్చన్ కు ఇస్తుందట”

“అదేంటి? ఎందుకలా?” తాపీగా అడిగాడు అనిరుద్ర.

“చచ్చే ముందు అభిషేక్ బచ్చన్ ని దత్తత తీసుకుంటుందిట… అమితాబ్ ను ఈలోగా సంప్రదించి పర్మిషన్ అడుగుతుందిట. ‘మొన్నో రోజు రాత్రి నిద్రలేపి మరీ నాకీ విషయం చెప్పి నువ్వడినా అడగకపోయినా నీకు చెప్పి బెదిరించమని చెప్పింది”

అనిరుద్రకు నవ్వొచ్చింది. బామ్మ చేసే పనులు చాలా వింతగా ఉంటాయి. ఆవిడ బ్లాక్ మెయిల్ చేస్తుందా?

సరిగ్గా అప్పుడే ఓ అమ్మాయిల గుంపు అటుగా వచ్చి అనిరుద్రను చూసి, కాసేపు వాళ్లలో వాళ్లే గుసగుసలాడుకొని కన్ఫర్మ్ చేసుకొని అతని దగ్గరకొచ్చారు.

“మీరు డ్రీమ్ టీవీ “ఏం చేయాలనుకుంటున్నారు?’ ప్రోగ్రామ్లో వచ్చారు కదూ…” అని అడిగారు.

“సారీ మీరు ఎవర్ని చూసి ఎవరు అనుకుంటున్నారో….” అనిరుద్ర అన్నాడు.

“మీ పేరు అనిరుద్ర కదూ…”

“ఏం నేను కూడా బీచ్ లో కనిపించి చచ్చానుగా… నన్నడగొచ్చుగా” పక్కనే వున్న కార్తీక్ కు ఒళ్లు మండి అన్నాడు.

“ఆ అమ్మాయిల్లో జీన్స్ వేసుకున్న ఓ అమ్మాయి అనిరుద్రవైపు తినేసేలా చూస్తూ, “నా దగ్గర పోస్టుంది… అదే మొగుడి పోస్టు చేస్తారా?” అనడిగింది.

అనిరుద్ర ఆ అమ్మాయి మొహంలోకి చూస్తూ, “పార్ట్ టైమా? ఫుల్ టైమా?” అని అడిగాడు. ఆ అమ్మాయి కంగుతిని, “అదేంటి?” అంది.

“పార్ట్ టైమ్కో రేటు. ఫుల్టైమ్ కో రేటు. నైట్ కూడా చేస్తే ఒ.టి ఇవ్వాల్సి ఉంటుంది. అన్నట్టు మీ ఫోన్ నెంబరెంత?” అన్నాడు జేబులో నుండి పెన్ తీస్తూ.

“ఎందుకు?” అనిరుద్రను సరదాగా ఏడిపించాలనుకున్న ఆ అమ్మాయి కంగారుపడిపోయి అడిగింది.

“మీ పేరెంట్స్తో శాలరీ అగ్రిమెంట్ రాయించుకోవడానికి. అన్నట్టు ఏ కాలేజీ?” మళ్లీ అడిగాడు అనిరుద్ర.

“కాలేజీ పేరెందుకు?”

“మీ ప్రిన్సిపాల్ తో ఈ డిటైల్స్ చర్చించడానికి. మీ కాలేజీలో కూడా అందరికీ తెలిస్తే బాగుంటుంది కదా…” అనరుద్ర కామ్గా చెప్పాడు.

అమ్మాయిల గుంపులో కలకలం. జీన్స్ వేసుకున్న అమ్మాయిలో భయం. ఏదో సరదాగా టీజ్ చేద్దామనుకుంటే అతనే తమకు పాఠం చెప్పేలా వున్నాడన్న భయం పట్టుకుంది. మెల్లిగా అక్కడ్నుంచి జారుకున్నారు.

“అనవసరంగా మంచి బేరం చెడగొట్టావు” కార్తీక్ అన్నాడు.

“వాళ్లేదో సరదాగా మనల్ని ఆటపట్టిస్తున్నారు. మనం ఏం చేసినా సీరియస్గానే పద…” అన్నాడు అనిరుద్ర.

“ఎక్కడికి?”

“ఎక్కడికి?”

“పత్రికలో యాడ్ ఇవ్వడానికి

“యాడా! ఏమని?”

“కావలెను. అందమైన పోస్ట్ గ్రాడ్యుయేట్ యువకుడికి ‘భర్తగా ఉద్యోగం ఇచ్చే అమ్మాయి కావలెను”

“ఏంటీ ఇలానే ఇస్తావేంటి? సీరియస్సే?” కార్తీక్లో అనుమానం.

“ఇంకా డౌటెందుకు? బామ్మ సమస్యకు, మన సమస్యకు పరిష్కారం ఇదే! అయినా నాక్కూడా లైఫ్ లో సెటిలవ్వాలని ఉంది. హాయిగా మొగుడి ఉద్యోగం చేసుకుంటూ, నెలనెలా జీతం తీసుకొంటూ వుంటే ఆ సెక్యూరిటీనే వేరు. ఎవరి కిందా పని చేయవలసిన అవసరం ఉండదు”