రీతూ పాల్ – Part 3 87

అమల: చాలా బాగుంది. ఇంకా…!

విజయ్: నేను రాసిన కధ. మంచి ప్రొడ్యూసరు దొరికాడు. ఇంతకన్నా ఏమీ చెప్పలేను ఇప్పుడు.

ఆసిఫ్: మరి మేము ఇంక బయలుదేరుతాము.

విజయ్: అప్పుడేనా? అశోక్ వచ్చేదాకా ఉండండి.

ఆసిఫ్: అంతదాకా అంటే చాలా లేటవుతుంది. నేను ఒక్కడు అయితే ఇబ్బంది ఏమీ లేదు. తనను అంతసేపు ఇక్కడ …

విజయ్: సరే …. మీ ఫోటోలు కొన్ని ఆ అడ్రసుకు పంపించండి. అది నా ఇంటి అడ్రస్.

అమల: డైరెక్టర్ అంటే చాలా పెద్దవారు అని అనుకున్నాను. కాస్త భయపడుతూ వచ్చాను. మీరు ఇంత ఫ్రీగా మాట్లాడతారు అని అసలు అనుకోలేదు.

విజయ్: అలాంటిదేం లేదు. అశోక్ మీ ఫ్రెండ్ అంటే నేను కూడా మీ ఫ్రెండ్ లాంటి వాడిని. డైరెక్టర్ అంటే చాలా సీరియస్ గా ఉండాలని ఏం లేదు. నాకు మటుకు ఎవరైనా చెప్పిన పని సరిగ్గా చేస్తే చాలు. నా సినిమాలో ఏదో ఒకటి సరిపోయేలా ప్రయత్నం చేస్తాను.

ఆసిఫ్: సరే విజయ్. మేము బయలుదేరుతాము.

అమల: విజయ్ గారు .. బాయ్….

విజయ్: సరే బాయ్… చెబుతున్నాప్పుడు అమల వైపు చూస్తూ కళ్ళల్లో ఒక ఆనందం

దారి మధ్యలో కారులో వస్తూ

అమల: అంత సులభంగా ఒక డైరెక్టర్ మనతో మాట్లాడడం నేను నమ్మలేకపోతున్నాను.

ఆసిఫ్: అమల కచ్చితంగా నీకు అవకాశం వస్తుంది.

అమల: మరి మీకు?

ఆసిఫ్: నాకు మాత్రం అనుమానమే

అమల: ఎలా చెప్పగలరు?

ఆసిఫ్: నీ పోటోలు చూస్తున్నప్పుడు అతని కళ్ళలో ఆనందం గమనించాను.

అమల: మీరు మరి ఇంతలా?

ఆసిఫ్: నీకు బాయ్ చెప్పినప్పుడు కూడా తన కళ్ళలో తేడా నేను గమనించాను. నీకు ఇంతకు ముందే చెప్పాను కదా. ఆ సినిమా అదే ఆ అమ్మాయి అనన్య ఆ డైరెక్టర్ నన్ను కలిసినప్పుడు వాడి వెధవ వేషాలు గమనించాను.

అమల: ఊ.. ఊ.. నేను ఊ కొడుతూ వింటున్నాను

ఆసిఫ్: మళ్లీ ఏమైనా ఆ సినిమా గురించి ఆలోచించావా?

అమల: రేపు ఏదో ఒకటి తేలిపోతుంది. ఏదైనా కానీ అది నీ ఇష్టం. నీ జాగ్రత్త నీది.

ఇలా మాట్లాడుకుంటూ మేము తిన్నగా ఆసిఫ్ ఇంటికి వచ్చేసాము. అప్పటికే దాదాపు రెండు గంటలు కావస్తోంది. నేను ఇంటికి వెళతాను అని అన్నా మా ఇంట్లో భోజనం చేసి వెళ్లాలి అప్పుడే సమయం కూడా దాటిపోతోంది అని వాళ్ళ ఇంట్లో భోజనం చేసే వరకు వదలలేదు. భోజనం తర్వాత ..

అమల: అసలు మీరు ఇంత మంచివారని అసలు ఊహించలేదు. సినిమా ఫీల్డ్ లో మీ లాంటి మంచి వాళ్ళు పరిచయం కావడం నా అదృష్టం.

ఆసిఫ్: మీరు నా గురించి చాలా పొగుడుతున్నారు. నాకు పొగడ్తలంటే ఇష్టం లేదు.

అమల: అలాంటిది లేదు. ఇది నిజం. నేను ఇక బయలుదేరుతాను.

తర్వాత నేను ఇంటికి తిరిగి వచ్చి కాసేపు పడుకున్నాను. సాయంత్రం ఐదు గంటలకు అమ్మ వచ్చి నిద్ర లేపింది. టీ తాగుతూ జరిగింది మొత్తం చెప్పాను.

అమల: అమ్మ.. మరి రేపు ఏం చెప్పాలి? ఆలోచించావా?

అమ్మ: నువ్వు ఏమనుకుంటున్నావు?

అమల: నాకు అలా గెస్టుహౌసుకు వెళ్లడానికి ఇష్టం లేదు. పైగా వేరేసినిమాలు ఇప్పుడు లేవు. కాబట్టి డబ్బు తక్కువ అయినా పర్వాలేదు అని అనుకుంటున్నాను.

అమ్మ: సరే. నేను కూడా అలాగే చెబుదామనుకున్నాను. రేపు నేను ఏమైనా రావాలా?

అమల: నువ్వు కూడా వస్తే బాగుంటుంది.

అమ్మ: సరే, రేపు నువ్వు తొందరగా లేస్తే ఇంట్లో పనులు ముగించుకుని మనం కలిసి వెళదాం.

తర్వాత రోజు ఆఫీసుకు చెప్పిన సమయానికి మేమిద్దరం చేరుకున్నాం. నేను కనబడగానే రిసెప్షనిస్టు వెంటనే ఫోన్ చేసి అడిగి, మమ్మల్నిలోపలికి పంపించింది.

ప్రొడ్యూసర్: కూర్చోండి.