లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – Part 1 243

1 రోజు తర్వాత………

అమ్మ నాన్న దగ్గరే ఉన్న హోటల్ లో దిగారు. నేను ఒక రిచ్ ఫ్రెండ్ నుంచి ఇన్నోవా కార్ ఒక రోజు వాడుకుంటాను అని తీసుకున్నాను. ఇన్నోవా కార్ లో అమ్మ నాన్నను ఎక్కించుకొని షాపింగ్ కోసం వెళ్ళాము.

షాప్ లోకి ప్రియ వాళ్ళు కూడా అప్పుడే వచ్చారు. ఇక్కడ మా ఎంగేజ్మెంట్ కు, సంగీత్ కు, పెళ్ళికి, పూజలకు బట్టలు కొనాలి. అయితే ఇద్దరకీ మాచింగ్ బట్టలు మరియు ఫోటోలలో బాగా వచ్చేవి కొనాలి. నాకు బట్టల గురించి పెద్ద మోజు కానీ అవగాహన కానీ లేదు. ఈ రోజు బట్టలేమో కానీ, ప్రియను మాత్రం బాగా చూడొచ్చు. అదేంటో తెలీదు, తన గురించి అస్సలు మరవలేకపోతున్నాను. ఎప్పుడు తన గురించే ఆలోచనలు. పిచ్చెక్కిపోతుంది. మొన్న టీవీ లో ఒక ప్రేమ సినిమా చూస్తూ, ఊహలలో విహరించాను. నా బుర్ర ను లవ్ హైజాక్ చేయినట్లుంది.

ప్రియ ఈ రోజు కూడా మోహంలో నవ్వు దాచుకొని నన్ను ఆలా ఆలా చూస్తూ నా వైపు చూసి కొంచెం కొంచెం సిగ్గుపడుతూ ఉంది. బాగా రెడీ అయ్యి, చాలా మంచి శారీ వేసుకొని చాలా క్యూట్ గా కనిపించింది.

ఆడవాళ్ళూ చీరాల గురించి చాలా సేపు తీసుకుంటారు కాబట్టి, మొదట నా బట్టలు తీసుకోవాలని అనుకున్నారు. మొదట కొన్ని డ్రెస్సులు చూపించారు. అయితే దాంట్లో ఒక డ్రెస్ నచ్చి, ఒకసారి ట్రయిల్ వేసుకోమన్నారు. లోపాలకి వెళ్లి ఆ డ్రెస్సు ను ధరించి, నా ఫోన్ తీసుకొని ప్రియ కి మెసేజ్ పెట్టాను “ఎలా ఉంది” అని. అప్పుడు బయటకు వచ్చాను.

అందరికి డ్రెస్ నచ్చింది. ఒకసారి ముందుకి వెనక్కి తిరగమన్నారు. డ్రెస్ ఒకే అనుకున్నారు. నాకు నచ్చిందా అని అడిగారు. నేను అప్పుడే ఫోన్ పాకెట్ లో నుంచి తీసి చూసాను. ప్రియ “thumbs down” సింబల్ పెట్టింది. నేను డ్రెస్ అంత నాకు నచ్చలేదు అని చెప్పాను. లోపలి వెళ్లి ఇంకోటి ట్రై చేశాను. మల్ల మెసేజ్ పెట్టి బయటకి వచ్చాను. ఈసారి ప్రియ అమ్మకి, నా అమ్మకి నచ్చింది కానీ ఇద్దరి నాన్నలకి పర్లేదు అనిపించింది. ఫోన్ లో “thumbs up” సింబల్ చూసాను. వెంటనే ఒకే చేశాను. ప్రియా కూడా చాలా సైలెంట్ గా ఆలా ఆలా నాకు మెసేజ్ లు పంపింది. మొత్తానికి ఒక మూడు డ్రెస్సులు సెలెక్ట్ చేసాము ఒక గంటలో.

ఇప్పుడు ప్రియ చీరలు కొనాలి. అయితే ఆడవాళ్లది కాబట్టి మేము పక్కకు వచ్చేసి కూర్చున్నాము. మేము దూరంగా జెంట్స్ సెక్షన్ లో ప్రశాంతంగా కూర్చున్నాము. సడన్ గా ఫోన్ వైబ్రేట్ అయ్యింది. ప్రియ తన శారీ పైన కొత్త శారీ భుజం పై వేసుకొని ఒక ఫోటో పంపింది. నాకు అర్ధం కాలేదు, ప్రియ కు ఇంత ధైర్యం ఎప్పుడు వచ్చింది అని. కొంచెం ఆశ్చర్యం వేసి, అమ్మతో మాట్లాడాలని సాకు పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్లాను. ఇంకో కొత్త శారీ భుజం పై వేసుకొని తాపీగా ఫోటో తీసుకుంది. అంత ఓపెన్ గా ఎలా చేస్తుందో అర్థం కాలేదు. అక్కడ ఒక నిమిషం ఉంటె అర్థమైంది, ప్రియ వాళ్ళ ఆంటీ ఎవరికో పంపిస్తుంది ఫొటోస్, అలాగే నాకు కూడా.

