లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – Part 1 243

“నీకు బాగా సిగ్గెక్కువ”

“ఉండదా మరి…..”

నేను లైట్ గా నవ్వాను, నన్ను చూసి తను కూడా నవ్వింది.

“సో ఎలా అనిపించింది మన మీటింగ్ ఈ రోజు నీకు”

“గుడ్”

ప్రియ తో ఇలా సరదాగా గడపడం చాలా ఆనందాన్ని కలిగించింది. ఎందుకో తను సెక్సీ గా కాకుండా ఈ రోజంతా చాలా క్యూట్ గా కనిపించింది. పెళ్ళై ఉండుంటే కచింతంగా ఒక పది లిప్ లాక్ లు ఇచ్చేవాడిని. అంత క్యూట్ గా ఉంది తను. తన బుగ్గలను నలిపేయాలనిపించింది. తన కళ్ళు చాలా అందంగా ఉన్నాయి.

పెళ్ళైతే ఇలాగే తనతో రోజు కబుర్లు చెప్పుకుంటూ సరదాగా సాయంకాలాలు గడిపేయవచ్చు. ఇప్పుడు మాత్రం బయట వెథర్ చాలా చల్లగా హాయిగా ఉంది. ఒకళ్ళ చేయి ఒకళ్ళు పట్టుకొని ఆలా చల్లటి గాలిలో కబుర్లు చెప్పుకుంటూ, తను చెప్పే తీయటి మాటలు వింటూ తిరగాలనిపించింది. తనను బైక్ లో ఎక్కించుకొని తను నన్ను గట్టిగ కౌగిలించుకొని సరదాగా ఆలా ఆలా బైక్ మీద హైవే లో తిరుగుగుతూ బ్రేకులు వేస్తూ…….తనని టీస్ చేస్తూ ఉండాలనిపించింది.

నా జోబీలో ఉన్న పూవు తీసి తనకు ఇచ్చాను. తాను కొంచెం ఆశ్చర్యంగా చూసింది.

“దారిలో ఈ పువ్వుని చూసాను, నచ్చింది, కాళీ చేతులతో ఎందుకు అని……”

తాను నవ్వి “ఇప్పుడు వద్దు సంజు, నెక్స్ట్ టైం తీసుకుంటాను”

“వాడిపోతుంది”

“ఈ పువ్వు దేవుని కోసం”

“స్వీటీ…..”

“సంజు…. ఇంకా మానకి పెళ్లి కాలేదు కదా…… అందుకే”

“hmmm సరే….. ”

“పెళ్లయ్యాక ఎన్నైనా ఇలాంటివి ఇవ్వు తీసుకుంటాను…. సంజు”

“అలాగైతే రోజు తెస్తాను నీకోసం”

“సరే….” అని నవ్వుతూ చెప్పింది.

ఈ లోపల ఐస్ క్రీమ్స్ వచ్చాయి. అలా ఐస్ క్రీం తింటూ ఉంటె… కొన్ని ఊహలు ఆలోచనలు….. ఒక చల్లటి కోన్ ఐస్ క్రీం ఇద్దరం తింటూ ఉంటె….. తను ఐస్ క్రీం తింటూ కొంచెం ఐస్ క్రీం తన పేదలకు అంటుకొని. ఆ టైం లో తన పెదాల పై నా పెదాలను పెట్టి ఆ ఐస్ క్రీం ను నా పెదాలతో అలా పక్కకు అని తీయటి తన పెదాలను రుచి చూసి తన చెవిలో ఎంత అందంగా ఉందొ తనకి చెప్పాలనిపించింది.

1 Comment

  1. Super mawa ilanti stories Naku chala nachutayi madhylo apaku mawa manchi flow n feel ga undhi continue chy…

Comments are closed.