లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – Part 1 245

నేను తనకి “నా చెల్లి డాక్టర్ చదువుతుంది. తాను అప్పుడే పెళ్లి చేసుకోదట. ఇంకా స్పెషలైజెషన్ చెయ్యాలి. నా జాతకం ప్రకారం నాకు పెళ్లి తొందరగా అయితే మంచిదట. అమ్మ నాన్న ఏమో మనవాడి గురించి మనవరాలి గురించి నన్ను అడుగుతున్నారు. కానీ నాకు ఇప్పుడే అలంటి ఆలోచనలు లేవు”

ప్రియ నవ్వి “మా ఇంట్లో కూడా అదే…… అర్ధంచేసుకోగలనులెండి”

నేను అప్పుడు “నాకు చిన్నపటినుంచి ట్రావెల్ అంటే ఇష్టం. వచ్చే 5-6 ఏళ్ళులో ఒక 10-15 దేశాలు చూడాలనుకుంటున్నాను…… ”

ప్రియా మోహంలో కొంచెం వెలుగు చూసాను “ఓ నాకు కూడా ఆలా దెస విదేశాలు తిరగాలనుంది…… నాకు యూరోప్ చూడాలని ఎప్పటినుంచో ఉంది”

నేను నవ్వి “అయితే మనకి బాగానే సెట్ అవుతుంది అనిపిస్తుంది…… ”

ప్రియా కొంచెం నవ్వింది.

“సంజయ్ గారు, నేను మిమ్మల్ని ఒకటి అడగలనుకుంటున్నాను……. ”

“పెళ్లి తర్వాత, వేరు కాపురమా లేక మీ తల్లి దండ్రులతో కలసి ఉంటారా ??”

“లేదండి, మా నాన్నకి ఊరు వదిలి రావాలని లేదు….పైగా సిటీ లో వాళ్ళు కష్టపడతారు….so వేరు గానే ఉండేది”

ప్రియ పాజిటివ్ గ ఫీల్ అయ్యింది.

“అయితే ఇంకా నేను అమ్మకి నాన్నకి చెప్పలేదు, పెళ్లి అయ్యాక ఒక అపార్ట్మెంట్ తీసుకోవాలని అనుకుంటున్నాను. దాని కోసం డబ్బులు కూడా సేవ్ చేస్తున్నాను. కొంచెం మంచి అపార్ట్మెంట్ తీసుకోవాలని కోరిక. ఇప్పుడు నాకు వచ్చే జీతానికి emi కడితే, మిగిలిన దాంట్లో దేశ విదేశల ట్రావెల్ కోసం ఇంకొంచెం డబ్బు సేవ్ చేస్తే మొత్తం మీద నాకు కొంచెం డబ్బులే మిగులుతాయి. అవి నెల ఖర్చులకు సరిగ్గా సరిపోతాయి. ఇంకేమన్నా కొనాలంటే డబ్బులు ఉండవు. అందుకే ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది. అప్పుడు భార్య నుంచి వచ్చే జీతంతో emi తో మంచి కార్ కానీ లేదా ఫ్రిడ్జ్ అని, మంచి ఫోన్లు….. అన్ని కొనుక్కోవచ్చు…….. ”

ప్రియా ఆలా నేను చెబుతూ ఉంటే ఆలా వింటూ ఉండిపోయింది. పూర్తయ్యాక “బాగానే ప్లాన్ చేసారండి మీరు….. ”

నేను నవ్వి “అయితే ఒక రెండేళ్లలో నా జీతం పెరుగుతుంది, అప్పుడు ఈ కష్టాలుండవులేండి……..”

ప్రియా నవ్వి “so అమ్మాయి ఉద్యోగం చేయటం మీకు okay అన్నమాట…..”

నేను అప్పుడు “అవును. మీరు కావాలంటే, నా జీతం పెరిగితే ఉద్యోగం మానేయవచ్చు……”

“మీరు మాటలు భలే కలుపుతున్నారండి……. కలిసి పది నిమిషాలు కూడా కాలేదు….. అప్పుడే అన్ని విశేషాలు మాట్లాడేసుకుంటున్నాం……. అప్పుడే నేను ఎప్పుడు ఉద్యోగం మానేయాలో మీరే చెప్పేస్తున్నారు…… “

1 Comment

  1. Super mawa ilanti stories Naku chala nachutayi madhylo apaku mawa manchi flow n feel ga undhi continue chy…

Comments are closed.