నేను మల్ల వెనక్కు వెళ్లి. అప్పుడు ఒక్కో ఫోటో కి రిప్లై పెట్టాను. ఒక ఇరవై ఫోటోలు పంపింది. అన్నిటికి thumbs up పెట్టాను. తను నిజంగా అన్నిటిలో చాలా అందంగా కనిపించింది. కొంచెం సేపటి తర్వాత అన్ని మెసేజిలు డిలీట్ చేసేసింది. ఏమనుకుందో నాకు తెలీదు.

ఆ తర్వాత బయట ఒక హోటల్ లో తినేసి ఎంగేజ్మెంట్ ఉంగరాలు కొనటానికి వెళ్ళాము.

రింగ్స్ సెలెక్ట్ చేసుకోవటానికి వేరే షాపుకి వెళ్ళాము. అయితే రెండు మూడు షాపులలో మోడల్స్ చూసి రేట్ కనుక్కొని, రేపే కొనాలని ముందుగానే డిసైడ్ అయ్యాము. అలాగే ప్రియ కి శారీ కూడా ఇంకొకటి తీసుకోవాలి. అయితే, అన్ని మోడల్స్ చూసాము. నాకు ఒక రెండు మోడల్స్ నచ్చాయి కానీ ప్రియ కి ఏమి నచ్చలేదు, నచ్చినవాటికి రేట్లు నచ్చలేదు.

కొన్ని నగలు కూడా తీసుకోవాలని అనుకున్నారు. అందరం ఒకే చోట కూర్చున్నాం. నేను ప్రియని అలాగే చూస్తూ ఉండిపోయాను. తాను చాలా సెట్స్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ చూసింది. తనను మొత్తం స్కాన్ చేస్తూ ఉండిపోయాను. తను ఆ జ్యువలరీ షాప్ లైట్స్ లో చాలా కళగా కనిపించింది. తను చాలా నాజూకుగా, లేతగా ఉన్నందువల్ల ఇంకా అందంగా కనిపించింది. తన అందమైన కాళ్ళని, పాల బుగ్గలని, ముద్దుగా ఉన్న ముక్కుని, ఎర్రని పెదాలని, లేతగా ఉన్న చేతులని, భుజాలని ఏ ఒక్కటి వదల్లేదు.

ప్రియ అమాయకంగా చూస్తూ తీయని గొంతుతో మాట్లాడే మాటలు నా మనసులో ఆశలు రేకెత్తాయి. మనసు నిండా తన పై ఒక ఉద్రేకంతో కూడిన ఒక బలమైన ఆకర్షణ. మా ఇద్దరి మధ్యలో ఏదో కనపడని తీవ్రమైన ఉద్రిక్తత. చాలా ఇబ్బందిగా అనిపించింది. గత రెండు వారాలుగా తన గురించే అన్ని ఆలోచనలు. ఆలోచనలు వేరే వైపు మళ్ళించాను. చివరకి షాప్ బయటకి వెళ్లి ఒకసారి అటు ఇటు నడిచి ఫోన్ లో ఒక గేమ్ ఆడి లోపాలకి వచ్చాను.

మొత్తానికి ఆ రోజు పని అవ్వలేదు. మరుసటి రోజు కూడా అంతే. చాలా కష్టపడ్డాను తన గురించి ఆలోచించకుండా ఉండటానికి. మొత్తానికి బట్టల పని, ఉంగరాలు కొనటం అయ్యింది. ఆ మరుసటి రోజు పెళ్లి కార్డులు డిజైన్లు చూసి ఒకటి సెలెక్ట్ చేసాము. కానీ అందరికి నచ్చడానికి ఒక రోజంతా రక రకాల డిజైన్లు చూసాము. కానీ ఈ మూడు రోజులు ప్రియా పక్కనే ఉండటంతో చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. రాత్రి నిద్ర లేదు. ఇంకా పెళ్ళికి రెండున్నర నెలలు అంటే పిచ్చెక్కిపోయింది.

1 Comment

  1. Super mawa ilanti stories Naku chala nachutayi madhylo apaku mawa manchi flow n feel ga undhi continue chy…

Comments are closed.