రీతూ పాల్ – Part 3 87

అమల: సార్ తను మా అమ్మ. మీతో మాట్లాడాలని అంటే తీసుకువచ్చాను.

ప్రొడ్యూసర్: అమల మీ అమ్మని ఎందుకు తీసుకువచ్చావు. నేను చెప్పాల్సింది నీతో అప్పుడే చెప్పాను. నీకు ఏది ఇష్టమో అదే చేయండి. నేను దేనికీ బలవంతం చెయ్యను.

అమ్మ: సార్ అమ్మాయి అంతా చెప్పింది. మేము అలాంటి వాళ్ళం కాదు. ఏదో మర్యాదగా పని చేసి బ్రతికే వాళ్ళం. మా కష్టానికి మాత్రం ప్రతిఫలం అడుగుతాము. ఏదో అమ్మాయి ఇష్టపడినదని దాన్ని సినిమాల్లోకి పంపిస్తున్నాను. మీరు కాస్త పెద్దమనసు చేసుకుని అమ్మాయి అడిగిన దాని కాన్నాఏదో కొద్దిగా తగ్గించి ఇస్తే బాగుంటుంది.

ప్రొడ్యూసర్: చూడండి. ఇది కూరగాయల బేరం మాట్లాడినట్టు కాదు. అమల నేను అప్పుడే చెప్పాను 5 లక్షల కన్నా ఎక్కువ ఇవ్వలేను. మీకు నచ్చితే ఒప్పుకోండి లేదంటే మీరు బయలుదేరండి. కావాలంటే ఇంకా ఒక పది నిమిషాలు ఆలోచించుకుని చెప్పండి.

అమ్మ: ఆలోచించడానికి ఏముంది. ఏదో ఒకసారి అడగాలని అడిగాను. మీరు అదే ఇవ్వండి అమ్మాయి సినిమా చేస్తుంది.

ప్రొడ్యూసర్: సరే. అని ఫోన్ చేసి “అగ్రిమెంటు రఫ్ ప్రింట్ తీసుకొని రా”. ఒక రెండు నిమిషాల్లో అగ్రిమెంట్ రఫ్ కాఫీ తీసుకొని రిసెప్షనిస్ట్ వచ్చింది. దీన్ని బాగా చదువుకుని మీరు ఏదైనా ఆడగాలని అనుకుంటే అడగండి. మీ పేరు అడ్రస్ర్ వ్రాసి ఇస్తే అగ్రిమెంటు తెప్పిస్తాను.

అమల: మేము ఒకసారి అగ్రిమెంటు చదివాము. సరే అన్నట్టుగా అడ్రస్ర్ వ్రాసి ఇవ్వమంది.

ప్రొడ్యూసర్: ఫోన్ చేసి “లోపలికి రా”.

రిసెప్షనిస్ట్: సార్.

ప్రొడ్యూసర్: వీరి అడ్రస్ అందులో ఉంది. అది కూడా టైపింగ్ చేసి అగ్రిమెంటు రెండు కాపీలు ప్రింట్ తీసుకొని రా.

రిసెప్షనిస్ట్: “ఇదు నిమిషాలు సార్.” అని బయటకు వెళ్ళింది.

అమ్మ: సార్ అడ్వాన్స్ ఏమైనా కొంచెం ఇప్పుడు ఇస్తే ….?

ప్రొడ్యూసర్: ప్రస్తుతానికి డబ్బు అందుబాటులో లేదు. ఇంక వారానికి సినిమా మొదలు అవుతుంది. అప్పుడు ఇస్తాను. అదే విషయం అందులో ఉంది.

ఇదు నిమిషాల తరువాత “సార్” అని లోపలికి వచ్చి అగ్రిమెంటు రెండు కాపీలు ప్రొడ్యూసరుకు ఇచ్చింది. వాటిని ఇకసారి చదివి

ప్రొడ్యూసర్: అమల ఇంకొక సారి చదువుకుని దానిమీద సంతకం పెట్టు.

నేను వాటిని ఒకసారి చదివి సంతకం పెట్టి ఇచ్చాను. తను కూడా సంతకం పెట్టి ఒక కాపీ నాకు ఇచ్చాడు. ఇంకొక కాపీ రిసెప్షనిస్ట్ చేతికి ఇచ్చి ఫైలులో పెట్టమన్నాడు.

అమ్మ: షూటింగ్ ఎప్పుడు అనేది కాస్త ఫోన్ చేసి చెబితే…..

ప్రొడ్యూసర్: ఒక వారం తర్వాత షూటింగ్ మొదలవుతుంది. ఒక నెల లోపలే షూటింగ్ మొత్తం అయిపోతుంది. మా మ్యానేజర్ మీకు ఫోన్ చేస్తాడు. మీ ఫోన్ నెంబర్ రిసెప్షన్ లో ఇచ్చి వెళ్ళండి.

మేము ఫోన్ నెంబర్ రిసెప్షన్ లో ఇచ్చి ఇంటికి చేరుకున్నాము. రాత్రి నాన్నకు సినిమా డబ్బుల విషయం చెప్పాము.

తమ్ముడు: కంగ్రాట్స్ అక్కా……

నాన్న: సరే ఏదో ఒకటి. తొందరగా డబ్బులు తీసుకోండి. నేను అప్పుల వాళ్ళకు ఏదో సర్ది చెబుతాను. అలాగే వేరే సినిమాల కోసం ప్రయత్నం చేయండి. ఇంకాస్త డబ్బులు ఎక్కువ అడగండి.
చాలా రోజుల తరువాత నాన్న కాస్త ఆనందంగా భోజనం చేశాడు. తరువాత రోజు విజయ్ అడ్రసుకు నా వివరాలు ఫోటోలు పోస్టులో పంపాను.

పది రోజుల తర్వాత షూటింగ్ మొదలైంది. ఒక వారం రోజులు షూటింగ్ చేశాం. నాన్న డబ్బులు ఆడిగాడు. మా అమ్మ కూడా డబ్బులు తొందరగా అడగాలి. లేదంటే షూటింగ్ అయిపోతుంది. తరువాత డబ్బులు ఇవ్వరు అని రోజూ చెబుతోంది. నాకు అర్థం అవుతోంది అమ్మా. నేను ప్రొడ్యూసర్ కోసం ఎదురుచూస్తున్నాను కానీ తను దొరకడం లేదు. చివరకు వారం తర్వాత ప్రొడ్యూసర్ దొరికాడు.

అమల: సార్….

ప్రొడ్యూసర్: అమల ఏంటి? షూటింగ్ బాగా జరుగుతోందా? నీకు ఏమి ఇబ్బంది లేదు కదా?

అమల: సార్ షూటింగ్ బాగా జరుగుతోంది. ఇబ్బంది లేదు.

ప్రొడ్యూసర్: ఇంకేంటి?

అమల: అదే సార్ డబ్బులు… కావాలి.

ప్రొడ్యూసర్: క్యాషియర్ దగ్గర తీసుకో.

అమల: సార్ ఎంత తీసుకోవాలి. సగం డబ్బులు ఇప్పుడు తీసుకో. మిగిలింది తర్వాత ఇస్తాను.

అమల: సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు తీసుకుంటాను సార్. ఇంకా షూటింగ్ జరుగుతోంది.

ప్రొడ్యూసర్: నేను అప్పటిదాకా ఉండను. నువ్వు క్యాషియర్ దగ్గర డబ్బులు తీసుకో. అనన్యను రమ్మన్నానని చెప్పు.

అమల: సరే సార్.