లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – Part 1 242

అమ్మకి కట్నం లాంటివి నచ్చవు. మా అమ్మకి డాక్టర్ చదవాలని బాగా కోరిక ఉండేది కానీ ఆ రోజుల్లో అమ్మ చదువు ఆపించేసి మొత్తం డబ్బు తాత గారు అమ్మ పెళ్ళికి వాడేశారు.

మా నాన్నగారి వైపు కూడా అలంటి ఆలోచనలు ఉన్నాయి. మా తాతగారు ఒక చిన్న సంఘసంస్కర్త. మా నాన్నని డిగ్రీ వరకు చదివించిన ఆయనకు ఊరు వాళ్ళని వదిలి ఉండటం ఇష్టం లేక వెనక్కి వచ్చేసి అక్కడ కొన్ని సంవత్సరాలు తాత గారితో ఉండి, తర్వాత
చాల సంవత్సరాలు సర్పంచిగా పనిచేసారు. ప్రస్తుంతం అన్నిటికి దూరంగా ఉంటూ ఊరులో ఒక పెద్ద మనిషి గా ఉంటున్నారు. ఆయనకి ఊరన్న, ఊరిలో జనాలన్న చాల ప్రేమ.

మా చెల్లికి ఒక రూపాయి కట్నం తీసుకోకుండా ఉండే వాళ్ళనిచ్చి పెళ్లి చేయాలని మా అమ్మ నాన్న ఆశ. అందుకే ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు ఎక్కువైనా చెల్లి చదువు పైనే ఖర్చుపెట్టేస్తున్నారు డాక్టర్ చదివించటానికి. వాళ్ళిద్దరి ఉద్దేశం ఏంటి అంటే డబ్బు ఆడపిల్లల చదువుకి వాడాలి కానీ కట్నానికి కాదు అని.

ఈ విషయంలో, ప్రియ ఒక్కటే కూతురు కాబట్టి, కట్నంగా ఇచ్చే ఆస్తి, డబ్బు, వస్తువులు, అన్ని కూడా ప్రియా పేరు మీదే ఉంటాయి. పిల్లలు పెద్ద వాళ్ళయ్యాక, ప్రియ పేరు నుంచి డైరెక్ట్ గ వాళ్ళ పేరు మీదకి అన్ని ట్రాన్సఫర్ అవుతాయి.

అయితే నిష్ఠితార్థానికి మూహూర్తం నెల తర్వాత, పెళ్లి ముహూర్తం అక్కడినుంచి రెండు నెలల తర్వాత నిర్ణయించారు. మొత్తం ఇప్పటి నుంచి పెళ్లి 3 నెలలు. ఈ లోపల నిష్ఠితార్ధం అలాగే పెళ్లి పనులు చాలా ఉంటాయి. అయితే నిష్ఠితార్ధం కొంచెం తక్కువ ఖర్చుతో చేసి పెళ్లి మాత్రం ఎక్కువ ఖర్చుతో ఘనంగా చెయ్యాలని అనుకున్నారు. ఇక రిసెప్షన్ లాంటివి వద్దనుకున్నారు.

ప్రియని మాత్రం కళ్ళార్పకుండా అలాగే చూస్తూ ఉండిపోయాను. తాను కూడా నన్ను చూస్తూ కొంచెం సిగ్గు పడుతూ ఉంది. పయిన సారికన్నా ఈ సారి ఎక్కువ ఊహలు నన్ను దిష్టర్బ్ చేసాయి. తాను ఈసారి మాత్రం పోయిన సారికన్నా ఈ సరి చాల సెక్సీ గ కనిపించింది. తన చీర మాములు చీర అయినా, నా ఊహలలో మాత్రం తనను ఒక శృంగార దేవత లాగా ఊహించుకున్నాను. తను మాట్లాడే విధానం, నడిచే నడక, తన తీయని గొంతు, తను చూసే చూపులు అన్ని అలాగే చూస్తూ ఉండిపోయాను. నన్ను చుసిన వాళ్ళు ఏమనుకున్నారో తెలీదు.

కొంచెం మాటలు అయ్యాక, ప్రియ అందరికి ఇల్లు చూపిస్త అని చెప్పింది. నాకు ఈ లోపల అర్జెంటు ఫోన్ వచ్చి పక్కకి వెళ్లాను. వచ్చేసరికి, తను ఇల్లంతా చూపించేసింది మా వాళ్లకి.

అవకాశం దొరికింది కదా అని, కొంచెం అందరూ పక్కకు వెళ్ళిపోయిన సమయంలో “ప్రియ గారు, నేను ఇల్లు చూడలేదండి…..” అని అడిగాను.

“మనకి అంత సెట్ అయ్యింది కాబట్టి, ఇంకా మీరు గారు ఎందుకండీ, ప్రియ అని పిలవండి చాలు”

నేను నవ్వి “సరే ప్రియ, ఇల్లు చూపిస్తావ”

తను నవ్వి “రండి చూపిస్తాను”

అంత ఇల్లు చూపించక ఇద్దరం ఇంటి బయటకు వెళ్ళాము.

“సంజయ్ గారు, ఈ రోజేంటండి, కళ్ళార్పకుండా అలాగే చూసారు నన్ను………. ”

“నువ్వు చాలా అందంగా ఉన్నావ్ ఈ రోజు”

ప్రియా సిగ్గు పడింది.

“చాలా సిగ్గండి మీకు, చూడండి మీ బుగ్గలు ఎలా ఎర్రగా అయిపోయాయో. ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నారు”

ప్రియ నా మాటలు విని ఎం చెయ్యాలో అర్థంకావటంలేదు. సిగ్గుతో ఉంది, నవ్వుతుంది, అలాగే కొంచెం షాక్ లో ఉన్నట్లుంది. నాకు కూడా ఫ్లో లో ఆలా వచ్చేసింది.

“సారి ప్రియ ఏమి అనుకోవద్దు, మాటలు ఆలా ఆలా వచేస్తుంటాయి కొన్ని సార్లు”

ప్రియా కొంచెం పెదాలతో నవ్వుతు తల అటు ఇటు ఊపి ఏమి మాట్లాడలేదు.

1 Comment

  1. Super mawa ilanti stories Naku chala nachutayi madhylo apaku mawa manchi flow n feel ga undhi continue chy…

Comments are closed.