రీతూ పాల్ – Part 3 87

అశోక్: తను అమల అని ఆసిఫ్ ఫ్రెండ్

విజయ్: హలో అమల

అమల: హాయ్

అశోక్: నాకు కాస్త అర్జెంట్ పని ఉంది. నేను వెళతాను. మీరు మాట్లాడుకోండి.

ఆసిఫ్: ఇలా మిమ్మల్ని వదిలి మధ్యలో వెళితే ఎలా? కాసేపు ఆగు.

విజయ్: ఉండచ్చుగా ఇప్పుడే వచ్చి వెళతానంటే ఎలా?

అశోక్: “ఒకరిని అర్జెంటుగా రిసీవ్ చేసుకోవాలి. ఆసిఫ్, విజయ్ నాకు చాలా కాలం నుండి తెలుసు అలాగే నీ గురించి కూడా తనకు చెప్పాను. మీరు ఇద్దరూ మాట్లాడుకోండి. ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి. విజయ్ నేను సాయంత్రం నాలుగు గంటలకు వస్తాను. మనం కలసి బయటకు వెళదాం.” అని లేచి బయలుదేరబోయాడు.

ఆసిఫ్: సరే అశోక్…. బాయ్….

విజయ్: బాయ్…. తొందరగా రా…..

అశోక్: తొందరగా రా వస్తాను….. బాయ్…. బాయ్…. అమల.

అమల: బాయ్…

విజయ్: కాఫీ, టీ, జూస్ ఏది తీసుకుంటారు.

ఆసిఫ్: ఫర్వాలేదు. ఏమీ వద్దు.

విజయ్: మీ అశోక్ తో ఉన్నట్టే నాతో కూడా ఉండండి. కొత్త అని మొహమాటపడకండి. మీకు … అని నా వైపు చూశాడు.

అమల: మీ ఇష్టం….

విజయ్: వెంటనే ఫోన్ చేసి కాఫీ చెప్పాడు. ఇప్పుడు చెప్పండి… అంటూ మా వైపు చూశాడు.

ఆసిఫ్: ఈ అమ్మాయి పేరు అమల.

విజయ్: ఇందాకే చెప్పారు కదా.

ఆసిఫ్: నేను సూటిగా విషయానికి వస్తాను. నేను తమిళ సినిమాలో నటించాలని అనుకుంటున్నాను. తను కూడా ఇంతవరకు మలయాళం సినిమాలను చేసింది. ఏదైనా అవకాశం మాకు ఇస్తారేమో చూడండి.

విజయ్: సినిమా అయితే ఆలోచనలో ఉంది. దానిలో నీకు మీకు ఎటువంటి క్యారెక్టర్లు ఇవ్వాలి అనేది కాస్త ఆలోచించుకోవాలి.

అమల: నేను ఆల్బం తెచ్చాను. మీరు ఇకసారి చూస్తే … అని ఆల్బం బయటకు తీయబోయింది. ఆప్పటికి కాఫీ వచ్చింది.

విజయ్: ముందు కాఫీ తాగండి. అని ఆల్బం తీసుకుని కాఫీ తాగుతూ ఫోటోలను చూస్తున్నాడు.

మేము కూడా కాఫీ తాగాము.

విజయ్: మీ ఇద్దరి ఫోన్ నెంబర్లు ఇవ్వండి. ఒక పది రోజుల తర్వాత నాకు ఒకసారి ఫోన్ చేయండి. అలాగే మీ ఫోటోలు కొన్ని పంపిస్తే నేను మా ప్రొడ్యూసరుకి చూపిస్తాను. ఇది నా కార్డు అని చెరొక కార్డు ఇచ్చాడు.

అమల: మా ఫోన్ నెంబర్లు ఇచ్చాము.

ఆసిఫ్: మీ సినిమా ఎలాంటిది కధ అనుకుంటున్నారు.

విజయ్: కూతురికి దూరమైన తండ్రి పడే బాధ. వారి మధ్య ప్రేమను చూపించే విధంగా తీయాలనుకున్నాను.