లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – Part 1 248

నేను ఈలోపల సెలూన్ కి వెళ్లి నీట్ గా కటింగ్, షేవింగ్ చేయించుకుని, తల స్నానం చేసి, మంచి బట్టలు వేసుకున్న. ఈ లోపల ప్రియా తన లొకేషన్ వాట్సాప్ చేసింది. ఇంకో ఫ్రెండ్ దగ్గర స్విఫ్ట్ కార్ తీసుకొని ప్రియ దగ్గరికి వెళ్లాను. దారిలో ఒక రోజా పువ్వు తీసుకున్న.

తన అపార్ట్మెంట్ దగ్గర కార్ పార్క్ చేసి తనకు ఫోన్ చేశాను. తాను 5 మినిట్స్ లో వస్తాను అని చెప్పింది. ఆడవాళ్లు 5 మినిట్స్ అన్నారంటే కచ్చితంగా అరగంట తీసుకుంటారు. అందుకే దగ్గరలో ఉన్న బంక్ కి వెళ్లి ట్యాంక్ హాఫ్ ఫిల్ చేయించి మల్ల ఎనక్కి వచ్చా. ఒక 10 నిమిషాలు గడిచింది. ఒక రెండు నిమిషాల తర్వాత తన నుంచి కాల్ వచ్చింది. తాను గేట్ దెగ్గరకు వచ్చింది.

చాలా మంచి చీర కట్టుకొని అందంగా తయారయ్యింది. నేను కార్ తన ముందు ఆపి డోర్ తీసాను. తాను కార్ ఎక్కింది.

“హాయ్….. ”

“హలో సంజయ్…..”

“చాలా అందంగా ఉన్నావ్ ప్రియ…..”

తను కొంచెం నవ్వి ఊరుకుంది. రెస్టారెంట్లో మాట్లాడుకోవచ్చు అని, మ్యూజిక్ ఆన్ చేసి లో వాల్యూం లో పెట్టాను. ఒక 20 నిమిషాల్లో అక్కడికి చేరుకున్నాము. బయట వాలె కి కార్ కీస్ ఇఛ్చి హోటల్ లోపలి ఇద్దరం వెళ్ళాము. రెస్టారంట్ లోపలి వెళ్లి మా రిసర్వుడ్ టేబుల్ లో ఇద్దరం కూర్చున్నాం.

ఇద్దరం ఒకళ్ళకి ఒకళ్ళం చాల దెగ్గరగా, ఎదురెదురుగా కూర్చోవటం ఫస్ట్ టైం. చాల ఎక్ససైటీంగా అని పించింది.

ఈ లోపల వెయిటర్ మెనూ కార్డు ఇచ్చాడు.

“ప్రియ….. ఎం తిందాం…..”

“నీ ఇష్టం…….”

రోటి, కర్రీ, బిర్యానీ, కర్డ్ రైస్ ఆర్డర్ ఇచ్చాను. వెయిటర్ వెళ్ళిపోయాడు.

“ఈ రోజు వర్షం గారంటీ ”

“ఎందుకు ??”

“మొత్తానికి నువ్వు ఒప్పుకుని ఇక్కడికి వచ్చినందుకు”

తాను నవ్వింది.

“సరే….. నేను ఎందుకు కలుద్దాం అన్నాను అంటే….. నీకు ఇంతక ముందు అపార్ట్మెంట్ గురించి చెప్పను కదా??”

“hmmm…. ”

“నేను అపార్ట్మెంట్ సెలెక్ట్ చేయాలి…. అయితే నీ అభిప్రాయం కూడా నాకు కావాలి……పోయిన వారం షాపింగ్, ఈ వారం ఆఫీస్ వర్క్, వచ్చే వారం ఎంగేజ్మెంట్ తో బిజీ కాబట్టి…. ఆ తర్వాత వారం….. నేను ఇప్పటి దాకా చూసిన అపార్ట్మెంట్స్ లో మూడు నచ్చాయి…… నువ్వే వాటిల్లో ఏది నచ్చిందో చెప్పాలి”

ప్రియా చాల పాజిటివ్ గా ఫీల్ అయ్యింది. కొంచెం తన మోహంలో ఇప్పుడే కంఫర్ట్ వచ్చింది.

“ఒకే…..”

1 Comment

  1. Super mawa ilanti stories Naku chala nachutayi madhylo apaku mawa manchi flow n feel ga undhi continue chy…

Comments are closed.