లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – Part 1 243

“నన్ను సంజయ్ అని పిలువు…… అండి గిండి కాదు….. ఎవరో పెద్దమనిషిని పిలుస్తున్నట్లుంది ఆలా అంటే”

ప్రియా నవ్వి “ఏమో సంజయ్ గారు, భర్తను ఏమండి అని పిలవాలి. మీరు నన్ను పేరు పెట్టి పిలవొచ్చు. ఇప్పుడు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి, సంజయ్ గారు అనే పిలుస్తాను ప్రస్తుతానికి”

కొంచెం ఆలా బయట ఉన్న తోట చూపించింది ప్రియ.

“ప్రియ…..”

“ఏంటి సంజయ్ గారు ??”

“ని ఫోన్ నెంబర్……. ”

“నా ఫోన్ నెంబరా ??”

నేను తల ఊపాను.

“మీరు చాలా ఫ్రాంకె కాదు ఫాస్టు కూడా…….. ”

“అంటే పెళ్లి మాటలు అయ్యాయి కదా అని ……… ”

“మన ఎంగేజ్మెంట్ ఇంకా నెల రోజులు టైం ఉంది, అప్పుడు మనం షాపింగ్ కు వెళ్ళినప్పుడు ఇస్తాను…… సరేనా సంజయ్ గారు ??”

తను కొంచెం నవ్వుతుంది కానీ దాచుకుంటుంది.

“ముందు మీ ఫోన్ నెంబర్ ఎంతో చెప్పండి” అని అడిగింది.

నేను నా నెంబర్ ఇచ్చాను తనకి. తన ఫోన్లో ఫీడ్ చేసుకుంది.

“ప్రియ ….. సరిగ్గానే నెంబర్ ఫీడ్ చేసుకున్నారా ??”

“చేసుకున్నానండి”

“లేదండి మీరు రాంగ్ నెంబర్ ఫీడ్ చేసుకున్నారు”

“సరిగ్గానే చేసానండి……. ”

“ఏది అయితే ఒక మిస్సెడ్ కాల్ ఇవ్వు నా నెంబర్ కి”

తన ఫోన్ తీస్కుని, ఏదో చెయ్య బోతుండగా….. ఒకసారి ఆగి…….. నా వైపు చూసింది. నేను నవ్వుతున్నాను.

“ఆమ్మో మీతో చాలా జాగ్రత్త సుమి…….. ”

“ఇక మీ అల్లరి చాలు…… నేను మీకు ఎంగేజ్మెంట్ షాపింగ్ అప్పుడు కాల్ చేస్తాను……. అప్పుడు మీకే తెలుస్తుంది నా నెంబర్”

కొంచెం ప్రియా ఎందుకో అంత ఇష్ట పడట్లేదు నెంబర్ ఇవ్వటానికి. అయితే ఇప్పుడే పెళ్లి మాటలు కుదిరాయి కాబట్టి తను నాకు ఇప్పుడే ఫోన్ నెంబర్ ఇస్తుంది అని నేను అనుకోవటం నా పొరపాటు. ఆడపిల్ల కదా కొంచెం జాగ్రత్త ఎక్కువ. తనకి కొంచెం సమయం కావాలి అనుకున్నాను. అయితే తనకు నా పై మంచి ఇష్టం, నమ్మకం కలిగినప్పుడు కచ్చితంగా తన ఫోన్ నెంబర్ నాకు ఇస్తుంది అనుకున్నాను.

అందరం కాసేపు అక్కడ ఉండి, భోజనం చేసి బయల్దేరబోతున్నాం….. ప్రియ వాళ్ళ అమ్మ నాన్న వెనుక నిల్చొని ఉంది. మేము వెళ్లొస్తాం అని చెప్పి వెళ్లే చివరి సమయంలో…… ప్రియ తన ఫోన్ తో చేయి ఊపింది…… నా ఫోన్లో కొత్త నెంబర్ తో మిస్సెడ్ కాల్ ఉంది. ప్రియా ఫోన్ చేసింది నాకు. అది చూసి, తన వైపు చూసి నవ్వాను. తాను కూడా నవ్వింది.

1 Comment

  1. Super mawa ilanti stories Naku chala nachutayi madhylo apaku mawa manchi flow n feel ga undhi continue chy…

Comments are closed.