లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – Part 1 245

తను నా వైపు చూసి “స్వీటీ కాదు ……. ప్రియ”

ఇద్దరం ఒకళ్ళను చూసి ఇంకొకళ్ళం నవ్వుకున్నాం.

“ప్రియ ఎందుకు స్వీటీ వద్దంటున్నావ్??”

“అమ్మ నాన్న ఇంట్లోవాళ్ళు తప్ప ఆలా నన్నెవ్వరు అలా పిలవలేదు….. ”

“ప్రియ గారు, నా పేరు సంజయ్ అండి, నేను మీకు కాబోయే హస్బెండ్ అండి…….ఇంకొక వారంలో మన ఎంగేజ్మెంట్ అండి….. ”

ప్రియ నవ్వి “సంజు, ఆలా అని కాదు”

“మరి ఎలాగా”

“కావాలంటే పెళ్లి అయ్యాక స్వీటీ అని నన్ను పిలుచుకో”

“ఎంగేజ్మెంట్ అంటే సగం పెళ్లి అయినట్లే……ఇంకొక వారం లో మన ఎంగేజ్మెంట్….”

“సంజు కావాలంటే ఎంగేజ్మెంట్ అయ్యాక స్వీటీ అని పిలుచుకో……” అని చెప్పింది.

“ఒకే…….”

ఒక నిమిషం ఇద్దరం సైలెంట్ గా ఉన్నాం

ప్రియ కు ఫోన్ వచ్చిందని కొంచెం పక్కకు వెళ్ళింది. ఫోన్ ఒక రెండు నిమిషాలు మాట్లాడి మల్ల వచ్చి కూర్చుంది.

“ప్రియ, నువ్వు సాంగ్స్ బానే వింటావా ??”

“వింటాను…….”

“ఎలాంటి సాంగ్స్ ఇష్టం నీకు??”

“ఆలా ఏమి లేదు. బాగుంటే ఏ సాంగ్స్ ఐన వింటాను, పాడతాను”

“నువ్వు సాంగ్స్ పాడతావ్ కదా?? మరచిపోయాను నేను అసలు…….”

“ఓన్లీ ఓల్డ్ సాంగ్స్ లేదా లేటెస్ట్ కూడా పడతావా ??”

“పాత పాటలు ఎవరు పాడతారు?? చిన్నపుడు పాడేదాన్ని…. ఇప్పుడు లాస్ట్ 10-15 ఇయర్స్ సాంగ్స్ పాడతాను”

“నీ ఫేవరెట్ సింగర్ ఎవరు ??”

“శ్రేయ ఘోషల్”

1 Comment

  1. Super mawa ilanti stories Naku chala nachutayi madhylo apaku mawa manchi flow n feel ga undhi continue chy…

Comments are closed.