లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – Part 1 245

ప్రియ ఫోన్ లో నవ్వింది.

“నిజంగా అంటున్నాను…….ప్రియ”

“అలా మిమ్మల్ని పిలిస్తే మనవాళ్ళందరూ అందరూ ఏమనుకుంటారో…. సంజయ్ గారు”

“పర్లేదు…… నీకు ఇబ్బందిగా ఉంటె బయట మాత్రం మామూలుగానే పిలువు, మిగిలిన సమయాల్లో, సంజయ్ అనే పిలువు.”

“ఏమో సంజయ్ గారు……… ”

“మా చెల్లిని చుడండి, నేను తనకు అన్నయ్య ఐన, ఎరా పోరా, అని పిలుస్తది నన్ను………నేను కూడా అలాగే పిలుస్తాను దాన్ని. మేము ప్రేమతోనే ఫ్రెండ్స్ లాగా ఆలా పిలుచుకుంటాం…… ఇది కూడా అంతే……. ”

ప్రియ నవ్వేస్తోంది ఫోన్ లో.

“అవును చెల్లి రావట్లేదా సంజయ్ ??”

“మొత్తానికి లైన్ లోకి వచ్చారన్నమాట…… ”

“అవును…… ”

“చెల్లి కాలేజీతో బిజీ. మెడిసిన్ కదా….. మీకు తెలుసు ఎలా ఉంటదో అక్కడ”

“ఆమ్మో మెడిసిన్ చాలా కష్టం……. ”

“వస్తే బాగుండేది……సర్లెండి”

“అంత సీన్ లేదు…… తనకు లైవ్ రిలే ఇవ్వాలంటే ఫోన్ లో ఎం కొంటున్నాము అని…… నాకు రీచార్జ్ చేయించమని చెప్పను”

“మీరు ఎప్పుడు అలాగే తన్నుకుంటూ ఉంటారా ??” అని నవ్వుతు అడిగింది ప్రియ

“మరి అంతే కదా……”

“నాకు ఒక తమ్ముడో అన్నో ఉంటే బాగుండేది……. ”

నేను నవ్వాను ఫోన్లో.

“సరే సంజయ్, మళ్ళా మాట్లాడుకుందాం….. ఇక్కడ బాస్ ఇటువైపే వస్తుంది….. మళ్ళీ మాట్లాడుకుందాం”

కాల్ కట్ అయ్యింది.

ఇద్దరం చాలా దూరంలో ఉన్నా, ప్రియతో ఫస్ట్ టైం చాలా దగ్గరగా మాట్లాడిన ఫీలింగ్ కలిగింది. తను సంజయ్ అని పిలవటం మొదలుపెట్టింది కాబట్టి, ఇప్పుడు తను నాకు బాగా దగ్గరైనట్లనిపించింది. ఆ రోజంతా ప్రియా గురించే ఆలోచించాను. కళ్ళు తెరిచిన తనే కళ్ళు మూసినా తనే. తనతో అలాగే ఫోన్ లో మాట్లాడుతూ ఉండిపోవాలనిపించింది.

పెళ్ళికి ఇంకా రెండున్నర నెలలు వెయిట్ చెయ్యాలి. ఎంగేజ్మెంట్ అయ్యాక, 2 నెలలు ఉంటాయి కాబట్టి, ఈ టైం లో కొంచెం ప్రియతో పరిచయం ఏర్పరచుకొని దగ్గరవ్వాలి. పెళ్లి అయ్యే ముందు కనీసం ఒకరి గురించి ఒకరకి మంచి పరిచయం ఉండాలి. పెళ్లి అయ్యే సమయానికి మాకు మంచి పరిచయం ఉంటె ప్రియా తో ఫస్ట్ నైట్ అలాగే హనీమూన్ బాగా ఎంజాయ్ చేయవచ్చు లేదంటే ఒక తెలియని వ్యక్తితో సమయం గడిపినట్లుంటుంది.

అయితే ప్రస్తుతానికి ఏదో ప్రియతో బాగానే మాట్లాడుతున్నాను కానీ తనకు ఎలా దగ్గర కావాలో నాకు తెలీదు. ఇదంతా చాలా కొత్తగా ఉంది. కొంచెం సేపు ఆలోచించి, నెట్ లో “డేటింగ్” గురించి చదవటం మొదలుపెట్టాను. అయితే నెట్ లో పుస్తకాలలో ఉన్నదంతా అమెరికాలో ఉండే డేటింగ్ విధానం గురించి. కానీ ఒక అరేంజ్డ్ మ్యారేజ్ విషయంలో ఎలా అమ్మాయికి దగ్గరవ్వాలి అన్నది ఎక్కడ దొరకలేదు. అందుకే ఉన్న పుస్తకాలు, నెట్ లో ఆర్టికల్స్ చదివి ఉపయోగ పడే విషయాలు నేర్చుకుని, మిగిలిన విషయాలు వదిలేద్దాము అని అనుకున్నాను.

రాత్రి 2 దాకా చాల చదివాను. కానీ ఇలాంటి విషయాలు పుస్తకంలో కన్నా నిజ జీవితంలోనే నేర్చుకోగలం అని అర్థం అయ్యింది. అన్ని పుస్తకాలు, నెట్ లో డౌన్లోడ్ చేసిన ఆర్టికల్స్ డిలీట్ చేసేసాను. గట్టిగ ఆలోచిస్తే నాకు తెలిసింది ఏంటి అంటే, కూల్ గా ఉంటె ఇలాంటి విషయాలులో బాగా ముందుకు వెళ్లగలము అని. ఎక్కువ ఆలోచిస్తే అనవసరంగా టైం వేస్ట్.

1 Comment

  1. Super mawa ilanti stories Naku chala nachutayi madhylo apaku mawa manchi flow n feel ga undhi continue chy…

Comments are closed.