రీతూ పాల్ – Part 3 87

వెళ్ళి ప్రొడ్యూసర్ రమ్మంటున్నాడని అనన్యకు చెప్పాను.

తరువాత ఆ రోజు సాయంత్రం క్యాషియర్ దగ్గరికి వెళ్లి డబ్బులు అడిగాను.

క్యాషియర్: ఏంటి ఇప్పుడు వచ్చి అడిగితే ఎలా?

అమల: సార్ మీకు ఫోన్ చేసి చెబుతానన్నాడు.

క్యాషియర్: పేరు ఏంటి?

అమల: అమల. హీరోయిన్…

క్యాషియర్: చెప్పారు. నీ కోసమే కాచుకున్నాను. అని 50000 ఇచ్చాడు.

అమల: సార్ 2,50,000 మీ దగ్గర తీసుకొమ్మని చెప్పాడు. మీరు 50000 మాత్రమే ఇచ్చారు.

క్యాషియర్: ఇవాళ చాలా మందికి డబ్బులు ఇచ్చాను. అర్జెంటుగా అవసరమని 2 లక్షలు మేనేజర్ ఐదు నిమిషాలముందు తీసుకెళ్లాడు. అందుకే తక్కువ అయింది. సారీ…. 50000 మాత్రమే మిగిలింది. మిగిలింది ఇవ్వాలి కదా, అప్పుడు అంతా తీసుకో.

అమల: సరే సార్. సార్ కి చెప్పండి.

క్యాషియర్: డబ్బు లెక్క పెట్టుకుని ఇక్కడ బుక్కులో పేరు రాసి సంతకం పెట్టు. అలాగే ఈ వోచరులో కూడా అని అన్నాడు.

అమల: పర్వాలేదు. నేను సంతకం పెడతాను.

క్యాషియర్: డబ్బు విషయంలో అలా కాదు. డబ్బు సరిగ్గా ఉందని లెక్కబెట్టుకున్న తరువాత సంతకం పెట్టండి.

అమల: నేను డబ్బు లెక్కపెట్టుకుని సరిగ్గా ఉందన్నాను. తను 50000 అని రాసి బుక్కు, వోచరు ఇచ్చాడు. నేను పేరు రాసి సంతకం పెట్టాను.

మా అమ్మనాన్నలకు జరిగింది చెప్పి డబ్బు ఇచ్చాను. సరే మిగిలింది తొందరగా తీసుకో అని నాన్న అన్నాడు.

నాలుగు రోజులు షూటింగ్ నుండి సెలవు దొరికింది. తరువాత షూటింగుకు వెళ్ళినా క్యాషియర్ కాని ప్రొడ్యూసర్ కాని దొరకలేదు. అప్పటికే రెండవ వారం కూడా గడిచింది. ఒకరోజు షూటింగ్ జరుగుతుండగా ప్రొడ్యూసర్ వచ్చారు. నేను వెళ్ళి మాట్లాడాబోయేంతలో డైరెక్టర్ నన్ను పిలిచాడు. నా షాట్ ముగిసేసరికి ప్రొడ్యూసర్ బయలుదేరబోతున్నాడు.

అమల: సార్…. సార్….

ప్రొడ్యూసర్: ఏంటి? తొందరగా చెప్పు. నేను వెళ్ళాలి.

అమల: సార్…. డబ్బులు

ప్రొడ్యూసర్: “ఏయ్… కాషియర్ ఆ ఆమ్మాయికి డబ్బులు ఇచ్చి పంపించు. ఆంటూ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు.

క్యాషియర్: డబ్బులు ఎప్పుడు తీసుకుంటావు.

అమల: నేను సమాధానం చెప్పే లోపల డైరెక్టర్ నన్ను పిలిచాడు.

క్యాషియర్: సరే తరువాత కనపడు.

తరువాత ఆ రోజు సాయంత్రం క్యాషియర్ దగ్గరికి వెళ్లి డబ్బులు అడిగాను.

క్యాషియర్: సరే కూర్చో ఇస్తాను. అని డబ్బు తీసి లెక్కబెడుతున్నాడు.

అంతలో క్యాషియర్ “అర్జెంటుగా అయిదు లక్షలు కావాలి ఇవ్వు” అని ఒకరు వచ్చారు. ఇప్పటికిప్పుడు అయిదు లక్షలు అంటే ఎలా కుదురుతుంది. అక్కడ లోకేషన్ ఓనరు డబ్బుల కోసం వచ్చాడు. ప్రొడ్యూసర్ లేడు, రేపు మాట్లాడుకుందామని చెబుతుంటే కుదరదు, నేను వారం రోజుల నుంచి తిరిగాను. ఇప్పుడు డబ్బులు ఇస్తేనే షూటింగ్ చేసుకోండి, లేదంటే రాత్రికి ఖాళీ చేసుకుని వెళ్లిపోండి. ఆ ప్రొడ్యూసర్ ఫోన్ తీయడం లేదు. డైరెక్టర్ నా నెత్తి మీద కూర్చొన్నాడు. డబ్బులు ఇవ్వకపోతే ఇప్పుడు షూటింగ్ అయిపోతుంది. భయ్యా వేరే వాళ్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవి. షూటింగ్ ఆగిపోతుంది. అర్థం చేసుకో. ఇంతలో ఫోన్ మోగింది. డబ్బుల కోసం అప్పుడే మళ్ళీ ఫోన్ కూడా చేస్తున్నారు. హలో వసున్నాను సార్. అంత తొందర అయితే ఎలా? అని ఫోన్ పెట్టేశాడు. కావాలంటే పొద్దున్నే నేను ప్రొడ్యూసరుతో చెప్తాను. ఇప్పుడు డబ్బులు ఇవ్వు. ఆ బుక్కులో సంతకం పెడతాను డబ్బులు ఇవ్వు.

క్యాషియర్: అలాగే ఈ వోచరులో కూడా ….

తొందరగా ఇవ్వు. కాస్త లెక్కపెట్టుకో…. ఉంటుందిలే అని అనుకుంటూ తొందరగా డబ్బుతీసుకుని వెళ్ళిపోయాడు.

అమల: సార్ …. డబ్బులు

క్యాషియర్: చూశావు కదా నా పరిస్ధితి. వీళ్ళతో వేగాలంటే చాలా కష్టం. ఎంత ఉందో చూస్తాను ఉండు.