రీతూ పాల్ – Part 3 87

అమల: ఎలాంటి టైములో వచ్చాను అని మనసులో అనుకుంటున్నాను.

క్యాషియర్: అంతా కలిపి ఇదే ఉంది. లెక్కపెట్టుకో.

అమల: సార్ 49000 మాత్రమే ఉంది.

క్యాషియర్: నీ కోసం అని డబ్బులు పెట్టుకుంటే నీ కళ్ళ ముందే ఇలా జరిగింది. ఇప్పటికి ఇది తీసుకెళ్ళు. మిగిలింది రేపు మధ్యాన్నం తీసుకో. సాయంత్రం రావద్దు.

అమల: సరే సార్. సార్ కి చెప్పండి.

క్యాషియర్: ఇక్కడ బుక్కులో పేరు రాసి సంతకం పెట్టు. అలాగే ఈ వోచరులో కూడా అని అన్నాడు.

అమల: తను 49000 అని రాసి బుక్కు, వోచరు ఇచ్చాడు. నేను పేరు రాసి సంతకం పెట్టాను.

మా అమ్మనాన్నలకు జరిగింది చెప్పి డబ్బు ఇచ్చాను. అప్పుల వాళ్ళకి ఇస్తానని చెప్పాను. సరే రేపు మిగిలింది తీసుకో అని నాన్న అన్నాడు.

తరువాతి రోజు మధ్యాన్నం క్యాషియర్ దగ్గరకు వెళ్ళి

అమల: సార్ డబ్బులు

క్యాషియర్: తను 1000 అని రాసి బుక్కు, వోచరు ఇచ్చాడు.

అమల: ఇదేంటి సార్.. వెయ్యి రూపాయలు. మిగిలింది

క్యాషియర్: నాకేమీ తెలియదు. ఏదైనా ఉంటే ప్రొడ్యూసరుతో మాట్లాడు. నాకు చెప్పినంతా నీకు ఇచ్చేశాను. ముందు దీనిలో సంతకం పెట్టండి.

అమల: నేను పేరు రాసి సంతకం పెట్టాను. ప్రొడ్యూసరు ఎక్కడ. నేను వెళ్ళి అడుగుతాను.

క్యాషియర్: అక్కడ వాళ్ళ రూములో ఉంటారు వెళ్ళు.

ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు. 5 లక్షల రూపాయలు ఇస్తానని లక్షల రూపాయలు ఇస్తే సరిపోతుందా? ఏమనుకుంటున్నారు అని అనుకుంటా కోపంగా వెళ్లి తలుపు తోశాను. లోపల ప్రొడ్యూసర్ అనన్య ఒకరినొకరు కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటున్నారు.
తలుపు తెరుచుకోగానే నన్ను చూసి ఇద్దరూ దూరంగా జరిగారు.

ప్రొడ్యూసర్: కోపంతో “లోపలికి వచ్చే ముందు పర్మిషన్ అడిగానని తెలీదా?”

అమల: నేను వారిద్దరినీ అలా చూసి ఒక్క క్షణం నోట మాట రాలేదు. పైగా నేను ఎందుకు వచ్చానా అని అలా కోపంగా ఇద్దరూ చూస్తున్నట్టుంది. నేను వెనక్కు తిరిగాను

ప్రొడ్యూసర్: కోపంతో “అమల ఆగు. ఏం జరిగింది? ఇలా రా?”

నేను వెళ్తాను అని అనన్య బయటకు వెళ్ళిపోయింది. నేను లోపలికి వెళ్ళాను.

అమల: క్యాషియరుతో డబ్బులు అడిగితే మిమ్మల్ని అడగమన్నాడు.

ప్రొడ్యూసర్: ఫోన్ చేసి “నా రూములోకి రా” అని ఫోన్ పెట్టాడు. నువ్వుకూర్చో.

నేను కూర్చొన్నాను. తను కూడా కూర్చొన్నాడు. వెంటనే క్యాషియరు వచ్చాడు.

ప్రొడ్యూసర్: ఏం జరుగుతోంది. డబ్బులు ఇవ్వలేదని చెబుతోంది. అన్నీ నేనే చూసుకోవాలా.

క్యాషియర్: మీరు చెప్పినంతా ఇచ్చాను సార్. ఇంకా కావాలని అడుగుతోంది.

అమల: లేదు సార్. లక్ష రూపాయలు ఇస్తే ఎలా సరిపోతుంది. మిగిలిన నాలుగు లక్షలు ఇవ్వాలి కదా.

క్యాషియర్: అబద్దం సార్. నేను అంతా ఇచ్చాను.

ప్రొడ్యూసర్: ఏం జరుగుతోంది. ఎవరు అబద్దం చెబుతున్నారు.

అమల: లేదు సార్. నేను మొదట 50000, నిన్న 49000 తీసుకున్నాను. ఇవాళ 1000 మాత్రం ఇచ్చాడు. బుక్కులో కూడా రాసి సంతకం పెట్టాను సార్. కావాలంటే చూడండి. నేను ఎందుకు అబద్ధాలు చెప్పాలి సార్.