లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – Part 1 242

“నేను తనకి ఎప్పుడు అన్ని ఓపెన్ గా చెప్పేస్తాను…… ”

“ఒకే…. నేను మా అమ్మతో అంతే”

“కానీ మనం ఇలా కలసినట్లు తనకి చెప్పలేదు……నేను బిజీ గా ఉన్నానని తనకు మళ్లా ఫోన్ చేస్తాను అని చెప్పాను……. నేను ఆఫీస్ లో ఉన్నానా అని అడిగింది…… టెన్షన్లో…..నేను ఇంట్లోనే ఉన్నాను అని అబద్దం చెప్పను…. నేనుప్పుడూ తనతో ఆలా అబద్ధం ఆడలేదు”

నాకు తన విషయం అర్థమైంది. తను గిల్టీ గా ఫీల్ అవుతుంది.

“….నేను నిజం చెప్తే ఏమనుకుంటదో అని అబద్దం ఆడాను…… ఇప్పుడేమో నేనేదో తప్పుచేస్తున్న ఫీలింగ్ నాలో ఉంది….”

ఒక రెండు నిమిషాలు నిశబ్దం. నేను ఆలోచించడం స్టార్ట్ చేశాను. ఈ సిట్యుయేషన్ ఎలా సాల్వ్ చెయ్యాలి అని. ఎందుకంటే ప్రియ తో ఫస్ట్ టైం ఇలా బయటకు వచ్చాను. ఇలాంటి సిట్యుయేషన్ చెడటం నాకు అస్సలు ఇష్టం లేదు.

“ఒకే ప్రియ…….. ఇప్పుడు మీ అమ్మకు ఒకే అంటే నీకు ఒకే కదా ??”

ప్రియ మోహంలో కంఫర్ట్ వచ్చింది “అవును”

నేను నా ఫోన్ తీసుకొని “అంకుల్ నెంబర్ చెప్పు…..”

“సంజయ్ ఏంచేస్తున్నావ్?? నాన్నకి ఫోన్ చేస్తావా ??”

“అవును…..”

“సంజు వద్దు…..నాన్న స్ట్రిక్ట్…..”

“నేను చెప్తాగా….”

“సంజు…..”

“నెంబర్ చెప్పు ప్లీజ్”

“సరే నోట్ చేసుకో….. ”

నేను నెంబర్ డయల్ చేసాను. ఫోన్ రింగ్ అవుతుంది.

“హలో అంకుల్, నేను సంజయ్ మాట్లాడుతున్నాను హైదరాబాద్ నుంచి”

“అల్లుడు గారు చెప్పండి…..”

“ఎం లేదు అంకుల్, ప్రియ ను నేను బయటకు తీసుకొని వెళ్లాలనుకుంటున్నాను….. మీ పర్మిషన్ కావాలి….. అందుకే ఫోన్ చేశాను మీకు”

“బయటక ??”

“అవును అంకుల్. ఒక రెస్టారంట్ కి డిన్నర్ కోసం వెళ్లాలని. 9:30 లోపల తనను ఇంట్లో డ్రాప్ చేస్తాను”

“బాబు పెళ్లికి ముందు ఇలాంటివి……”

1 Comment

  1. Super mawa ilanti stories Naku chala nachutayi madhylo apaku mawa manchi flow n feel ga undhi continue chy…

Comments are closed.