లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – Part 1 247

నేను అసలు వాటి సంగతే మరచిపోయాను.

“రేపటిలోపల పంపిస్తానండి”

“పర్లేదండి…..”

“ప్రియ……. నువ్వు ఏమి అనుకోనంటే….. ”

“పర్లేదు చెప్పండి……”

“మనం ఒకసారి ఈ వీకెండ్ కలుద్దామా ఎక్కడైనా బయట??”

అటు వైపు సైలెంట్ అయిపోయింది కొంచెంసేపు.

“నేనే నిన్ను పికప్ చేసుకుంటాను డ్రాప్ చేస్తాను……”

“సంజయ్ గారు మీరు ఏమి అనుకోనంటే…………”

తను ఏమి చెప్పాలనుకుంటుందో అని నేను వెయిట్ చేసాను

“…….. కావాలంటే షాపింగ్ అయ్యాక ఒకసారి కలుధ్ధాం…….”

కొంచెం సైలెంట్ అయ్యింది రెండు వైపులు కూడా

“పర్లేదండి……. అర్ధం చేసుకోగలను……. ఏదో ఒకసారి కలిస్తే బాగుంటుంది కదా అని అడిగాను….. అయితే తర్వాత కలుద్దాం”

“సంజయ్ గారు థాంక్స్ అర్థం చేసుకున్నందుకు…….. ఒక అమ్మాయి గా నా గురించి కొంచెం మీరు ఆలోచించాలి”

“లేదు లేదు నాకు అర్థమయిందిలెండి……. ఎనీవే థాంక్స్ అండి….. ”

“సరే సంజయ్ గారు, నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం”

10 రోజుల తర్వాత ……..

ప్రియకి ఫోన్ చేసాను:

“హలో”

“సంజయ్ గారు చెప్పండి”

“అమ్మ నాన్న ఎల్లుండి వస్తున్నారండి………… ”

“ఓ మా అమ్మ నాన్న రేపు వస్తున్నారు….. ఎక్కడ కలుద్దాం ఎళ్ళుండి ”

“………xxabcxx….లో కలుద్దాం ప్రియ, అక్కడ సెలక్షన్ బాగుంటదంట……. మీరు కూడా ఏమైనా సజెస్ట్ చేయండి…… అక్కడికి కూడా వెళదాం”

“ఒకే సంజయ్ గారు”

“మీరు కొంచెం సంజయ్ గారు అని కాకుండా, సంజయ్ అని పిలవండి ప్లీస్, అండి గిండి, అంటే ఏదో పెద్ద మనిషిని పిలిచినట్లుంది”

1 Comment

  1. Super mawa ilanti stories Naku chala nachutayi madhylo apaku mawa manchi flow n feel ga undhi continue chy…

Comments are closed.