లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – Part 1 242

“అనుకున్న”

“అంటే అందరూ సింగెర్స్ ఇష్టమే, కానీ ఈ కాలంలో ఉన్నవాళ్లలో……తను ఇష్టం”

“hmmmm…..”

“నువ్వు కంపెటిషన్స్ లో బాగా పాల్గొనివుంటావ్ గా??”

“హా అవును. చిన్నపుడు నా గొంతు విని పెద్ద సింగర్ అవుతానని అందరూ అనుకున్నారు”

“ఏమైంది తర్వాత??”

“10th వరకు బాగానే ఉండేది. ఇంటర్ నుంచి నీకు తెలుసుగా మన పరిస్థితి”

“hmmmmm ”

“అలాగే ఆ టైం లో సంగీతం మాస్టారు చనిపోయారు…ప్రాక్టీస్ ఆగిపోయింది…..”

” అదేలే”

“నీ గొంతు చాలా బాగుంటది….”

“థాంక్స్”

“అలాగే నువ్వు చాలా అందగా ఉన్నావ్”

“hmmm…”

“చాలా క్యూట్ గా కూడా ఉన్నావ్”

“ఇక చాలు నీ పొగడ్తలు”

ఇద్దరం నవ్వుకున్నాం. కానీ ఎందుకో ప్రియలో ఒక డిస్ కంఫర్ట్ చూసాను. ఫోన్ వచ్చిన తర్వాత నుంచి.

“ప్రియ….. నిన్నొకటి అడగొచ్చా ??”

“ఏంటి ??”

“ఫోన్ మాట్లాడినప్పటి నుంచి చూస్తున్నాను నిన్ను, అంత ఫ్రీ గా ఉన్నట్లు అనిపించడంలేదు నువ్వు….”

“సంజు……”

“ఏమైంది ??”

“నీకు ఒక విషయం చెప్పాలి”

“ఏంటి ??”

“….. ఇందాక అమ్మ ఫోన్ చేసింది…… ”

“ఓకే”

1 Comment

  1. Super mawa ilanti stories Naku chala nachutayi madhylo apaku mawa manchi flow n feel ga undhi continue chy…

Comments are closed.