రీతూ పాల్ – Part 3 87

అమల: నాకు వారి ఫోన్ నెంబర్లు ఇవ్వడం కుదురుతుందా.
రెసెప్షనిష్టు: మేడమ్ అలాంటి పనులు చేస్తే నా ఉద్యోగం ఊడిపోతుంది.
అమల: నేను నీ పేరు బయటకు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటాను. ఏదో సినిమా ఛాన్స్ వస్తే నిన్ను గుర్తుపెట్టుకుంటాను అని తీసి ఇంకో రెండు వందలు తీసి చేతిలో పెట్టి నాకు కాస్త సహాయం చెయ్యి.

రెసెప్షనిష్టు: “ఇంకొక రెండు నిమిషాల తర్వాత రా” అని చెప్పి వెనక్కు వెళ్ళింది.
నేను కాసేపు తర్వాత బయటికి వెళ్ళి పోతుంటే పిలిచి ఒక పేపర్ లో చేతిలో పెట్టి ఈ నెంబరుకు ఫోన్ చేయమని చెప్పింది.

నేను ఇంటికి వెళ్లి ఆ నంబర్ కి ఫోన్ చేశాను.
ఆసిఫ్: హలో
అమల: హలో ఆసిఫ్ సార్ ఉన్నారా
ఆసిఫ్: అవును నేను ఆసిఫ్, చెప్పండి
అమల: సర్ నా పేరు అమల. సినిమాలో ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాను. మీకు ఏదైనా ఆఫర్స్ ఉంటే చెప్పండి.
ఆసిఫ్: హలో మేడం, నేను బ్రోకర్ ను కాదు, హీరోని. అయినా నా నంబర్ ఎవరు ఇచ్చారు, అని కట్ చేశాడు
నేను ఇంకో సారి ట్రై చేశాను. ఫోన్ ఎత్తి మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా అని కట్ చేశాడు.

ఆమ్మ: ఏంజరిగింది. అలా ఉన్నావు.
అమల: నేను జరిగింది అమ్మకు చెప్పాను.
అమ్మ: సరే ఆ పోన్ నంబరు నాకు ఇవ్వు.

ఆరోజు సాయంత్రం
అమ్మ: ఈ ఫోన్ కు మెసేజి వచ్చింది చూడు.
అమల: మెసేజ్ చేశాను. అందులో “మీ పేరు, వివరాలు చెప్పండి” అని ఉంది. ఏం జరిగింది ఎవరు అని అడిగాను.
అమ్మ: అదే నువ్వు ఇచ్చిన నంబరుకు నీ ఫోటోలు పంపించాను. వెంటనే రిప్లై ఇచ్చాడు.
అమల: ఎక్కడినుంచి వచ్చాయి ఇన్ని తెలివితేటలు?
అమ్మ: అంతా నీతో తిరగడం వల్ల సినిమా వాళ్ళ అలవాట్లు తెలిసాయి. జాగ్రత్తగా మెసేజి చెయ్యి.
అమల: సరే…

నా పేరు, వివరాలు పంపి ఏదైనా సినిమా ఉంటే చెప్పమని మెసేజ్ పెట్టాను. తర్వాత నాకు ఒక అడ్రస్ పంపి రేపు మధ్యాన్నం మూడు గంటలకు కలవమని అన్నాడు. నేను వెళ్ళి అమ్మతో ఈ విషయాన్ని చెప్పాను. అమ్మ కూడా సంతోషించి “సరే రేపు తమ్ముణ్ణి తీసుకుని మీ ఇద్దరు వెళ్ళిరండి” అని చెప్పింది. సరే అన్నాను. తర్వాతి రోజు ఉదయం 9:50 కి స్టుడియోకి ఫోన్ చేశాను. ప్రొడ్యూసర్ ఇవాళ రావట్లేదు. ఏదో అర్జెంట్ పని బయటికి వెళ్లారు. తన అపాయింట్మెంట్ తర్వాత రోజు కి ఇవ్వమన్నారు అని రిసెప్షనిస్ట్ చెప్పింది. “సరే, నేను రేపు మళ్ళీ ఫోన్ చేస్తాను” అని ఫోన్ పెట్టేశాను. మధ్యాహ్నం భోజనం చేసి బాగా తయారయ్యి తమ్ముణ్ణి పిలుచుకుని స్కూటీలో వారు చెప్పినట్లు అడ్రసుకి వెళ్ళాను.

మేము వెళ్ళేటప్పటికి 2:50 సమయం అయ్యింది. అది ఆఫీస్ మాదిరి అనిపించడం లేదు. మేము గేటు దగ్గర స్కూటీని ఆపి లోపలికి వెళ్ళేటప్పటికి ఆ సమయంలో ఆసిఫ్ అక్కడే కూర్చుని ఉన్నారు.

ఆరోజు రాత్రి భోజనం తరువాత మా అమ్మ నా రూమ్ లోనికి వచ్చి

అమ్మ: మధ్యాహ్నం వెళ్లి వచ్చారు కదా. ఇంతకీ ఏం జరిగింది? ఏదైనా సినిమా ఛాన్స్ వచ్చేఅవకాశం ఉందా?

