లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – Part 1 247

“జస్ట్ డిన్నర్ అంకుల్. ప్లీజ్…… వచ్చే వారం ఎంగేజ్మెంట్ కదా కుదరదు….. అందుకే…. అంటే ఇప్పుడు ఆఫీస్ వర్క్ లేదు… ఇప్పుడు టైం ఉంది…. మళ్ల నాకు టైం దొరకదు అంకుల్, బాగా బిజీ అయిపోతాను…..”

“సరే బాబు కానీ తొందరగా ముగించుకొని ఇంటికి వచ్చేయండి….. అసలే రోజులు బాగోలేవు”

“థాంక్స్ అంకుల్……తనను రాత్రి ఇంట్లో డ్రాప్ చేసాక మీకు ఫోన్ చేసి చెప్తాను….. ”

“అలాగే బాబు”

ఫోన్ పెట్టేసి “ఇప్పుడు ఒకే నా ??”

“సంజు….. ఏంటది ఆలా ఫోన్ చేసి మాట్లాడేస్తారా అంత ఓపెన్ గా ?? నాన్న ఒప్పుకోవటం ఆశ్చర్యం గా ఉంది”

“తప్పేముంది, అంత ఓపెన్ గా చెప్పాను కదా…..ఎవరైనా ఎందుకు ఒప్పుకోరు ??”

ప్రియ కు ఎం మాట్లాడాలో అర్ధంకాలేదు అనుకుంటాను.

“ఇప్పుడు కొంచెం బెటర్ గా ఉందా నీకు ??”

“hmmmm కొంచెం”

“కొంచెం కాదే…. చాలానే …. ఇప్పుడు నీ మోహంలో మంచి కళ వచ్చింది”

ప్రియ నవ్వి “థాంక్స్ సంజు…..”

“ఇట్స్ ఒకే”

“అవును ఎందుకలా అబద్ధం చెప్పావ్ ఆంటీకి??”

“ఏమో సంజు తెలీదు. టెన్షన్లో ఆలా చెప్పేసాను”

“టెన్షన్ ఎందుకు ??”

“ఉండదా మరి ?? ఇలా నీతో రావటం”

“అవును తప్పేముంది దాంట్లో”

“తప్పనికాదు……ఇంకా పెళ్లి అవ్వక ముందు…..ఇలా బయటకు రావటం”

“ప్రియ మనం ఏమి తప్పుచేయట్లేదు ఓకేనా, జస్ట్ ఆలా బయటకు వచ్చాము…..అంతే….అంకుల్ కి కూడా చెప్పాను… ఆయన కూడా ఒప్పుకున్నారు కదా”

“అవును”

“అంకుల్ ఎలా ఒప్పుకున్నారో ఇప్పటికి నీకు అర్థం కావట్లేదు కదా ??” అని నవ్వుతూ అడిగాను.

“అవును”

“దాంట్లో ఎం మేజిక్ లేదు…… ఉన్న విషయం ఓపెన్ గా చెప్పి రిక్వెస్ట్ నీ ముందే చేశాను గా”

“hmmmmm”

“నీకు నమ్మబుద్ది కావట్లేదు కదా ??”

“అవును సంజు”

1 Comment

  1. Super mawa ilanti stories Naku chala nachutayi madhylo apaku mawa manchi flow n feel ga undhi continue chy…

Comments are closed.