లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – Part 1 243

నేను నవ్వాను. ప్రియా కూడా నవ్వేసింది. తాను నవ్వితే చాలా బాగుంది. తను పూర్తిగా ఫ్రీగా నవ్వటం ఇప్పుడే చూస్తున్నాను.

నేను వెంటనే ఆపుకోలేక “ప్రియా గారు, మీ నవ్వు చాలా బాగుందండి…….. ” అనేశాను.

ప్రియ ఆల నా కామెంట్ విని కొంచెం షాక్ లో ఉన్నట్లుంది.

ప్రియ “సంజయ్ గారు…..” అని ఏదో చెప్పబోయి మల్ల సర్దుకుంది.

నేను “పర్లేదు చెప్పండి……. ”

“మీరు బాగా ఫ్రాంక్ అండ్ ట్రాన్స్పరెంట్ అనుకుంట…….. చాలా ఓపెన్ గా అన్ని చెప్పేస్తున్నారు”

“అవునండి…..మంచి ఉద్దేశంతో ఒక మంచి మాట చెప్తే తప్పేముంది….. ఫస్ట్ టైం చూసినప్పుడే మీకు కనెక్ట్ అయిపోయాను………. నేను ఎవ్వరితో జనరల్ గా ఇలా మాట్లాడను…….కానీ మీతో మాత్రం ఎందుకో ఓపెన్ గా ఫ్రీగా మాట్లాడేస్తున్నాను……… నా నోటి నుంచి ఆలా ఆలా మాటలొచ్చేస్తున్నాయి…….”

నా ఫోన్ మోగింది. అమ్మ ఫోన్ చేస్తుంది.

ప్రియా నా ఫోన్ వైపు చూసి “సరే అండి ఇక వెళ్దాము లోపలికి……”

“ప్రియా గారు, మీ అభిప్రాయం ఇంకా చెప్పలేదు …..”

తాను కొంచెం నవ్వి, కొంచెం సిగ్గు పడి లోపాలకి వెళ్ళింది. నేను కూడా లోపలికి వెళ్లాను. చూస్తే సంబంధం సెట్ అయ్యే లాగ ఉంది.

పెద్దలు మమ్మల్ని అడిగారు మాకు ఓకేనా కదా అని. నేను ఒకే అన్నాను. తనేమో అమ్మ నాన్న ఇష్టం అని చెప్పింది. ఎందుకో అవును అని చెప్పటానికి చాలా సిగ్గుపడిపోతుంది. అయితే తను హైదరాబాదు లోనే ఉద్యోగం చేస్తుంది. ఆ విషయం గురించి అడగటం మరచిపోయాను. తన ప్రొఫైల్ లో చూసాను. తను ఒక IT కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. అక్కడే దగ్గరలోనే నేను పనిచేసే కంపెనీ ఆఫీస్ కూడ. నాను IT వద్దనుకుని, హార్డ్వేర్ కంపెనీ లో రీసెర్చ్ వింగ్ లో పనిచేస్తున్నను.

అయితే పెళ్లి మాటలు ఒక వారం తర్వాత అని నిర్ణయించుకున్నారు. వారి ఇంటి పెద్దలు, దగ్గర బంధువులు అలాగే మా ఇంటి పెద్దలు, దగ్గరి బంధువులు లేరు కాబట్టి. అందరూ ఒకసారి మాట్లాడుకొని నిష్ఠితార్ధనికి అలాగే పెళ్ళికి మూహూర్తం గురించి నిర్ణయించాలి అనుకున్నారు.

అయితే భోజనం చేసి వెళ్ళమని చెప్పారు. అయితే ఇంకా సమయం ఉంది కాబట్టి, అక్కడ గణపతి గుడి చాల ఫేమస్ అని చెప్పారు. అక్కడ ఎమి కోరుకున్న నిజం అవుతాయి అని చెప్పారు. ప్రియా వాళ్ళకి తెలిసిన అబ్బాయేవారో అనుకుంట మమ్మల్ని గుడికి తీసుకొని వెళ్ళాడు. మేము అతని వెనకాలే ఫాలో అయిపోయాము. గుడికి వెళ్లి దండం పెట్టుకొని, అక్కడి చల్లటి గాలి, చుట్టూ ఉన్న పచ్చదనం చూసి కాసేపు అక్కడే కూర్చున్నాము.

“ఎరా ఒక్క మాట మాట్లాడలేదు ఇప్పటి వరకు……”

“ఆలా ఎం లేదు అమ్మ……… ”

“మాకైతే పిల్ల చాలా నచ్చింది రా……..లక్ష్మి దేవి లాగా ఉంది. ఇంటికి కళ తెచ్చే దేవత లాగా ఉంది……మంచి కుటుంబం……. ”

“అవునమ్మా…….. నాకు కూడా సంబంధం బాగా నచ్చింది.”

ఇన్తస్లో నా చెల్లి “ఏంట్రా, నువ్వేనా మాట్లాడేది ??”

నేను “ఎందుకలా అంటున్నవ్ ??”

1 Comment

  1. Super mawa ilanti stories Naku chala nachutayi madhylo apaku mawa manchi flow n feel ga undhi continue chy…

Comments are closed.