అమల: ప్రస్తుతానికైతే ఏదీ లేదు కానీ కొద్ది రోజుల్లో ఏదైనా వస్తుందేమో చెప్పలేను.

అమ్మ: అదేంటే?

అమల: అదేనమ్మా ఇప్పుడు నేను అప్లై చేసిన ప్రొడ్యూసరుకు కాస్త అమ్మాయిల పిచ్చి ఉంది అని అతను అన్నాడు. కాబట్టి నాకు అనుమానంగా ఉంది.

అమ్మ: అయ్యో రామ ఇది కూడా పోయినట్టేనా! మీ నాన్న డబ్బులు పోయాయి అని చిటపట లాడుతున్నాడు.

అమల: కొద్ది రోజులు చూస్తాను.

అమ్మ: ఏదో ఒక సినిమా మొదట చేసి డబ్బులు తీసుకుంటే ఇబ్బంది లేకుండా హాయిగా ఉంటుంది.

అమల: ఏదైనా ఉంటే వెంటనే నీకు చెప్పాను.

అమ్మ: “సర్లే నువ్వు పడుకో. నాకు ఎలాగూ మీ నాన్న గోల తప్పేది కాదు. ఏదో ఒక సినిమా తొందరగా చూద్దాంలే.” అని లేచి వెళ్ళి పోయింది.

ఎంత ఆలోచించినా ఏమీ తోచక సరే అప్పటికప్పుడు చేసి ఏమీలేదు అని దుప్పటి కప్పుకుని పడుకున్నాను. అలా ఒక రెండు రోజులు గడిచింది. తర్వాత నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆసిఫ్ నుండి.

ఆసిఫ్: హలో

అమల: హలో, చెప్పండి సార్

ఆసిఫ్: అమల ఇప్పుడు ఏదైనా సినిమా దొరికిందా?

అమల: ఇంకా ఏమీ లేదు, మీతో మాట్లాడిన తర్వాత ఆ సినిమా ఆశ వదులుకున్నాను. అప్పటినుండి ప్రొడ్యూసరుకు నేను ఫోన్ చేయలేదు.

ఆసిఫ్: సరే నాకు ఒక విషయం తెలిసింది. ఒక డైరెక్టర్ కొత్త అమ్మాయి కోసం వెతుకుతున్నాడు. పెద్ద వాళ్ళు ఇద్దరు అందులో నటిస్తున్నారు అని తెలిసింది. ఒకవేళ నీకు ఇష్టమైతే అప్లై చెయ్యి. నీ అదృష్టం ఎలా ఉందో.

అమల: సార్ అక్కడ ఏమి ఇబ్బంది లేదుగా?

ఆసిఫ్: నేను ఆ డైరెక్టర్ గురించి విచారించాను. చాలా మంచివాడు అని తెలిసింది. ఒకసారి నీ ప్రయత్నం చెయ్యి. మిగిలిన విషయాలు తరువాత చూసుకో.

అమల: అలాగే సార్ వారి డీటెయిల్స్ నాకు పంపించండి. అసలు నన్ను గుర్తు పెట్టుకొని ఫోన్ చేసినందుకు చాలా థ్యాంక్స్.

ఆసిఫ్: అలా ఏం లేదు. మా ఇంటి దగ్గరకు వచ్చి సహాయం అడిగినవారికి నేను లేదు అని చెప్పను. ఎంత ఇబ్బంది ఉంటే తప్ప అలా వచ్చి అడగరు.

అమల: అవునా సార్

ఆసిఫ్: మొదట నన్ను సార్ అనడం ఆపు.

అమల: సరే అలా అయితే ఆసిఫ్ గారు అని పిలుస్తాను, కాదనకండి.

ఆసిఫ్: సరే. నేను డీటెల్స్ పంపిస్తాను. ఒకవేళ అక్కడ అవకాశం దొరుకుతుందో లేదో, కానీ ప్రయత్నం కూడా చేయకుండా వదిలేయడం మంచిది కాదు. తర్వాత నీ ఇష్టం.

అమల: నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. మరి ఇంకేదైనా మీకు తెలిస్తే నాకు చెప్పండి సార్.. కాదు… కాదు… ఆసిఫ్ గారు…

ఆసిఫ్: నవ్వుతూ “తప్పకుండా”. నువ్వు ఏమీ అనుకోను అంటే ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను.

అమల: చెప్పండి

ఆసిఫ్: నీకు అంత ఇబ్బందిగా ఉంటే నువ్వు అప్లై చేసిన ఆ ప్రొడ్యూసరుతో మాట్లాడి చూడు. ఒకవేళ మీ పరిస్థితిని బట్టి నీ నిర్ణయం ఏదైనా చేసుకో. పెద్ద సినిమాలకు చాలా పోటీ ఉంటుంది. అందుకని చేతిలోకి వచ్చే అవకాశాన్ని పోగొట్టుకోవద్దు.

అమల: సరే ఆలోచించి చూస్తాను.